Latest Updates
-
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్!
నడుము, తొడలు చుట్టూ పేరుకున్న ఫ్యాట్ కరిగించే అల్లం వాటర్..!!
నడుము, తొడలు, పిరుదుల చుట్టూ.. ఫ్యాట్ పేరుకున్నప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. లావుగా మారిన విషయం ఈ భాగాల్లో పేరుకున్న ఫ్యాట్ ని చూస్తేనే అర్థమవుతుంది. ప్యాంట్స్ పట్టనప్పుడు మీ నడుము, తొడలు లావయ్యాయన్న విషయం అర్థం అవుతుంది.
ఇలా భారీగా పెరిగిన ఫ్యాట్ కరిగించుకోవడానికి ఎఫెక్టివ్ అండ్ క్విక్ రెమిడీస్ కోసం వేట మొదలుపెట్టేస్తారు. అయితే.. ఇలాంటప్పుడు అల్లం చక్కటి పరిష్కరం. ఇది మాత్రమే వేగంగా.. ఫ్యాట్ ని కరిగించగలదు.

అల్లంను ప్రతి వంటింట్లో ఖచ్చితంగా ఉపయోగించే వస్తువు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు.. అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. అయితే అనారోగ్య సమస్యలనే కాదు.. అధిక ఫ్యాట్ ని కరిగించడంలో కూడా.. అల్లం మిరాకిలస్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా నడుము, తొడలు, పిరుదుల భాగంలో పేరుకున్న ఫ్యాట్ ని తేలికగా కరిగిస్తుంది.
అల్లంలో ఉండే జింజరాల్ అనే పదార్థం శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకుపంపడానికి సహాయపడుతుంది. దీనివల్ల కొవ్వు కరిగిపోతుంది. అలాగే పొట్టలో పీహెచ్ లెవెల్స్ పెంచడంలోనూ అల్లం సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలా పొట్టలో బ్లోటింగ్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ సమస్యకు దూరంగా ఉండవచ్చు.

అలాగే అల్లం మెటబాలిక్ రేట్ ని శరీరంలో పెంచడానికి సహాయపడుతుంది. మెటాబాలిజం పెరిగితే.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి జింజర్ వాటర్ ఎలా తయారు చేసుకుని, ఎలా తీసుకోవడం వల్ల ఫ్యాట్ కరిగించడం తేలికవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లం వాటర్ తయారు చేసే విధానం
ఒక లీటర్ నీటిని తీసుకుని ఉడికించాలి.
ఒక ముక్క అల్లం తీసుకుని శుభ్రం చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. మరుగుతున్న నీటిలో కలపాలి.
మరో 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి.
ఆ నీటిని చల్లార్చాలి.
వడకట్టి.. తాగాలి.

ఈ నీటిని రోజంతా.. మామూలు నీళ్లు తాగినట్టుగా తాగాలి. మూడు నాలుగు నెలలు క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరంలో కొవ్వు కరగడాన్ని గమనిస్తారు. తొడలు, పిరుదులు, నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కరుగుతూ ఉంటుంది. అల్లం వాటర్ ని ఒక కంటెయినర్ లో నిల్వ ఉంచుకోవాలి. అయితే ఏ రోజుకి ఆరోజు అల్లం వాటర్ తయారు చేసుకుని తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
