Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వర్టిగో(తరచూ తలతిరుగుడు): ఉత్తమ నివారణ చిట్కాలు
ప్రస్తుత రోజుల్లో చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య తల తిరుగుడు. దీనినే వైద్య పరిభాషలో ‘వర్టిగో' అంటారు. సహజంగా కొంత మంది తల తిరుగుతోంది.. వాంతి వచ్చినట్టుగా ఉంది అంటుంటారు. దీన్నేవర్టిగో అంటారు. ఇందులో రెండు రకాలుంటాయి. సబ్జెక్టివ్ వర్టిగో అంటే తనకు తాను తిరిగినట్టు అనిపిస్తుంది. ఆబ్జెక్టివ్ వర్టిగో అంటే ఎదురుగా కనిపించే వస్తువులు తిరిగినట్టు అనిపిస్తాయి. కొందరిలో కిందికి లాగినట్టు, పక్కకు లాగినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా పొజిషన్ మారినప్పుడు, తల తిప్పినప్పుడు, పడుకున్నప్పుడు ఇది ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడేవారు ఒంటరిగా ఎటు వెళ్ళలేక భయపడుతుంటారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది కాని ఈ సమస్యను అనుభంవిచేవారి బాధ ఇంతా అంతా కాదు.. ఉదయం నిద్ర లేవగానే మొదలవుతుంది. ఈ సమస్య నిద్రనుంచి లేసి ప్రక్కకు తిరిగినప్పుడు, రోడ్డుమీదికి వెళ్లి నడుస్తున్నప్పుడు, ఆఫీసులో కూర్చుండి విధులు నిర్వహిస్తున్నప్పుడు ఉన్నట్టుండి తల తిరుగుతుంది. కొన్ని సందర్భాలలో తూలిపడిపోవడం కూడా జరుగుతుంది.
వర్టిగో కి కారణాలు: చెవిలోపలి భాగంలోని నరం వాపు, మినియర్స్ డిసీజ్, చెవిలో చీము లాంటి సమస్యలున్నప్పుడు వర్ట్టిగో ఉంటుంది. మెదడులో స్ట్రోక్ వచ్చినా, పార్శపు నొప్పి ఉన్నాఈ సమస్య ఉండవచ్చు. కంటిలో కార్నియా వాచినా, మెర్క్యురీ, సీసం, టిన్ వంటి లోహాలున్నమందులు వాడితే చెవి నరం దెబ్బతిని ఇలా జరగొచ్చు. కొన్ని యాంటి బయాటిక్స్, ఫిట్స్, డిప్రెషన్, బీపీ, పెయిన్ కిల్లర్లు, జలుబు, దగ్గు మందులు, క్లోరోక్విన్ లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఆల్కహాల్ వల్ల కూడా వర్టిగో రావచ్చు.
లక్షణాలు: చెవిలో సమస్య ఉన్నప్పుడు తల తిప్పినా, పడుకున్నా వస్తుంది. వినికిడి సన్నగిల్లడం, శబ్దాలు, చెవిలో భారంగా, మూసినట్టు ఉంటుంది. ఇంతేకాకుండా కళ్లు మసక, నీరసం, తలనొప్పి, గుండెదడ, నిలబడలేకపోవడం, ఏకాక్షిగత లోపం, నడిచినా, నిలబడినా పడిపోతున్నట్టు ఉండటం, వికారం, వాంతులు ఉంటాయి, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఎక్కువ శబ్దం, వెలుతురు భరించలేరు. చెమటలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి రెండుగా కనిపించడం, మూర్ఛ, మాట్లాడలేకపోవడం కూడా ఉండొచ్చు. కాబట్టి వర్టిగో ఉన్నవాళ్లకు చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద పెద్ద ప్రమాదాల దాకా ఎదురవుతాయి. కోపం, చిరాకు, భయం, ఆందోళన, ఉత్సాహం లేకపోవడం, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఎముకలు విరగడం, గాయాలు, ప్రమాదాలు సంభవిస్తాయి.

