బరువు తగ్గించుకోవడానికి బీట్ రూట్ జ్యూస్ తో 5 సులభ మార్గాలు

Posted By:
Subscribe to Boldsky

బరువు తగ్గించుకోవడానికి బీట్ రూట్ జ్యూస్ తో బరువు తగ్గడం చాలా చాలా సింపుల్. బరువు తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఎంత మంది ఆరోగ్య కరంగా బరువు తగ్గాలని కోరుకుంటారు?. బరువు తగ్గే క్రమంలో డైట్ టిప్స్, ఎక్కువ వ్యాయామాల వల్ల శరీరంలో హార్మోనుల్లో అసమతుల్యతలు, దాంతో మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ శరీరం మీద, ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. హెల్తీగా బరువు తగ్గించుకోవడం వల్ల ఇటు ఆరోగ్యాన్ని అటు, శరీర బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. కూరగాయల్లో మనకు బాగా తెలిసిన వెజిటేబుల్ బీట్ రూట్. బీట్ రూట్ జ్యూస్ తో ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు? ఆశ్చర్యం కదా?

బీట్ అంటే చాలా మంది ఇష్టపడరు కానీ బీట్ రూట్, బీట్ రూట్ జ్యూస్ లో వ్యాధి నిరోధకతను, మెటబాలిజం రేటును పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తాయి. ఈ క్రమంలో హెల్తీగా బరువు కూడా తగ్గుతారు. మరి అదెలాగో తెలుసుకుందాం..

బరువు తగ్గించే బీట్ రూట్ క్యారెట్ జ్యూస్ :

బరువు తగ్గించే బీట్ రూట్ క్యారెట్ జ్యూస్ :

బీట్ రూట్ క్యారెట్ పై తొక్కతొలగించి, ముక్కలుగా కట్ చేసి, మిక్సిలో వేసి, అరకప్పు నీళ్లు పోయాలి. బ్లెడ్ చేయాలి. ఈ రెండింటి క్యాంబినేషన్ జ్యూస్ లో బరువు తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ జ్యూస్ తాగితే పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగి, ఆకలి కాకుండా చేస్తుంది. దాంతో బరువు తగ్గడం సులభం అవుతుంది.

బరువు తగ్గడానికి బీట్ రూట్ ఆపిల్ జ్యూస్ :

బరువు తగ్గడానికి బీట్ రూట్ ఆపిల్ జ్యూస్ :

రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ల అవసరం ఉండదు అంటారు. అది వాస్తవం. అయితే ఆపిల్ తో పాటు, బీట్ రూట్ కూడా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. ఆపిల్, బీట్ రూట్ ను కాంబినేషన్ జ్యూస్ తాగడం వల్ల ఎక్స్ వెయిట్ ను దూరం చేస్తుంది. మీడియం సైజ్ ఆపిల్, బీట్ రూట్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ తయారుచేసి, షుగర్ లేకుండా ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.

బీట్ రూట్, నిమ్మరసంతో బరువు తగ్గడం చాలా సులభం:

బీట్ రూట్, నిమ్మరసంతో బరువు తగ్గడం చాలా సులభం:

మనకు ఇదివరకే తెలుసు, నిమ్మరసం బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని, నిమ్మరసానికి బీట్ రూట్ జ్యూస్ తోడైతే ఇక బరువు తగ్గడం చాలా సులభం. అందుకోసం కొన్ని బీట్ రూట్ ముక్కలు తీసుకుని బ్లెండర్ లో వేసి జ్యూస్ చేయాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం చేర్చి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగాలి.

బీట్ రూట్ అల్లం జ్యూస్ తో ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారు:

బీట్ రూట్ అల్లం జ్యూస్ తో ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారు:

అల్లంను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అదనపు కొవ్వు కరిగించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అల్లంలో మెడిసిన్ గుణాలు అధికంగా ఉన్నాయి. మరి దీనికి బీట్ రూట్ జ్యూస్ కలిపి తాగితే బరువు తగ్గడం సులభం అవుతుంది. బీట్ రూట్ ముక్కలతో పాటు, కొద్దిగా అల్లం ముక్కలు కూడా మిక్సీలో వేసి జ్యూస్ తయారుచేసి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈ డ్రింక్ ఫ్యాట్ బర్న్ చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఫ్యాట్ బర్నింగ్ బీట్ రూట్, హనీ జ్యూస్:

ఫ్యాట్ బర్నింగ్ బీట్ రూట్, హనీ జ్యూస్:

తేనెలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. తేనెను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. బీట్ రూట్ జ్యూస్ కు ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవడం వల్ల హెల్తీగా బరువు తగ్గుతారు. ఈ జ్యూస్ ప్రతి రోజూ పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.

బీట్ రూట్ జ్యూసులలో వివిధ రకాల జ్యూసులున్నాయి. ఇవన్నీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ జ్యూసులతో పాటు రెగ్యులర్ వ్యాయామాలు చేస్తే చాలు, బరువు ఎఫెక్టివ్ గా తగ్గుతారు.

English summary

5 Ways to Prepare Beetroot Juice For Weight Loss

5 Simple Ways to Prepare Beetroot Juice For Weight Loss, take a look..
Story first published: Friday, June 16, 2017, 18:32 [IST]
Subscribe Newsletter