రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండటానికి 7 సూపర్ మార్గాలు

By Super

గత 25 సంవత్సరాలలో,భారతీయ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సంఘటనలు చాలా పెరిగాయి. టాటా మెమోరియల్ హాస్పిటల్ యొక్క వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అనేది అన్ని క్యాన్సర్ల కన్నా సర్వసాధారణం అయిపొయింది. క్యాన్సర్ మరణానికి ప్రధాన కారణం అవుతుంది.

నిజానికి, భారతదేశంలో ఇటీవల అధ్యయనం చేసిన దాని ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 28 మంది మహిళల్లో ఒకరికి వస్తుందని తెలిసింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పోలిస్తే (22 మందిలో ఒకరికి) పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. అయితే అక్కడ 60 మహిళల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉంది.

స్క్రీనింగ్లు మరియు పరీక్షల కోసం వెళ్లటంతో పాటు,తప్పనిసరిగా జీవనశైలిలో మార్పులు చేసుకోవటం ద్వారా మీరు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

ఇంటి పని చేయండి

ఇంటి పని చేయండి

మహిళలు చురుకుగా ఉండటం వలన రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెప్పుతున్నారు. వ్యాయామం అనేది కొవ్వు కణాల సంఖ్యను తగ్గించుట మరియు ఈస్ట్రోజెన్ మరియు టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల విడుదల బాధ్యతను తీసుకుంటుంది. కొవ్వు కణాలు కణితి పెరుగుదలను ప్రోత్సహిస్తాయని భావిస్తున్నారు. మహిళలు ప్రతి రోజు 30 నిమిషాలు లక్ష్యంగా పెట్టుకొని శారీరక శ్రమ చేయాలి. ఇది కనీసం 20 శాతం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది. శ్వాస బయటకు పోయిన భావన కలుగుతుంది. కాబట్టి ఆనందంగా ప్రతి రోజు ఇంటిని దుమ్ము దులపడం వంటి పనులను చేయండి.

మీ శిశువుకు రొమ్ముపాలు ఇవ్వటం

మీ శిశువుకు రొమ్ముపాలు ఇవ్వటం

మహిళలు వారి జీవితకాలంలో ఒక సంవత్సరం అంతా రొమ్ముపాలు ఇవ్వవలసిన అవసరం లేదు. రొమ్ముపాలు ఇవ్వని వారిలో కంటే ఇచ్చే వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఐదు శాతం తక్కువగా ఉంటుంది. క్యాన్సర్ గణాంకాల విశ్లేషణ ప్రపంచ క్యాన్సర్ పరిశోధన ఫండ్ ద్వారా దొరకలేదు. ఒక స్త్రీ రొమ్ము పాలు ఇవ్వటం వలన వ్యాధి పొందడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. తల్లిపాలు అనేవి తల్లి రక్తంలో క్యాన్సర్ సంబంధిత హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుందని భావిస్తున్నారు. తల్లిపాలు చివరికి వచ్చినప్పుడు, శరీరంలో దెబ్బతిన్న కణాలను వదిలించుకోవటం వలన క్యాన్సర్ గా మారదు.

తక్కువ మద్యం త్రాగండి

తక్కువ మద్యం త్రాగండి

మీరు ప్రతి రోజు మద్యం త్రాగితే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అలాగే మీరు ప్రతి రోజు ఎక్కువ మధ్యంను తీసుకుంటే అదే విధంగా క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుందని హిఘెస్ చెప్పారు. మీరు మద్యం త్రాగడాన్ని తగ్గించటానికి సాధారణ చర్యలను ప్రయత్నించవచ్చు. రెండు గ్లాస్ లకు బదులుగా ఒక గ్లాస్ మద్యం త్రాగండి. అలాగే మద్యం లేని రాత్రులను ఆస్వాదించండి. మద్యం యూనిట్స్ తగ్గించటానికి చిన్న వైన్ గ్లాస్ లను ఉపయోగించండి.

నైట్ షిఫ్ట్ తగ్గించుకోవాలి

నైట్ షిఫ్ట్ తగ్గించుకోవాలి

మహిళలు ఆరు సంవత్సరాలు లేదా ఎక్కువ సంవత్సరాలు వారంలో మూడు రోజులు నైట్ షిఫ్ట్ చేస్తే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెట్టింపు అవుతాయని డానిష్ పరిశోధకులు చెప్పుతున్నారు. అయితే దీని మీద ఇంకా పరిశోదనలు జరగవలసి ఉంది. UK యొక్క హెల్త్ అండ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ 2015 లో ఒక అధ్యయనం ఆరంభించింది. దానిలో మరింత సమాధానాలు కనుగొనడానికి సహాయం చేయాలని ప్రచురించింది.

అయినప్పటికీ,నైట్ షిఫ్ట్ వలన అనారోగ్య ప్రవర్తన ఉంటుందని డాక్స్ స్పష్టంగా చెప్పలేదు. మీరు నైట్ షిఫ్ట్ కాకపోయినా సరే సరైన ఆహారం తీసుకోకపోతే క్రియారహితంగా మారే అవకాశం ఉంది. అందువలన మహిళలు వారి పని గంటలు మరియు వారి మొత్తం జీవనశైలి గురించి ఆలోచించాలి.

కొలెస్ట్రాల్ తగ్గించండి

కొలెస్ట్రాల్ తగ్గించండి

కొలెస్ట్రాల్ తగ్గటానికి వాడే మందులు స్టాటిన్స్ వంటి వాటి వలన మహిళలకు హానికరమైన డక్టాల్ కార్సినోమా ప్రమాదం రెట్టింపు అవుతుంది. ఫ్రెడ్ హచిసన్ క్యాన్సర్ పరిశోధన కేంద్రం ప్రకారం ఐడిసి,రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ రకం అని చెప్పవచ్చు. కొన్ని అధ్యయనాలు స్టాటిన్స్ ను స్వల్పకాలికంగా వాడటం వలన రొమ్ము క్యాన్సర్ కు వ్యతిరేకంగా ఒక రక్షక ప్రభావం కనిపిస్తుంది. అదే దీర్ఘకాలంగా స్టాటిన్స్ వాడటం వలన నిర్దిష్ట రసాయన మార్గాలు దెబ్బతిని కణితుల పెరుగుదలకు కారణమవ్వవచ్చు. అయినప్పటికీ, వైద్యుడిని సంప్రదించకుండా స్టాటిన్స్ తీసుకొవటం ఆపకండి.

అనారోగ్య రసాయనాలకు దూరంగా ఉండండి

అనారోగ్య రసాయనాలకు దూరంగా ఉండండి

ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ ఉంచిన ఆహారాలు మరియు పానీయాలను ఉపయోగించకూడదు. అలాగే మైక్రోవేవ్ ఆహారాలను కూడా తినకూడదు. పోషకాహార నిపుణులు కానెర్ మిద్దేల్మన్న్,విట్నీ హెచ్చరికలు చేస్తున్నారు. వారు ఒస్టోగెన్స్ వంటి రసాయనాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదంను పెంచుతాయని చెప్పారు. అధిక ఉష్ణోగ్రత వద్ద మాంసం గ్రిల్ చేయుట లేదా నూనెలో వేగించుట వలన క్యాన్సర్ ప్రమాదంను పెంచే ఆక్రిలేమైడ్ను అనే రసాయనం అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి తక్కువ వేడిలో నెమ్మదిగా మాంసంను ఉడికించే ప్రయత్నం చేయాలి. అలాగే నిల్వ ఉంచిన మంసాలకు దూరంగా ఉండాలి.

ఎండలో కొంతసేపు నిల్చోవాలి

ఎండలో కొంతసేపు నిల్చోవాలి

సహజ సూర్యకాంతి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే విటమిన్ డి పెరగటానికి కూడా ఉత్తమ మార్గం అని కెనడియన్ పరిశోధకులు చెప్పుతున్నారు. ప్రయోగశాలలో పరీక్షలు రొమ్ము క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగిన హార్మోన్ ను విటమిన్ D మార్పిడి చేయవచ్చని సూచిస్తుంది. ఈ సలహా తప్పక పాటించాలి. అయితే సూర్యకాంతి వలన చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది.

Story first published: Monday, July 14, 2014, 16:58 [IST]
Desktop Bottom Promotion