Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
అలర్ట్ : డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తే శరీరంలో జరిగే డేంజరెస్ మార్పులు..
మీరు డయాబెటిస్ మీద దృష్టి పెట్టకపోతే ఏం జరుగుతుంది?
ప్రస్తుత్ రోజుల్లో డయాబెటిస్ చాలా సాధారణ సమస్యగా మారింది. ప్రతి పది మందిలో ఒక్కరూ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అందుకు కారణం ఊబకాయం లేదా ఫామిలిలో డయాబెటిస్ ఉన్నా, తర్వాత తరలా వారికి డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ లో రెండు రకాలున్నాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్ , రెండు టైప్ 2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ మెచ్యుర్ ఏజ్ అంటే 35 ఏళ్ళ తర్వాత వస్తుంది. టైప్ 1 డయాబెటిస్ చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు వస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ దీన్నే మిల్లటస్ డయాబెటిస్ అని పిలుస్తారు. దీన్ని చిన్నపాటి వ్యాయామాలు, బ్రిస్క్వాక్, మరియు డైట్ కంట్రోల్ చేసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటిస్ వారి రక్తంలో ఎక్కువ షురగ్ ఉంటుంది. అందుకు కారణం రక్తంలో హార్మోన్లు తొలగిపోవడం, అది శరీరంలో ప్యాంక్రియాటిక్స్ కు ప్రసరించడం వల్ల డయాబెటిస్ కు కారణమవుతుంది.
కొన్ని సందర్భాల్లో ఇన్సులిన్ సరిపడా శ్రవించకపోవడం వల్ల దీన్ని ఇన్ ఎఫెక్టివ్ గా అంటే ఇన్సులిన్ ఇన్ సెన్సివిటి అని పిలుస్తారు. డయాబెటిస్ ఉన్న వారిలో ఎక్కువ దాహంగా అనిపించడం, యూరిన్ ఎక్కువ సార్లు పోవడం, నోరు తడి ఆరిపోవడం, గాయాలు త్వరగా మానకపోవడం, ఎక్కువ చెమటలు పట్టడం, అలసట, ఆకలి పెరగడం మొదలగు లక్షణాలు కనబడుతాయి.
డయాబెటిస్ తో బాధపడే వారికి , డాక్టర్లు మొదట డైట్ కంట్రోల్ మరియు వ్యాయామo చేయాలని సూచనలిస్తుంటారు. అయినా కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కాకపోతే, తర్వాత మందులు వాడాల్సి వస్తుంది. కొన్ని సందర్శాల్లో డయాబెటిస్ లక్షణాలు పసిగట్టలేము లేదా వాటిని సింపుల్ గా నిర్లక్ష్యం చేస్తుంటాము. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం పరంగా మరిన్ని దుష్ప్రభావాలు చూపుతుంది . చివరకు ప్రాణాపాయస్థితికి చేరుకుంటారు.

డయాబెటిస్ ను నివారించుకోవడానికి కొన్ని సింపుల్ హెల్త్ టిప్స్ ఉన్నాయి.
అడ్వాన్స్డ్ డయాబెటిస్ వారిలో కొన్ని హానికరమైన పరిస్థితులున్నాయి. కొన్ని సందర్భాల్లో డయాబెటిస్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. లేదా మందులు తీసుకుకోండా నిర్లక్ష్యం చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల కొన్ని ప్రమాదకర పరిస్థిలు ఈ క్రింది విధంగా సూచిస్తాయి...

కిడ్నీ డ్యామేజ్ (నెప్రోపతి)
డయాబెటిస్ ను కంట్రోల్ చేయకపోతే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, ఎక్సెస్ బ్లడ్ షుగర్ శరీరంలో పాయిజన్ లా పనిచేస్తుంది మరియు ఇది కిడ్నీలలో చిన్నరక్తనాళాలను డ్యామేజ్ చేస్తుంది. ఇది ఇర్ర్వెసబుల్ కిడ్నీ ఫెయిల్యూర్ కు కారణమవుతుంది.

నరాలు దెబ్బతింటాయి(న్యూరోపతి)
బ్లడ్ లో ఎక్సెస్ షుగర్ ఉండట వల్ల ఇది కాళ్ళ నరాలలోనికి రక్తకణాలకు రక్తం, న్యూట్రీషియన్స్ ను ప్రసరింపచేసే చిన్న రక్త నాళాలు(క్యాపిల్లర్స్ ) డ్యామేజ్ చేస్తుంది. దాంతో కాళ్ళు తిమ్మెర్లు, బలహీనంగా మారుతాయి.

లోయర్ లింబ్స్ పనిచేయకుండా పోతాయి:
డయాబెటిస్ చివర స్టేజ్ లో ఉన్నప్పుడు, కాళ్ళకు రక్తప్రసరణ సరిగా జరగదు, దాంతో కాళ్ళలో చలనం ఉండదు. కాళ్ళు మంటలు, నొప్పులు మరియు వేళ్లలో జలదరింపు, వేళ్లు పైన్నుండి గుంజడం వంటి లక్షణాలు కనబడుతాయి.

