Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
కష్టపడకుండా బరువు తగ్గించుకొనే సులభ చిట్కాలు..!
బరువు తగ్గడం అంత కష్టమైన పనేం కాదు కానీ మీరు క్రమ శిక్షణ గా ఆహారపు అలవాట్లను అదుపులో పెట్టుకోవాలి. సులభంగా బరువు తగ్గే ఈ పదహారు మార్గాలు మార్గాలు పాటించి అదనపు బరువుని తగ్గించుకోండి.

తీపి తినాలనే కోరికని తగ్గించుకోండి
మీకు తీపి పదార్ధాలంటే ఇష్టమా? భోజనం తరువాత తీపిని తీసుకోకుండా ఉండలేరా? అయితే మీరు ఖచ్చితంగా ఈ అలవాటు ని మార్చుకోవాలి. తీపి వల్ల కేలరీలు పెరగడం తప్ప మరే లాభం లేదు. అందువల్ల తీపిని మినహాయించండి.

టీవీ చూస్తున్నప్పుడు తినకండి
టీవీ చూస్తూ పాప్ కార్న్ లేదా వేరే ఏదైనా స్నాక్స్ వంటివి తినే అలవాటు ఉంటే వెంటనే అది మానుకోండి. ఏదైనా ఇష్టమైన ప్రోగ్రాం చూస్తూ తినేటప్పుడు మనకి తెలియకుండానే ఎక్కువగా ఆహారం తినేస్తాము.

ఆహారపు పట్టికని తయారు చేసుకోండి
ఏ ఆహరం తీసుకుంటున్నారు, దానిలో ఎన్ని కేలరీలు ఉన్నాయి అనే విషయాన్ని మీరు రాసుకుంటూ ఉండాలి. అందువల్ల, తీసుకునే మొత్తం లో మనకి అవగాహన ఉంటుంది.

ఎక్కువ సేపు ఆకలితో ఉండకండి
ఎక్కువ సేపు ఆకలితో ఉండడం మంచిది కాదు. అందువల్ల, భోజనం చేసే సమయం లో ఎక్కువ మొత్తం లో ఆహారం తీసుకునే ఆవకాశం ఉంది. కాబట్టి సరైన సమయానికి భోజనం చేసే అలవాటు ఉత్తమం.

ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు ఆకలితో వెళ్ళకండి
ఏదైనా పార్టీకి వెళ్ళే ముందు తేలికపాటి ఆరోగ్యకరమైన స్నాక్ లేదా ఏదైనా సూప్ తీసుకుని వెళ్ళండి. ఆకలితో వెళ్ళడం వల్ల ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది.

మంచినీరు ఎక్కువగా తాగాలి
బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. శరీరానికి తగినంత నీరు తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం సొంతమవుతుంది.

స్మూతీస్ ఇంకా జ్యూస్ ల వంటివి తగ్గించండి
స్మూతీస్ ఇంకా పళ్ళ రసాల వంటివి ఆరోగ్యకరమే, కానీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కేలరీలు శరీరంలోకి చేరతాయి. వాటికి బదులు పళ్ళు తినడం అలవాటు చేసుకోండి.

జంక్ ఫుడ్ ని నిర్మూలించండి
ఫాస్ట్ ఫుడ్ ని తరచూ తీసుకోవడం వల్ల చాలా త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, కొవ్వు అలాగే కేలరీలు ఎక్కువగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజ్జాస్ మరియు ఇంకొన్ని వేపుడు పదార్ధాలని తగ్గించండి.

తరచూ వ్యాయామం చెయ్యండి
జిమ్ కి వెళ్లి వ్యాయామం చేసే సమయం మీకు లేకపోతే, కనీసం 30 నిముషాల వరకు నడవండి. బరువు తగ్గలనుకునే వారు ఖచ్చితంగా వ్యాయామం చేసి తీరాలి. మిమ్మల్ని ఆరోగ్యంతో ఉంచడం తో పాటు జీవక్రియ సక్రమంగా సాగేందుకు వ్యాయామం ఉపయోగపడుతుంది.

సూప్స్ ని సలాడ్స్ ని మీ స్నేహితులుగా భావించండి
సూప్స్ ని సలాడ్స్ ని మీ ఆహారం లో భాగం గా చేసుకోండి. మీ సలాడ్స్ లో కొవ్వు తక్కువగా ఉండేలా చూసుకోండి. సూప్స్ లో క్రీమ్స్ ని నిర్మూలించండి.

అర్ధరాత్రి పూట ఆహారం తీసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి
అర్ధరాత్రి పూట ఆహారం తీసుకోకూడదు. నిద్రపోయే ముందు ఏ ఆహారం తీసుకోకూడదు. ఆహారానికి నిద్రకి మధ్య కనీసం రెండు నుండి మూడు గంటల వ్యవధి ఉండేలా జాగ్రత్త పడాలి.

బ్రేక్ ఫాస్ట్ ని అశ్రద్ధ చేయకండి
రోజు లో ముఖ్యమైన భోజనం బ్రేక్ ఫాస్ట్. బ్రేక్ ఫాస్ట్ ని నిర్మూలించకూడదు. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ వల్ల జివ క్రియ సజావుగా సాగుతుంది.

డిన్నర్ తేలికపాటిగా ఉండేలా చూడండి
బ్రేక్ ఫాస్ట్ ని రాజులాగా, డిన్నర్ ని పేదవాడి లాగా చెయ్యాలనే నానుడి ఉంది. ఈ నానుడి లో ఎంతో అర్ధం ఉంది. డిన్నర్ ని తేలికగా తీసుకోవడం వల్ల ఎక్కువగా కేలరీలు మీ శరీరం లో కి చేరవు.

తినే ఆహరాన్ని అదుపులో ఉంచుకోండి
మీకు ఆకలి తీరింది అనే భావన ఏర్పడగానే తినడం ఆపేయండి. ఈ సూత్రానికి కట్టుబడి ఉండండి.

సంతోషంగా ఉండండి
ఒత్తిడి మరియు వేదన ల వల్ల అధికంగా తింటారు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలతో బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. ఇవి పాటించడం ద్వారా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.

నిద్ర: నిద్ర ప్రతి మనిషికీ చాలా అవసరం. సరైన నిద్రలేకపోతే అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకొన్నట్లౌతుంది. కాబట్టి ప్రతి రోజూ కనీసం 7-8గంటలు నిద్రపోవడం చాలా అవసరం. మరియు ఆరోగ్యం.

నడక: రోజు అరగంట నడవడం వల్ల దీర్ఘకాలంలో వచ్చే ఆరోగ్యం సమస్యలను మద్యవయస్సు నుండి కంట్రోచేయవచ్చు. కాబట్టి సమయం దొరికనప్పుడుల్లా కొంత నడవండి. క్రమం తప్పకుండా రెగ్యులర్ గా అరగంట నడవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోచ్చు.

ఏదైనా ఆహార పదార్ధం కొనేటప్పుడు వాటిలో ఏముందో గమనించండి
తక్కువ కొవ్వు కలిగిన ఆహార పదార్ధాలనే పరిగణలోకి తీసుకోండి. వేపుడు పదార్ధాల కంటే ఉడికించిన ఆహార పదార్ధాలకే ప్రాధాన్యం ఇవ్వండి. లేబుల్స్ చదవడం వల్ల ఆ ఆహార పదార్ధంలో ఉండే కేలరీలు మొదలగు విషయాల గురించి మీకు అవాగాహన వస్తుంది. మీరు ఆహారాన్ని అదుపులో ఉంచడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది.



Click it and Unblock the Notifications