For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ట్రిక్స్ పాటించండి.. బరువు తగ్గండి

By Y. Bharath Kumar Reddy
|

అధిక బరువు సమస్య అందరినీ వేధిస్తూ ఉంటుంది. దీంతో చాలామంది ఇబ్బందులకు గురవుతుంటారు. బరువును తగ్గించుకునేందుకు పాటించని విధానం అంటూ ఉండదు. అనేక వ్యాయామశాలల చుట్టూ తిరిగి ఉంటారు. కసరత్తులు చేస్తూ ఉంటారు. అలాగే అనేక ఆసుపత్రులకు వెళ్లి ట్రీట్ మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. డబ్బులు, సమయం వేస్ట్ అవుతాయాని కానీ ఫలితం ఉండదు.

మరి ఈ సమస్యకు ఇంట్లోనే పరిస్కారం లభిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అవును మీరు ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఆధిక బరువు నుండి విముక్తులు కావొచ్చు. కృత్రిమ పద్దతులలో బరువు తగ్గడం వలన భవిష్యత్ లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సహజ పద్ధతుల్లో బరువు తగ్గవచ్చు. సహజ పద్దతాల్లో ప్రయతించడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు.

వేగంగా బరువు తగ్గించే బేకింగ్ సోడా + నిమ్మరసం

కింద పేర్కొన్న పలు సింపుల్ ట్రిక్స్ పాటిస్తే బరువు తగ్గడం మరింత తేలికవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ట్రిక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దామా.

భోజనానికి ముందు నీరు తాగాలి

భోజనానికి ముందు నీరు తాగాలి

మనలో చాలామందికి మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. మనశరీరంలో 60-70 శాతం ఉన్నది నీరే. మన శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ పోషకాలను పంపేది నీరే. ఆహారంతో పాటు, ముద్దముద్దకు నీరు తాగడం మంచిది కాదు. భోజనానికి ముందు నీరు తాగాలి

తినడానికి 15 నుంచి 20 నిమిషాలు ముందు ఒక గ్లాసు నీరు తాగాలి. ఇలా చేయడం చాలా మంచిది. ఈ నీరు మీరు తిన్న ఆహారాన్ని త్వరగా అరిగించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గేందుకు ఇది అత్యుత్తమ చికిత్స.

అరోమాథెరపీ

అరోమాథెరపీ

అరోమాథెరపీ అనేది చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. కొన్ని పుష్పాల నుంచి తయారు చేసే తైలాలు మంచి సువాసనను కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఔషధ లక్షణాలు కూడా ఉంటాయి. అవి మనసు, శరీరాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి. సువాసనల ఆధారంగా జరిపే చికిత్సను అరోమాథెరపీ అంటారు. శరీరానికి ఇది ఎంతో స్వస్థత చేకూర్చుతుంది. అయితే ఆపిల్స్, పుదీనా లేదా వనిల్లా వంటి వాటి వాసన చూడడం చాలా మంచిది. ఈ థెరపీ బాడీలోని బాడీలోని కొవ్వుని తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గించడంలో డేట్స్ అందించే 8 ప్రయోజనాలు

పళ్లను శుభ్రం చేసుకోండి

పళ్లను శుభ్రం చేసుకోండి

మీరు భోజనం చేశాక కచ్చితంగా మీ దంతాలను శుభ్రం చేసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు బ్రష్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీ టూత్ పేస్ట్ లో తులసికి సంబంధించిన గుణాలు ఉంటే చాలా మంచిది. దీనివల్ల మీ బ్రెయిన్ కు ఇక శరీరం మీల్ తీసుకోవడం అయిపోదంటూ సంకేతాలు అందుతాయి.

నిలబడి తినండి

నిలబడి తినండి

చాలా వరకు ఆహారాన్ని మీరు నిలబడి తినడానికి ప్రయత్నించండి. ఇది చాలా ఉత్తమం. నిలబడి తినడం వల్ల మీ శరీరంలో చాలా వరకు కేలరీలు కరిగిపోతాయి. అలాగే మీరు వేగంగా తినగలుగుతారు. అలాగే తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది.

ఇలా తినండి

ఇలా తినండి

కొందరు సైకాలజిట్స్ చెప్పిన ప్రకారం.. మనం తినే స్నాక్స్ ను ఎడమ చేతితో పట్టుకోవాలట. ఇలా చేస్తే తక్కువగా తినడానికి అవకాశం ఉంటుందంట. దీంతో మీరు బరువు తగ్గేందకు మార్గం దొరుకుతుంది. ఈ ట్రిక్ ను కూడా మీరు వీలైనంత వరకు పాటించండి.

ప్లేట్స్ ను మార్చండి

ప్లేట్స్ ను మార్చండి

ఎవరైతే ఎక్కువ తింటూ ఉంటారో వారు తినడానికి ఉపయోగించే ప్లేట్స్ కూడా మార్పు చేసుకుంటే మంచిది. వీలైనంత వరకు బ్లూ, గ్రీన్ కలర్ ఉండేటటువంటి ప్లేట్స్ ఉపయోగించడం చాలామంచిది. దీని వల్ల కూడా మీరు తక్కువగా తినగలుగతారు. అలాగే బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

ట్విలైట్ లో భోజనం

ట్విలైట్ లో భోజనం

ఇక మీరు భోజనాన్ని కూడా కాస్త డార్క్ రూంలో తినడం చాలా మంచిది. అలాగే ప్లేట్లో ఎంత అన్న ఉందనే విషయాన్ని మీరు గమనిస్తూ ఉండకూడదు. ఇది చాలా కొంచెం ఉందని మీరు భావించకూడదు. ఇది కూడా మీరు తక్కువ ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీరు బరువు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది.

ఒక్క రోజుకు 1 కిలో బరువు తగ్గించే నిమ్మరసం

నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోండి

నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోండి

మీరు ఎక్కువ సంఖ్యలో కేలరీలు కలిగి ఉండే ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే మీరు తీసుకున్న ఆహారం జీర్ణంకావడానికి బాగా సమయంపట్టేలా చూసుకోండి. కొన్నిసార్లు ఉదయం ఓట్ మీల్స్ తీసుకోవడం కంటే గుడ్లు తినడమే చాలా మంచిది. ఇది మీరు బరువు తగ్గేందుకు ఎంతో సాయం చేస్తుంది. ఈ రోజు ఇలాగే చేయండి మరి.

ప్రత్యేక డ్రెస్ వేసుకోండి

ప్రత్యేక డ్రెస్ వేసుకోండి

ఇదేమిటి.భోజనం చేయడానికి ప్రత్యేకంగా రెడీ కావాలా అని మీకు సందేహం రావొచ్చు. అవును ఈ ట్రిక్ కూడా మీరు బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మీరు తినే సమయంలో ధరించే డ్రెస్ కూడా మీపై ప్రభావం చూపుతుంది. మీరు ఫార్మల్ డ్రెస్ ధరిస్తే ఎంతో మంచిది. దీనివల్ల మీరు నెమ్మదిగా తినగలుగుతారు. దీంతో మీరు బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

డార్క్ చాక్లెట్ తినండి

డార్క్ చాక్లెట్ తినండి

మీకు బాగా ఆకలి వేసినప్పడు డార్క్ చాక్లెట్ తినండి. అది మీకు మంచి శక్తిని అందిస్తుంది. అలాగే ఆకలికాకుండా చూస్తుంది. అలాగే మీ శరీరంలో కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది. బరువు తగ్గేందుకు ఇది కూడా మంచి చిట్కా.

English summary

Tested Tricks For Weight Loss

Try these popular weight loss tricks that will help you lose weight like a pro in no time at all! Read to know about the best weight loss tricks.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more