బెడ్ టైమ్ డ్రింక్స్ తో 15 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ మాయం

By Nutheti

బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయారా ? బెల్లీ ఫ్యాట్ శరీరంలో చాలా అసహ్యంగా, ఇబ్బందికరంగా కనిపిస్తుంది. చాలా కేర్ ఫుల్ గా టిప్స్ ఫాలో అయితే.. కొన్ని రోజుల్లోనే స్మార్ట్ గా, అందంగా కనిపించవచ్చు. జిమ్ కి వెళ్లడం, మందులు వాడటం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం చాలా కష్టం.

ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, చక్కెర పదార్థాలు, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి తీసుకోవడం మానేయడంతోపాటు మరింత కాన్సంట్రేట్ చేస్తే బెల్లీ ఫ్యాట్ కరిగించవచ్చు. న్యాచురల్ జ్యూస్ లు తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. శరీరంలోని టాక్సిన్స్ ని తొలగిస్తాయి.

READ MORE: బెల్లీ ఫ్యాట్ ను వేగంగా తగ్గించే న్యూట్రీషియన్స్ ఫుడ్స్

పడుకోవడానికి ముందు ఈ జ్యూస్ లు తాగితే బెల్లీ ఫ్యాట్ మాయం చేయవచ్చు. ఈ ట్రిక్ 15 రోజులు క్రమంగా ఫాలో అవడం వల్ల బాన పొట్ట క్రమక్రమంగా తగ్గిపోతుంది. డయాబెటీస్, కొలెస్ర్టాల్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ కనిపిస్తుంది. అలాంటి వాళ్లు కూడా ఈ జ్యూస్ ప్రయత్నిస్తే.. బెల్లీ ఫ్యాట్ తో పాటు, డిసీజ్ లు కూడా తగ్గిపోతాయి.

డ్రింక్ 1

డ్రింక్ 1

ఒక నిమ్మకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము, ఒక దోసకాయ, కొన్ని పార్స్లీ ఆకులు తీసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఒకవేళ చాలా చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి ఈ జ్యూస్ తాగాలి. ఇలా 10 రోజులు క్రమం తప్పకుండా తాగిచూడండి.. మీ బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

బెల్లీ ఫ్యాట్ తగ్గించడమే కాకుండా ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్ ని తొలగిస్తుంది. అలాగే ఇన్ల్ఫేషన్ ని తగ్గిస్తుంది. అలాగే తీసుకునే ఆహారంలోని పోషకాలు అందడానికి ఈ డ్రింక్ సహాయపడుతుంది. అలాగే శరీర బరువును కూడా తగ్గిస్తుంది. ఈ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణప్రక్రియ సజావుగా సాగుతుంది. అలాగే ఆకలిని తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడంతో పాటు శరీరంలో ఇన్ఫెక్షన్స్ ని నాశనం చేస్తుంది. ఇమ్యునిటీ పవర్ పెంచుతుంది.

డ్రింక్ 2

డ్రింక్ 2

పియర్ ని పేస్ట్ లా చేసుకోవాలి. అందులోకి ఒక నిమ్మకాయ రసం, ఒక దోసకాయ, కొన్ని పాలకూర ఆకులు కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ ని పడుకునే ముందు కనీసం ఒక వారం రోజు తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని ఫ్యాట్ సెల్స్ కరిగిపోతాయి. జీర్ణప్రక్రియ సజావుగా సాగుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ బెల్లీ ఫ్యాట్ ని సులభంగా, వెంటనే తగ్గిస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల లివర్ కి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. పియర్ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది.

డ్రింక్ 3

డ్రింక్ 3

ఒక దోసకాయ, కొన్ని పార్ల్పీ ఆకులు, ఒక నిమ్మకాయ రసం, ఒక స్పూన్ అల్లం తురుము, ఒక స్పూన్ అలోవెరా జ్యూస్, అరగ్లాస్ నీళ్లు తీసుకుని జ్యూస్ తయారు చేయాలి. ఈ జ్యూస్ ని పడుకోవడానికి ముందు తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

అలోవెరాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ పెరుగుదలను అరికడతాయి. అలాగే జీర్ణక్రియ పెంపొందించి.. బాడీ మాస్ ఇండెక్స్ ని కంట్రోల్ చేస్తుంది.

డ్రింక్ 4

డ్రింక్ 4

రెండు నిమ్మకాయల రసం, కొన్ని సెలరీ ఆకులు తీసుకోవాలి. వీటిని మిక్సీలో లేదా జ్యూసర్ వేసి జ్యూస్ తయారు చేసుకోవాలి. తర్వాత రెండు గ్లాసుల నీళ్లు కలిపాలి. బాగా అంతా మిక్స్ అయిన తర్వాత రాత్రి నిద్రపోయే ముందు తాగితే.. కొన్ని రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

ఈ జ్యూస్ లో వాడిన నిమ్మకాయ, సెలరీలో యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడాన్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే క్యాలరీలు తగ్గించడానికి సహాయపడతాయి.

Story first published: Monday, December 7, 2015, 16:15 [IST]
Desktop Bottom Promotion