Latest Updates
-
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -
ఈరోజు రాత్రి అరుదైన యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
శని దోషం ఉందా? ఈ 7 పరిహారాలు వెంటనే మొదలుపెట్టండి -
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే! -
సోమవతి అమావాస్య: ఈ చిన్న పరిహారాలతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు! -
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు -
మ్యారేజ్ లైఫ్ బోర్ కొడుతుందా.. ప్రతిరోజూ రొమాంటిక్‌గా ఉండాలంటే ఇలా చేయండి.! -
ప్రేమ ఒక్కటే ఉంటే పెళ్లి నిలబడుతుందా? వందల ఏళ్ల నాటి చాణక్యుడి సమాధానం ఇదే! -
స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
కొత్త కోవిడ వేరియంట్ కేపీ2 నుంచి ఇలా కాపాడుకోండి..!
ప్రపంచాన్ని కోవిడ్ లాంటి మరో మహమ్మారి ఆక్రమించనుంది. ఇప్పటికే కోవిడ్ పోలిన కేపీ2 వైరస్ మహారాష్ట్రలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటికి 91 మంది కేపీ2 వేరియంట్ వైరస్‌కు గురయ్యారు. క్రమక్రమంగా ఈ కేపీ2 వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్నట్లు కనుగ్గొన్నారు. ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తున్న ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఈ వైరస్‌ను ఎదుర్కొనే విధంగా ఎలా తాయారు చేసుకోవాలి.
శరీరాన్ని కరోనా కూడా తట్టుకునేలా తయారు చేసుకోవాలి. కొన్ని చిట్కాలను , పద్ధతులను పాటిస్తే కరోనా లాంటి వైరస్‌లు వస్తే మన శరీరం వాటిని తట్టుకొని నిలబడగులుగుతుంది. కెపి2 వేరియంట్‌కు ఎక్కువ భయపడాల్సిన అవసరం వుండదు.
వైరస్‌లను ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి పెరగాలి. అందుకు ముఖ్యమైన పోషకాలను తప్పకుండా తీసుకోవాలి. వైటమిన్ సి, వైటమిన్ డి, జింక్ పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలను ఆహారంలో తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరం సిద్ధమౌతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో వైటమని డి కీలక పాత్ర పోషిస్తుందని పరోశోధనలో తేలింది. ఊపిరి తిత్తుల సమస్య నుంచి కూడా వైటమిన్ డి కాపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎండ నుంచి వైటమిన్ డి లభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు వైటమిన్ డిని అందించే ఇతర ఆహారా పదార్ధాలను తప్పకుండా తీసుకోవాలి.

గోరువెచ్చని నీరును తాగడం అలవాటు చేసుకుంటే శరీరంలో ఉన్న బ్యాక్టీరియా, విషపదార్ధాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయని పరిశోధకులు అంటున్నారు. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని చెబుతున్నారు. రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుందని, మొత్తంగా శరీరం మొత్తం ఆరోగ్యంగా వుంటుందని అంటున్నారు.
ప్రతీ రోజూ 30 నిమిశాలు వ్యాయామం లేదా యోగాకు కేటాయించాలి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల హార్మోన్లలో సమతుల్యత కూడా ఏర్పడుతుందని కనుగ్గొన్నారు.
కింటి నిండా నిద్ర పోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి రోజు 7 నుంచి 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలని పరిశోధకులు చెబుతున్నారు.
ఒక గ్లాసు పాలల్లో తగినంత పసుపు వేసుకొని కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతందని అంటున్నారు. పసుపులో వుండే కుర్కుమిన్‌లో యాంటీ ఆక్సిడెంట్ పదార్ధాలు ఎక్కువగా వుంటాయంటున్నారు. ప్రతి రోజూ పసుపు పాలను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడ్డమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతంది.
పాలల్లో టీపొడి వేసుకొని తాగే టీ కన్నా హెర్బల్ టీ చాలా ఉత్తమం ఆరోగ్యకరమని అంటున్నారు. ఒక కప్పు వేడినీటిలో అల్లం, తులసి ఆకులు, మిరియాలు, లవంగం, నిమ్మకాయ వేసుకొని తాగితే శరీరంలో ఉండే విషపు పదార్ధాలు బయటకి వెళ్లడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
రోజూ చేసుకునే వంటల్లో పసుపు, మిరియాలు, అల్లం, ఇలాచీలు వేసుకోవడం వల్ల వాటితో రుచి మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందంటున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయ్. అనేక ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని ఇవి కాపాడతాయ్.
పైన ఇవ్వబడిన కూరగాయలను, పానియాలను క్రమం తప్పకుండా తాగిగే ఖచ్చితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కెపి2 లాంటి వైరస్‌లను చూసి భయపడాల్సిన అవసరం వుండదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications