Latest Updates
-
వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఇలా చేస్తే నో టెన్షన్ -
చిల్ అవ్వడానికి చోటు ఏదైతేనేం.. భారీ వర్షంలోనూ ‘సిట్టింగ్’.. మందుబాబుల వైరల్ వీడియో.! -
పైన కరకర.. లోపల కరిగే చీజ్.. ఆహా అనిపించే పొటాటో చీజ్ బాల్స్..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
మీతో ఇతరులు హ్యాపీగా ఉండాలంటే.. ఈ 5 విలువైన సలహాలు పాటించాల్సిందే.! -
ఫౌండేషన్ తర్వాత ముఖం ఎందుకు నల్లగా మారుతుంది.. తెలిసీతెలియక చేసే పొరపాట్లు ఇవే.! -
ఇలా చేస్తే కుండపోత వర్షం కూడా ఆగిపోతుందట.. మన పల్లెల్లో చేసే 7 వింత ప్రయోగాలు! -
రోజూ వీటిని ఎలా తీసుకుంటున్నారు.?.. ఆరోగ్యం విషయంలో నేటికీ మారని కొన్ని అపోహలు.! -
ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు.! -
రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ సూప్.. ఇప్పుడు మీ ఇంట్లోనే నిమిషాల్లో రెడీ! -
పెళ్లయ్యాక భార్య కంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా.. అందుకు కారణాలివే.?
సిట్రస్ పండ్లతో బరువు తగ్గించుకొనే సింపుల్ ఫార్ములా...!
హెల్తీ లైఫ్ ను పొందాలంటే, ఫిట్ గా మరియు స్ట్రాంగ్ గా నాజూకైన శరీరంతో ఉండటమే. ఊబకాయం ఎల్లప్పుడు చూడటానికి అసహ్యాంగా ఉండటం మాత్రమే కాదు, ఇతర దుష్ప్రభావాలు కూడా చాలా ఉన్నాయి. నాజూగ్గా ఉండే శరీరం ఎల్లప్పుడు కాన్ఫిడెంట్ గా మరియు స్మార్ట్ గా ఉంటారు. మరి అంత నాజూకైన శరీరం పొందాలంటే, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం . ముఖ్యంగా సిట్రస్ పండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మరింత ముఖ్యం.
బరువు తగ్గించుకోవడానికి పండ్లు చాలా సురక్షితమైనవి . ముఖ్యంగా ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవడానికి సిట్రస్ పండ్లు చాలా గ్రేట్ గా సహాపడుతాయి. బరువు తగ్గించడంలో సిట్రస్ పండ్లు ఎలా సహాయపడుతాయన్న ఆశ్చర్యం మీకు కలగవచ్చు. ఇది వాస్తవం ఎందుకంటే సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే మినిరల్స్, విటమిన్స్ బరువు తగ్గించుకోవడానికి ఫర్ఫెక్ట్ గా పోషకాలు. కాబట్టి, డైలీ డైట్ లో సిట్రస్ ఫ్రూట్స్ ను చేర్చుకోవడం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలను తగ్గించుకోవచ్చు.
మరి ఇప్పుడు మనస్సులో మరో సందేహం కలగవచ్చు. డైలీ డైట్ లో సిట్రస్ ఫ్రూట్స్ ను ఏవిధంగా చేర్చుకోవాలన్న సందేహం?కానీ అన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్ బరువు తగ్గించడానికి సహాయపడవు , సిట్రస్ ఫ్రూట్ డైట్ తీసుకొనే ముందు డాక్టర్ ను సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో బ్లడ్ ప్రెజర్ వంటి వాటికి చికిత్స తీసుకుంటున్నప్పుడు , ఈ సిట్రస్ ఫ్రూట్స్ ను సూచించకపోవచ్చు.
READ MORE:కొవ్వు కరిగించి, అదనపు బరువు తగ్గించే 15 బెస్ట్ ఫ్రూట్స్!
అందువల్ల, ఇలాంటి పర్టిక్యులర్ డైట్ ను అనుసరించే ముందు డాక్టర్ ను సంప్రదించాలి . ఎలాంటి వ్యాధులు లేకుండా నార్మల్ లైఫ్ ను జీవిస్తున్నప్పుడు మాత్రమే సిట్రస్ ఫ్రూట్ డైట్ ను ఫాలో అవ్వడం వల్ల బరువు తగ్గడానికి ...నాజూగ్గా తయారవ్వడానికి సహాయపడుతుంది.
ఈ ఫ్రూట్స్ శరీరంలోని టాక్సిన్స్ ను నివారిస్తుంది మరియు మంచి ఆరోగ్యానికి మరియు హెల్తీగా సహజంగా బరువు తగ్గడానికి ఈ ఫ్రూట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . మరి బరువు తగ్గించే ఆ హెల్తీ సిట్రస్ ఫ్రూట్స్ ఏంటో తెలుసుకోవడానికి ఈ క్రింది లిస్ట్ ను ఫాలో అయిపోండి....