జీర్ణ సమస్యలు:
రక్తంలో అధిక షుగర్ ఉండటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కు అనుసందానింపబడిని రక్తనాలు దెబ్బ తింటాయి. ఆ కారణంగా మనిషిలో వికారం, వాంతులు, లూజ్ మోషన్ మరియు అజీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. కాళ్ళకు అనుసందానింపబడిన రక్తనాళాలకు రక్తం సరఫరా కాకపోవడం వల్ల గ్యాంగరిన్ కు దారితీస్తుంది. దాంతో పాదాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్ కు గురౌతాయి. ఆ కారణంతో డయాబెటిస్ వారిలో గాయలు మానకపోవడం, ఇన్ఫెక్షన్స్ కాళ్లు, పాదాలకు విస్తరిస్తుంది.

కళ్ళు డ్యామేజ్ (రెటినోపతి):
డయాబెటిస్ చివరి దశలో రెటినాకు కనెక్ట్ అయిన నరాలను దెబ్బతినడం లేదా వీక్ గా మారుతుంది. ఇది రెటీనాను వీక్ గా మార్చుతుంది. దీన్నే రెటినోపతి అని పిలుస్తారు. దీనికి వెంటనే చికిత్స తీసుకోకపోతే, కళ్ళు దెబ్బతింటాయి. డయాబెటిస్ కారణంగా కాంట్రాక్ట్స్ మరియు గ్లూకోమాకు దారితీస్తుంది.

చెవుడు
రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, చెవిలో చిన్నరక్తనాళాలు దెబ్బతింటాయి. ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు కంట్రోల చేసుకోకపోతే శాశ్వతంగా చెవుడుకు దారితీస్తుంది.

పురుషుల్లో శీఘ్రస్కల సమస్యలు లేదా వంధ్యత్వం:
డయాబెటిస్ తో బాధపడే పురుషుల్లో లైంగిక సమస్యలు ఏర్పడుతాయి. రక్తనాళాలకు రక్తం సరఫరా కాకపోవడం మరియు నరాలు దెబ్బతినడం వల్ల మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది. పీన్స్ కు రక్తం సరఫరాకాకపోవడం వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. దాంతో లైంగిక సమస్యలు ఏర్పడుతాయి.

స్త్రీలలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ :
డయాబెటిస్ ఉన్న స్త్రీలలో డయాబెటిస్ కంట్రోల్ చేసుకోకపోతేు వైజినా, నెయిల్స్, నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది. ఇంకా ఇమ్యూనిటి బలహీన పరుస్తుంది. శరీంలో ఫంగల్ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకొనే సామర్థ్యం తగ్గిపోతుంది.

దంతాలు ఊడిపోతాయి:
రక్తంలో హై షుగర్ కారణంగా దాంతాలు, చిగుళ్ళకు రక్తం సరిగా ప్రసరించడకపోవడం వల్ల దంతాలు బలహీనంగా మారి, దాంతాలు ఊడిపోవడం, చిగుళ్లలో నొప్పి ఉంటుంది.

ఎముకలు బలహీనంగా మారుతాయి:
డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఎముకులు వీక్ గా పెలుసుబారడం జరగుతుంది.ఎముకలకు అనుసంధానించబడ్డ నరాలు డ్యామేజ్ అవుతాయి. ఎముకలకు పోషకాలు అందకపోవడం వల్ల ఎముకలు బలహీనపడుతాయి,

హార్ట్ డిసీజ్:
డయాబెటిస్ కారణంగా గుండెసంబంధిత సమస్యలు అధికమౌతాయి. ధమనుల్లో రక్తం సరిగా ప్రసరించకపోవడం వల్ల హార్ట్ అటాక్, చెస్టె పెయిన్ , స్ట్రోక్ కు గురౌతారు.

డయాబెటిక్ కోమా:
డయాబెటిక్ పేషంట్స్ల్ లో క్యాటబాలిక్ స్థితిలో ఇన్సులిన్ పూర్తిగా లోపించడం వల్ల ప్రోటీన్సు ఉత్పత్తి జరగదు. ఈ కారణంగా కండరాలకు ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ ఏర్పడకపోవడం వల్ల శరీరంలోని రక్తంలో కీటోన్స్ పెరుగుతాయి. శరీరంలో కీటోన్స్ వల్ల డయాబెటిస్ వారిలో వాసన శక్తిని కోల్పోతారు, కీటోన్స్ కారణంగా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కోమాలోకి వెలుతారు. దీన్నే డయాబెటిక్ కోమా అని పిలుస్తారు. చివరకు ప్రాణపోయే పరిస్థితి ఏర్పడుతుంది.



Click it and Unblock the Notifications











