Latest Updates
-
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా..
దీపావళి అనగానే మనకు టపాసులు, దీపాలతో పాటు నోరూరించే పిండి వంటలు, స్వీట్లు గుర్తుకు వస్తాయి. పండగ పూట ప్రతి ఇంటిలోనూ స్వీట్లు తయారవుతుంటాయి. అయితే, ఈసారి దీపావళికి ఎప్పటిలాగే రొటీన్ స్వీట్లు కాకుండా కాస్త కొత్తగా, ఎంతో రుచికరంగా ఉండే ఒక అద్భుతమైన స్వీట్‌ను ట్రై చేయాలనుకుంటున్నారా? మీ ఇంట్లో సాధారణ హల్వా చేయడానికి పదార్థాలు లేకపోయినా, కేవలం వేరుశెనగలు ఉంటే చాలు..ఎంతో ఈజీగా, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వాను తయారు చేసుకోవచ్చు.
ఈ దీపావళికి మీ కుటుంబ సభ్యులకు, అతిథులకు ఈ ప్రత్యేకమైన హల్వా చేసి పెట్టి చూడండి. అందరూ మిమ్మల్ని అభినందించడం ఖాయం. తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో తయారయ్యే ఈ పీనట్ హల్వా తయారీ విధానం, కావలసిన పదార్థాల వివరాలు ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వేరుశెనగలు: 1 కప్పు
నెయ్యి: 2 నుంచి 4 టీస్పూన్లు
బెల్లం: ఒకటిన్నర కప్పులు
నీరు: 2 కప్పులు
కుంకుమపువ్వు లేదా కేసరి పొడి: 1 చిటికెడు
యాలకుల పొడి: అర టీస్పూన్
జీడిపప్పు: 2 టీస్పూన్లు
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి
తయారీ విధానం
-మొదటగా మందపాటి వేరుశెనగలను తీసుకుని పొట్టు వొలుచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వేరుశెనగలను మిక్సర్ జార్ లో వేసి, మరీ ముద్దగా కాకుండా మెత్తని పొడిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న వేరుశెనగ పొడిని అందులో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించాలి. వేరుశెనగ పొడి మంచి సువాసన వెలువడే వరకు వేయించి, ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే గిన్నెలో లేదా వేరే పాత్రంలో ఒకటిన్నర కప్పుల బెల్లం, 2 కప్పుల నీరు పోయాలి. బెల్లం నీటిలో పూర్తిగా కరిగే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత, ఈ ద్రావణాన్ని సుమారు 1 నిమిషం పాటు బాగా మరిగించుకోవాలి. దీనివల్ల హల్వాకు మంచి పద్ధతి, పాకం కుదురుతుంది.
-ఇప్పుడు మరగబెట్టిన బెల్లం ద్రావణాన్ని కొద్ది కొద్దిగా ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ పొడిలో పోస్తూ కలపాలి. ఉండలు కట్టకుండా గరిటెతో వేగంగా తిప్పుతూ మిశ్రమం అంతా బాగా కలిసేలా చూసుకోవాలి.
-మిశ్రమం కొద్దిగా ఉడుకుతున్నప్పుడు అందులో ఒక చిటికెడు కుంకుమపువ్వు లేదా కేసరి పొడి, అర టీస్పూన్ యాలకుల పొడి వేయాలి. ఇది హల్వాకు అద్భుతమైన రంగును, సువాసనను ఇస్తుంది. మిశ్రమం చిక్కబడి, పట్టులా మృదువుగా తయారయ్యే వరకు కలుపుతూనే ఉండాలి.
-ఈ దశలో మరో రెండు చెంచాల నెయ్యిని జోడించాలి. హల్వా పాన్ కి అంటుకోకుండా, గిన్నె నుండి వేరుపడే వరకు సుమారు 5-7 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివరగా రెండు చెంచాల నలిపిన జీడిపప్పు ముక్కలను వేసి బాగా కలపాలి.
-అంతే పీనట్ హల్వా రెడీ. ఈ హల్వా వేడిగా ఉన్నప్పుడు కాస్త జారుడుగా అనిపించినా, చల్లారే కొద్దీ మరింత చిక్కబడుతుంది.
-దీనిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో నిల్వ చేస్తే, సుమారు 3 రోజుల వరకు ఫ్రెష్ గా, టేస్టీగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
