Latest Updates
-
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - మంగళవారం, 28 ఏప్రిల్ 2026 -
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే!
బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సహాయపడే హెల్ప్ ఫుల్ టిప్స్
మన ఇండియాలో గత రెండు దశాబ్దాలుగా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా వేగంగా విస్తరించింది. అన్ని రకాల క్యాన్సర్లలోకి బ్రెస్ట్ క్యాన్సర్ ఒక సాధారణ క్యాన్సర్ గా మారింది. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రతి 28 మహిళల్లో ఒకరికి రొమ్ముక్యాన్సర్ ను ఎదుర్కొంటున్నారు. గ్రామీన ప్రాంతాలతో పోల్చితే పెద్ద పెద్ద నగరాలు మరియు మెట్రోపాలిటి ప్రదేశాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ బారీన పడే వారి సంఖ్య నిష్పత్తి ఎక్కువగా ఉంది.
ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ కు సంకేతాలు..తీసుకోవల్సిన జాగ్రత్తలు: క్లిక్ చేయండి
కానీ, చాలా కాలం నుండి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కు ఖచ్ఛితమైన కారణాలు ఇప్పటి వరకూ కనుక్కోలేకపోతున్నారు. ఈ ప్రాణాంతకమైన వ్యాధికి ముఖ్య కారణంగా వంశపారంపర్యం మరియు జీవనశైలిలో మార్పలుగా భావిస్తున్నారు. కారణం ఏదైనప్పుటికి రొమ్ముక్యాన్సర్ రాకుండా ప్రమాదాన్ని తగ్గించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి:

శారీరక శ్రమ లేదా రెగ్యులర్ వ్యాయామం చాలా అవసరం:
బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడానికి రెగ్యులర్ వ్యాయామం చాలా గొప్పగా సహాయపడుతుంది. మరియు ఇంటి పనులు చేసుకోవడం, ఫిజికల్ గా ఎంతో సహాయపడుతుంది. శారీరక వ్యాయామాలు పనులు వల్ల క్యాన్సర్ కు కారణం అయ్యే ఫ్యాట్ సెల్స్ ను శరీరంలో తగ్గిస్తుంది . ఫలితంగా శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు టెస్టోస్టిరాన్ వంటి హార్మోనులు విడుదల చేస్తుంది. శరీరంలో ఫ్యాట్ సెల్స్ పెరుగుదల కారణంగా క్యాన్సర్ కణితలకు దారితీస్తుంది. కాబట్టి, ఇప్పటి నుండి, ఈ రోజు నుండి ఫిజికల్ ఎక్సర్ సైజ్ లకు ప్రాధాన్యత ఇచ్చి కనీసం 30నిముషాల వ్యాయం రెగ్యులర్ గా చేయడం వల్ల అనేక వ్యాధులతో పోరాడవచ్చు.

ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి:
ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి: బ్రెస్ట్ క్యాన్సర్ కు ఆల్కహాల్ కూడా ఒక కారణంగా కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు. కాబట్టి, మద్యం తీసుకోవడం మానేయండి. లిమిట్ గా తీసుకోడం కంటే పూర్తిగా మానేయడం ఉత్తమం. మద్యం రెగ్యులర్ గా తీసుకోవడానికి అదేం ఎనర్జీ డ్రింక్ కాదు, మద్యానికి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన పండ్లరసాలు, మిల్క్ షేక్స్ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి

బ్రెస్ట్ ఫీడింగ్(బిడ్డకు పాలుపట్టడం):
బ్రెస్ట్ ఫీడింగ్(బిడ్డకు పాలుపట్టడం): మహిళలు, ఎవరైతే వారి శిశువుకు పాలు పడుతారో, అటువంటి మహిళల్లో సాధారణ మహిళల్లో కంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 5 శాతం తక్కువ ఉంటాయి . ఎవరైతే దీర్ఘకాలం పాటు శిశువుకు పాలు పడుతారో అటువంటి వారు క్యాన్సర్ బారీన చాలా తక్కువగా పడుతారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణం అయ్యే ఈస్ట్రోజెన్ ను బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల శరీరంలోఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గించుకోగలరు.

అధిక బరువును నివారించాలి:
బ్రెస్ట్ క్యాన్సర్ కు మరో సాధరణ కారణం స్థూలకాయం లేదా అధిక బరువు. ఊబకాయం, ముఖ్యంగా మోనోపాజ్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే ప్రమాధాన్ని పెంచుతుంది . అందువల్ల అధికబరువు, ఊబకాయంను నివారించి బ్రెస్ట్ క్యాన్సర్ కు దూరంగా ఉండండి.

ఆరోగ్యకరంగా తినాలి:
ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో బ్యాలెస్డ్ డైట్ తీసుకోవాలి. అధిక శాతంలో పండ్లు మరియు వెజిటేుబుల్స్ తీసుకోవాలి . అలాతే ఫ్యాటీ ఫుడ్స్ మరియు అధిక కార్భోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలకు తినకుండా నివారించాలి. మహిళలు, ఎవరైతే ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తింటారో, అటువంటి వారిలో ఫ్యాట్ ఫుడ్ అతి తక్కువ తినే వారికంటే ఎక్కువగా క్యాన్సర్ ప్రమాధం ఏర్పడుతుంది.

క్యాన్డ్ ఫుడ్స్ మరియు పానీయాలను నివారించాలి:
క్యాన్డ్ ఫుడ్స్ లేదా డ్రింక్స్ పరిమితి చేయాలి లేదా పూర్తిగా తగ్గించేయాలి. ఎందుకంటే వాటిలో కొన్ని రసాయనాల సమ్మేళనాలు కలిగి ఉంటాయి. ఇవి మహిల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదంను పెంపొందించడం అవసరం అయ్యే ఈస్ట్రోజన్ ను పెంచుతుంది. అధిక ఉష్ణోగ్రతలో తయారుచేసే వంటకాల వల్ల కూడా వ్యాధిని పెంచే అవకాశాలు కూడా ఎక్కువ. ఫ్రైచేసిన పదార్థాలు మరియు బార్బెక్యూంగ్ వంటివి అక్రిల్ అమైడ్ క్యాన్సర్ కు కారణం అయ్యే అంశాలను విడుదల చేస్తాయి.

సూర్య రశ్మి చాలా మంచిది:
ఉదయం సూర్యరశ్మి ద్వారా విటమిన్ డిని పొందవచ్చన్న విషయం కొన్ని పరిశోధనల ద్వారా నిరూపితమైనది. ఈ డి విటమిన్ క్యాన్సర్ హార్మోనులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి, ఎండలో ఉండటానికి ఏ మాత్రం వెనకాడవద్దు. అయితే అధికంగా ఉండే ఎండలో ఎక్కువ సహయం ఉండకూడు. లేదంటే చర్మ క్యాన్సర్ కు కారణం కావచ్చు.



Click it and Unblock the Notifications