Latest Updates
-
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే!
చింతపండులో ఇంత మ్యాటర్ ఉందా? తింటే ఏమవుతుందో తెలుసా?
పేదవాళ్లయినా, ధనవంతులైనా సరే మనదందరి ఇళ్లల్లో చింతపండు తప్పక ఉంటుంది. సాంబార్, రసం, పప్పు ఇలా ఏదైనా వంటకాలకు చింతపండు ప్రాణం పోస్తుంది, అద్భుతమైన టేస్ట్ ను అందిస్తుంది. అయితే వంటల్లో రుచి కోసమే చింతపండు వాడతారని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఆ చింతపండులోని పులుపు వెనుక ఒక అద్భుతమైన ఆరోగ్య నిధి దాగి ఉందన్న విషయం మీకు తెలుసా? ఆరోగ్య నిపుణులు సైతం చింతపండును ఒక సహజమైన సూపర్ ఫుడ్ గా అభివర్ణిస్తున్నారు.

పోషకాల గని చింతపండు
చింతపండులో మన కంటికి కనబడని ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ C తో పాటు, B-కాంప్లెక్స్ విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ (పీచుపదార్థం), శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని రోజూవారి ఆహారంలో తగిన మోతాదులో భాగం చేసుకుంటే ఎన్నో రోగాలను దరికి చేరకుండా అడ్డుకోవచ్చు.
గుండెకు శ్రీరామరక్ష
పిల్లలు లేదు పెద్దలు లేదు వయసుతో తేడా లేకుండా చాలామంది గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. గుండెను పదిలంగా కాపాడుకోవడంలో చింతపండు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు రక్తనాళాలను శుభ్రపరుస్తాయి. శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును (హై బీపీని) కంట్రోల్ లో ఉంచుతుంది.
బరువు తగ్గించే అద్భుత ఔషధం
బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా చింతపండు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్(HCA) అనే ప్రత్యేక సమ్మేళనం, మనకు పదే పదే ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది. సరైన వ్యాయామం, బ్యాలెన్స్ ఫుడ్ కి చింతపండును కూడా జోడిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి మేలు
పొట్ట ఆరోగ్యానికి చింతపండు చేసే మేలు అంతాఇంతా కాదు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేసి, ఎంతోమందిని వేధించే మలబద్ధకం సమస్యను ఇట్టే మాయం చేస్తుంది. అలాగే, వాతావరణం మారినప్పుడల్లా వచ్చే జలుబు, ఇన్ఫెక్షన్లను తట్టుకోవాలంటే మనకు రోగనిరోధక శక్తి ఎంతో అవసరం. చింతపండులోని విటమిన్ సి, యాంటీ ఫంగల్ లక్షణాలు మన రోగనిరోధక వ్యవస్థను ఉక్కులా మార్చి బ్యాక్టీరియా, వైరస్ లపై పోరాడే శక్తినిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి.
మితంగా వాడితేనే అమృతం
ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అని చింతపండును మోతాదుకు మించి తీసుకోకూడదు. అతిగా తీసుకుంటే కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పులుపు వల్ల దంతాల ఎనామిల్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకు వాడటం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
