Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
పిరుదులు కరగాలంటే....!

1. సరైన దుస్తులు - టైట్ దుస్తులు శరీర భాగాలను దాచలేవు. కనుక సౌకర్యవంతంగా లూజుగా వుండే దుస్తులు వేయండి. ఇవి ఎంతో బాగుంటాయి.
2. లక్ష్యం పెట్టుకోండి - మొదలు పెట్టిన కొత్తలో వ్యాయామాలు చేసేయడం, మధ్యలో తగ్గించడం చివరకు పూర్తిగా నిలిపేయడంగా వుండరాదు. వ్యాయామాలు మొదలు పెట్టి క్రమేణా సమయం పెంచండి. వేగం క్రమేణా పెంచాలి. మీ అధిక బరువు కూడా ఆరోగ్యకరంగా ప్రతి వారం లేదా ప్రతి నెలా తగ్గుతూ రావాలి కాని ఒకే సారి బరువంతా తగ్గరాదు.
3. ఆహారం - సన్నబడాలంటూ ఆహారం మానకండి. తక్కువ కేలరీలు కల ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోండి. పీచు అధికంగా వుండే పండ్లు, కూరలు, కాయ ధాన్యాలు తింటూ ఉప్పు, షుగర్ వంటి పదార్ధాలు మానేస్తే, బరువు క్రమేణా తగ్గుతుంది.
4. శరీర వెనుకభాగ కొవ్వు - శరీరంలోని వెనుక భాగ కొవ్వు కరగాలంటే, స్విమ్మింగ్, కిక్ బాక్సింగ్, రోయింగ్ వంటివి బాగా పనిచేస్తాయి. కొన్ని తేలికగా వెనక్కు ముందుకు వంగే వ్యాయామాలు, యోగా వంటివి కూడా వెనుక భాగ కొవ్వు తగ్గిస్తాయి.
5. నేలపై బోర్లా పడుకోండి. పొట్ట నేలకు ఆనేట్లు వుంచి తల, కాళ్ళు వెనక్కు లేపండి. ఈ వ్యాయామం రిపీట్ చేస్తూ వుండాలి.
6. బరువు పట్టే వ్యాయామాలు - చెక్క కుర్చీ అంచున కూర్చోండి. రెండు చేతులతో బరువులు పైకి ఎత్తండి. దీనికి జిమ్ నిపుణుల సలహాలు తీసుకోండి.
7. స్ట్రెచస్ - వెల్లకిలా నేలపై పరుండి ఛాతీ భాగాన్ని మెల్లగా పైకి లేపండి. ఎంత లేవగలిగితే అంతే లేచి రిలాక్స్ అవండి.
ఈ వ్యాయామాలు చేస్తే శరీర వెనుక భాగ కొవ్వు తగ్గి మంచి షేప్ సంతరించుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