మంచి నిద్ర
వర్టిగో కు ప్రధాన కారణాల్లో నిద్రలేమి కూడా ఒకటి. అందువల్ల ప్రతి రోజూ తగినంత నిద్ర పొందడం వల్ల చాలా వరకూ మీ సమస్యలు దూరం అవుతాయి.

ధనియాలు
ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ గూస్ బెర్రీ(ఉసిరి పౌడర్) మిక్స్ చేసి ఒక గ్లాస్ నీళ్ళో వేసి రాత్రిసమయంలో నానబెట్టుకోవాలి. తర్వాతి రోజు ఉదయం నిద్రలేచి ఆ నీటిని వడగట్టి, అందులో తేనె లేదా పంచదార అరస్పూన్ వేసి వెంటనే త్రాగాలి. ఈ హోం రెమడీ వర్టిగోను నేచురల్ గా తగ్గిస్తుంది.

బాదం మరియు పుచ్చకాయ విత్తనాలు
వర్టిగో నివారించడంలో బాదం మరియు పుచ్చకాయ విత్తనాలు అద్భుతంగా సహాయపడుతాయి. ఒక బౌల్లో 8బాదంగింజలు, 8పుచ్చకాయవిత్తనాలు, 2tbspగోధులములు మరియు 1tbsp బొప్పాయి విత్తనాలు వేసి, నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం నీరు వంపేసి ఈ మొత్తం పదార్థాలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రైయింగ్ పాన్ స్టై మీద పెట్టి అందులోనెయ్యి వేసి వేడయ్యాక అందులో 2లవంగాలు, ఈ పేస్ట్ ను కూడే వేసిఒక నిముషం ఫ్రై చేసుకొని, స్టౌ ఆఫ్ చేసి ఈ పేస్ట్ ను పాలలో మిక్స్ చేసి త్రాగాలి. ఇలా వారానికొకసారి చేస్తే వర్టిగో సమస్య ఉండదు.

నిమ్మ రసం
ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకొని అందులో బ్లాక్ పెప్పర్, చిటికెడు ఉప్పు, సగం నిమ్మకాయ రసాన్ని వేసి మొత్తం బాగా మిక్స్ చేసి, త్రాగాలి. లేదా నిమ్మరసాన్ని మీ సలడ్స్ లో చిలకరించి తీసుకోవాలి. నిమ్మరసం వర్టిగో నివారణకు ఒక నేచురల్ హోం రెమడీ.

నీళ్ళు మరియు జ్యూసులు
మీ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. మీరు ప్రతి రోజూ కనీసం 10గ్లాసుల నీళ్ళు త్రాగాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆరెంజ్ జ్యూస్ ను త్రాగాలి.

స్ట్రాబెర్రీ
తాజాగా మరియు పండిన స్ట్రాబెర్రీలను తీసుకొని, పెరుగులో వేసి బాగా మెత్తగా చేత్తో గుజ్జలా చేయాలి. ఇలా చేసిన తర్వాత నేరుగా తినేసేయాలి. ఇది వర్టిగో సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా త్వరగా హెల్తీగా కోలుకొనేలా చేసి ఒక సులభహోం రెమడీ.

అల్లం
అల్లం టీని త్రాగాలి. లేదా కొద్దిగా పచ్చి అల్లంను నములుతుండాలి. ఇది వర్టిగో సంబంధిత తలతిరుగుడ, వికారంను నివారిస్తుంది.

తులసి
వర్టిగో నివారణకు తులసి ఒక మంచి హెర్బల్ రెమడ. కాబట్టి, తులసి ఆకులను నేరుగా తినడం లేదా టీలో వేసికొని త్రాగడం మంచిది.

బాదం పాలు
బాదంలో 26శఆతం కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఇ, బి, మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, బాదంలను కొన్నింటిని తీసుకొని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వీటి పొట్టు తీసి, మెత్తగా పేస్ట్ చేసి వేడి పాలు లేదా నీళ్ళలో వేసి, మిక్స్ చేసి త్రాగాలి. వర్టిగోకు ఒక బెస్ట్ హోం రెమడీ.

యోగ
యోగా మరియు మెడిటేషన్ రెగ్యులర్ గా చేయడం వల్ల వర్టిగో సమస్యను నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications











