Latest Updates
-
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్‌ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.?
మూర్చ వ్యాధి గురించి కొన్ని అపోహలు- వాస్తవాలు
సాధారణంగా రోడ్డు మీద వెళ్తుంటే హఠాత్తుగా కింద పడిపోయి కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఉండేవాళ్లను చూసే ఉంటాం. ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుందని, పిల్లలకు కూడా ఈ వ్యాధి వస్తుందని రకరకాల అభిప్రాయాలతో మూర్ఛవ్యాధి ఉన్నవారిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రారు. అంతేకాదు.. మూర్ఛ ఉందన్న కారణంగా విడాకుల కోసం వెళ్లేవాళ్లు కూడా కనిపిస్తుంటారు. నిజానికి ఈ వ్యాధి అనుకున్నంత ప్రమాదకరం ఏమీ కాదు. మూర్చవ్యాధి గురించి మరికొన్ని సందేహాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే...
నాడీవ్యవస్థ పైన ప్రభావం చూపించే వ్యాధి మూర్ఛ వ్యాధి లేదా ఎపిలెప్సీ. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. 0.5 నుంచి 2 శాతం మందిలో జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి మూర్ఛ రావచ్చు. మనదేశంలో దాదాపు 10 మిలియన్ల మందికి మూర్ఛ ఉంది. అంటే ప్రతి వెయ్యిమందిలో పదిమందికి మూర్ఛ ఉందన్నమాట.

మెదడులో విద్యుత్తు అనియంత్రితంగా విడుదల అయినప్పుడు ఇలా మూర్ఛలు వస్తాయి. ఒక వ్యక్తికి కనీసం రెండుసార్లు మూర్ఛ వస్తేనే దాన్ని మూర్ఛవ్యాధి లేదా ఎపిలెప్సీగా పరిగణిస్తారు. విపరీతమైన జ్వరం రావడం, పుట్టుకతో లోపాలు, మెదడులో లోపాలు, కణుతులు, మెనింజైటిస్ లాంటి ఇన్‌ఫెక్షన్లు, తలకు గాయాలు కావడం, మరీ వేడినీళ్లతో తలస్నానం చేయడం, అతిగా మద్యం తీసుకోవడం, నిద్ర లేకపోవడం, నెలసరి సమయాలు, మందుల మధ్య ప్రతిచర్యలు సాధారణంగా మూర్ఛకు కారణమవుతాయి.
మూర్ఛ వ్యాధి యొక్క అపోహలు- నిజానిజాలు

1. అపోహ: ఇది అంటువ్యాధి
వాస్తవం : గాలి, ఆహారం, నీరు, స్పర్శ లేదా మరే ఇతర మార్గం ద్వారా గాని మూర్ఛ ఒకరి నుంచి మరొకరికి అంటుకోదు.

2. అపోహ: మూర్ఛ వచ్చిన వ్యక్తిని పట్టుకుని ఉండాలి
వాస్తవం: వ్యక్తిని నిర్బంధించే ప్రయత్నం చేయవద్దు. ఇది మరింత గాయం కలిగించవచ్చు. గట్టి, పదునైన వస్తువులను వారికి దగ్గరలో ఉంచవద్దు. తలకింద ఏదైనా మెత్తని వస్తువును ఉంచాలి.

3. అపోహ: మూర్ఛ వ్యాధి పుట్టుకతోనే వస్తుంది
వాస్తవం: ఏ వయసులోనైనా, ఏ సమయంలోనైనా మూర్ఛ రావచ్చు. అయితే సాధారణంగా మొదట పిల్లల్లోనూ, తరువాత యువకులైన పెద్దవాళ్లలోనూ వస్తుంది.

4. అపోహ: మూర్ఛ తెలివితేటలు తక్కువగా ఉన్నాయనడానికి సంకేతం
వాస్తవం: ఇది ఒక శారీరక స్థితి మాత్రమే గాని మానసిక లోపం ఎంతమాత్రమూ కాదు. అసాధారణమైన తెలివితేటలు కలిగిన ప్రముఖ వ్యక్తులెందరో మూర్ఛవ్యాధి ఉన్నవాళ్లే.

5. అపోహ: మూర్ఛ ఉన్నవాళ్లను దేవుడు ఆవహించి ఉంటాడు
వాస్తవం: దేవుడు ఆవహించాడని వీళ్లకు పూజలు చేస్తుంటారు కొందరు. కాని మూర్ఛ ఉన్నప్పుడు ఈ రోగులు అదుపు చేయలేని విధంగా పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఇది మానవాతీత శక్తుల పని కాదు. మెదడులో సమతుల్యత దెబ్బతినడం కారణం. కాబట్టి వారిని పూజించడం కాకుండా సకాలంలో వైద్య చికిత్సలు అందించి, ఆదరించాలి.

6. అపోహ: మూర్ఛ రోగి ఉంటే ఆ కుటుంబానికే కళంకం :
వాస్తవం: ఇలా భావించి చాలామంది ఈ నిజాన్ని దాచివుంచుతుంటారు. దీనివల్ల మరిన్ని సమస్యలు రావడమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి మూఢ భావాలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

చేయకూడనివి...
1.మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు ఉన్నట్టుండి మందులను ఆపేయకండి. దీనివల్ల నరాల సంబంధితమైన అత్యవసర పరిస్థితి అయిన ఎపిలెప్టికస్‌ని తొందరగా తీసుకురావచ్చు.
2. మీకు మీరుగా మందుల బ్రాండ్‌ను మార్చకూడదు.
3. మందుల మోతాదులో మార్పులు సొంతంగా చేయకూడదు.
4. ఏ మందుల వల్లనైనా దుష్ప్రభావాలు కలిగినా, సహించకపోయినా వెంటనే డాక్టర్‌కు చెప్పడానికి వెనుకాడవద్దు.
5. ఏకకాలంలో ఇతర వ్యాధులున్నప్పుడు, గర్భిణిగా ఉన్నప్పుడు ఇతర మందులను నిలిపివేయడం గాని, తగ్గించడం గాని మీకు మీరుగా చేయకూడదు.
6. మరీ కాంతిమంతమైన దీపాలకు, బిగ్గరగా ఉండే ధ్వనులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.
చేయకూడనివి
7. వాహనాలను నడపడం
8. ఈత కొట్టడం
9. ఎత్తయిన చోట్ల పనిచేయడం, ఎత్తులకు ఎక్కడం చేయకూడదు.
10. భారీ యంత్రాలు, లేదా ఉపకరణాలతో పనిచేయడం.
మూర్ఛ వచ్చినప్పుడు: మూర్ఛను ఆపే ప్రయత్నం చేయొద్దు., ఆ సమయంలో బలవంతంగా నోట్లోకి ఏమీ కుక్కవద్దు. తగినంత గాలి ఆడేందుకు వీలు కలిగించాలి. వాంతి మింగకుండా ఉండేందుకు పక్కకు తిరగాలి. వీలయినంత త్వరగా వైద్య సహాయం అందేలా చూడాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications