Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
గాఢంగా నిద్ర పట్టించే 6 సూపర్ ఫుడ్స్...
సాధారణంగా చాలా మందిని మనం గమనించినట్లైతే.. కారణం లేకుండా నిద్రపట్టక ఇబ్బంది పడేవారు. పడుకొన్న వెంటనే హాయిగా నిద్రపట్టాలని భావించేవారు కొందరు ఉన్నారు. మన మెదడుకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నపుడే మనకు చక్కని నిద్ర పడుతుంది. మనం తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ తీపి పదార్థాలు తీసుకుంటే అరుగుదల లేకపోవటం వలన నిద్రాభంగం అవుతుంది.
నిద్రలేమి, లేదా సరిగ్గా నిద్రపట్టకపోవటం అనేది చాలా మామూలు సమస్య మీ ఆహారంలో మార్పు చేసుకొని, భోజనంలో అమినొ ఆసిడ్ల మోతాదు సరిగ్గా చూసుకొంటే మీకు చక్కగా నిద్రపట్టే మార్గం లభించినట్టే.

చెర్రీస్
ప్రతి ఫంక్షన్ బోజనలలో కిల్లితో పాటు ఈ చెర్రీ పండుని అందించడం ఎక్కువుగా చూస్తున్నాం. ఇవి కాశ్మీర్ లో పండుతాయి. ఇందులో పొటాషియం ఎక్కువుగా లబిస్తది. చెర్రీ రసంలో మెలటోనిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రని క్రమబద్ధం చేసే హార్మోను. రాత్రి నిద్రించేముందు చెర్రీ రసం తీసుకోవటం వలన నిద్ర సమస్యలను తొలగిస్తుంది. దీనివలన మరింత మంచిఫలితం కావాలంటే ప్రతిరోజు ఒక క్రమపద్ధతిలో దీనిని తీసుకోవాలి. చెర్రీ పండ్లలో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా కలిగి ఉండటం వల్ల నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.

పాలు
గోరువెచ్చని పాలు నిద్రని ఆహ్వానిస్తాయని మన పెద్దలకాలంనుంచీ వస్తున్న ఆనవాయితీ. మెదడును శాంతపరిచి నిద్ర కలిగించే నాడీప్రసారకాలు(న్యూరోట్రాన్స్ మీటర్), ట్రైటోపాస్ దాదాపు అన్ని పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుంది. ఒక గ్లాసు పాలు (చక్కెర గాని మరే తీపి పధార్థమైన కాని చేర్చకుండా) రాత్రి బాగా పొద్దుపోయాక తాగినా, లేదా మీ రాత్రి భోజనంలో పనీర్లాటివి తీసుకున్నా మీకు అందవలసినంత ట్రైటొఫాన్ అందుతుంది. పాలతో తయారైన అన్ని పదార్థాల్లోనూ ట్రైటొఫాన్ ఉంటుంది.

అరటిపండు
అరటిపళ్లలో మెగ్నీషియం, పొటాషియం హెచ్చుమోతాదులో ఉన్నాయి. ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కని నిద్రపట్టేలా చేస్తాయి. అరటి పండు మనం నిద్రిస్తున్నపుడు రక్తపోటుని కూడా నియం త్రించగలుగుతుంది. అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు. అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.

ఓట్ మీల్
ఓట్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం. కొన్ని పరిశోధన ప్రకారం ఇందులో కరిగే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. పాలలో కలిపి తినాటి. ఇందులో వుండే పీచు మీ కడుపు బాగా నింపి త్వరగా మరల ఆకలి కాకుండా చేస్తుంది. కనుక వెన్నతీసిన పాలలో ఓట్లు వేసుకొని తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు ఓట్ మీల్ ను తిసుకొంటే సౌండ్ లెస్ స్లీమ్ మీరు పొందవచ్చు.

గోధుమలు
గోధమలు, జొన్నలు, సజ్జలు, లాటివాటితో కలపి తీసుకుంటే సుఖంగా నిద్రపడుతుంది. గోధుమలలో ప్రోటీన్ శాతం ఎక్కువ. గోధుమతో తయారైన ఆహార పదార్థాలలో మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్ బి12 ఉంటాయి. ఇవన్నీ నిద్రకు స్నేహితులే. గోధుమలు తేలికగా జీర్ణము కాదు, చలువ చేయును. బలకరము. గోధుమ పిండితో చేసిన రొట్టెలను తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది.

కూరగాయలు
కూరగాయల్లో ఒత్తిడిమీద పోరాడి నిద్రనిచ్చే ట్రైటొఫాన్ పుష్కలంగా ఉందని జర్మనీ పరిశోధనల్లో తేలింది. అంతే కాదు తాజా కూరగాయలతో పాటు ఆకు కూరలు తీసుకొంటే ఆరోగ్యంతో పాటు నిద్రబాగా పడుతుంది. మనకందరకు కూరగాయలు ఆరోగ్యాన్నిస్తాయని తెలుసు. వాటిలో విటమిన్లు, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ వుంటాయి. కాని వాటిని కనుక బాగా వేయించటం లేదా వేడికి గురిచేయటం చేస్తే అవి అనారోగ్యానికి దారితీస్తాయి. కూరగాయలు కొన్ని పచ్చివే తినవచ్చు. ఇవి మీ ఆహారానికి రుచినిస్తాయి. మీరు ఏది తింటే అంతే ఆరోగ్యంగా వుంటారు.



Click it and Unblock the Notifications