గ్రేఫ్ ఫ్రూట్:
గ్రేఫ్ ఫ్రూట్ బియండి బూస్టింగ్ కు సహాయపడుతుంది లేదా బోన్ మినిరల్ డెన్సిటిని పెంచుతుంది. గ్రేప్ ఫ్రూట్ కూడా ఓస్టిరియోఫోయోసిస్ ను నివారిస్తుంది. ఇంకా క్యాన్సర్ మరియు హార్ట్ డిసీజ్ లను నివారిస్తుంది . పరిశోధనల ప్రకారం, ప్రతి రోజూ రెగ్యులర్ గా ఒక గ్రేప్ ఫ్రూట్ ను తినడం వల్ల 13వారాల్లో కల్లా 20 పౌండ్ల బరువు తగ్గించుకోవచ్చు.

బ్లడ్ ఆరెంజెస్:
క్యాన్సర్ నివారణలో గ్రేట్ గా సహాయపడేది బ్లడ్ ఆరెంజ్ అని చాలా మంది నమ్ముతారు . ఎందుకంటే బ్లడ్ ఆరెంజ్ లో ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్స్, ఆంథోసినిన్స్ మరియు కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ కారణం చేతథెరఫిటిక్ కోసం వీటిని ఉపయోగిస్తుంటారు . దాంతో బరువు తగ్గించడంలో ఉపయోగకరంగా ఉన్నాయి. అలాగే శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. దాంతో బాడీ వెయిట్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతాయి.

లెమన్స్:
నిమ్మరసం ఎముకలను బలోపేతం చేయడానికి మరియు శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపబడుతాయి. అలాగే నిమ్మరసంలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి . మరియు క్యాన్సర్ సెల్స్ ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఒక గ్లాస్ వార్మ్ వాటర్లో కొద్దిగా నిమ్మరసం చేర్చి రెగ్యులర్ గా ఉదయం పరగడుపు తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

టాంగరిన్స్ :
సిట్రస్ ఫ్రూట్స్ ను ఉపయోగించి బరువు తగ్గించుకోవడమెలా? అనుకొన్నప్పుడు టాంగరిన్స్ గుర్తుకొస్తాయి . రీసెంట్ గా జరిపిన పరిశోధనలో, టాంగరిన్స్ లో ఉండే కెమికల్స్ ‘నోబిలిటిన్' ఫ్యాట్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకే శరీరంలో ఫ్యాట్ చేరకుండా టాంగరిన్స్ సహాయపడుతాయి. ఫ్యాట్ బర్నింగ్ ప్రొసెస్ ను వేగవంతం చేస్తాయి.

నిమ్మరసం:
నిమ్మరసంలో లెమనాయిడ్స్ ఉంటాయి, ఇవి స్టొమక్ ప్రాబ్లెమ్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . మరియు నిమ్మరసం డైజెస్టివ్ ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎంజైమ్ ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కడుపుబ్బరాన్ని నివారిస్తుంది. లెమన్ టీ రెగ్యురల్ గా తీసుకుంటే , ఇవి శరీరంలో ఎక్సట్రా క్యాలరీలను తగ్గిస్తుంది.

బెర్రీస్:
బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, మరియు రాస్బెర్రీస్ లో పుష్కలమైన న్యూట్రీషియన్స్ కలిగి ఉంటాయి . సిట్రస్ పండ్లు కానీ అరటి, లేదా మామిడి పండ్ల కంటే వీటిలో చాలా తక్కువ షుగర్ కంటెంట్ కలిగి ఉంటాయి. బెర్రీస్ కార్డియో వ్యాస్కులర్ సిస్టమ్ ను బలోపేతం చేస్తుంది. రక్తం శుభ్రం చేస్తుంది. బెర్రీస్ జీర్ణక్రియను శుభ్రపరుస్తుంది, ఆకలి పెంచుతుంది మరియు బరువు తగ్గడానికి ఇది ఒక హెల్తీ మార్గం.

కుమ్క్వాట్స్:
కుమ్క్వాట్స్ బరువు తగ్గించుకోవడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. బరువు తగ్గించుకోవాలనుకొనే వారు సిట్రస్ ఫ్రూట్స్ లో ఒకటైన ఈ పండును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కుమ్క్వాట్ తొక్కతో సహాయ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కుమ్క్వాట్స్ లో లుటిన్, జియాక్సిథిన్, మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉండి, కొలెస్ట్రాల్ లెవల్స్ ను పూర్తిగా తగ్గిస్తాయి.



Click it and Unblock the Notifications