Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
న్యుమోనియా నివారణకు 8 ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీస్
వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు , ఇన్ఫెక్షన్స్ సోకుతుంటాయి. వర్షాకాలంలో చాలా త్వరగా ఇన్ఫెక్షన్స్ బారీన పడుతుంటారు. అలాంటి వ్యాధుల్లో ఒకటి న్యుమోనియా. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలో ఎక్కువగా గమనిస్తుంటాము.
హై ఫీవర్ కంటిన్యుగా వస్తున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఫీలవుతున్నా, చెస్ట్ పెయిన్, దగ్గు, జలుబు, దాంతో పాటు గల్లపడుతున్నా ..పల్స్ రేట్ అమాంతంగా పెరిగినా (నిముషానికి 150 బీట్స్), ఈ లక్షణాలు ఎవరిలో కనిపించినా అది న్యూమోనియో లక్షణాలుగా గుర్తించి వెంటనే తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
ఊపిరితిత్తులకు సోకే ఒక కరమైన ఇన్ఫెక్షన్ ను న్యుమోనియా అంటారు. న్యుమోనియా అన్ని ఏజ్ గ్రూప్ ల వారికి సోకుతుంది.
పిల్లులు, మరియు పెరిగే వారిలో ఎక్కువ ఎఫెక్ట్ గా ఉంటుంది. పెద్దవారితో పోల్చినప్పుడు , చిన్న పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల న్యుమోనియాకు గురి అవుతారు.
న్యుమోనియా ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు, వారు బలహీనంగా మారుతారు మరియు తప్పనిసరిగా హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి ఉంటుంది.
సహజంగా న్యుమోనియా అనేది బ్యాక్టీయా, వైరస్ మరియు ఫలంగల్ వల్ల ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. మంచి ఆరోగ్యాన్ని నిర్వహిస్తూ, సరైన శుభ్రతలు పాటించడం వల్ల న్యుమోనియా నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఈ వ్యాధి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
కాబట్టి, బ్యాక్టీరిలయ్, వైలర్ ఇన్ఫెక్షన్లతో పాటు, లో ఇమ్యూనిటి ఉన్న వారిలో న్యుమోనియాకు గురయ్యే అవకాశాలు ఎక్కువ . కాబట్టి,, వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడానికి సరైన ఆహారాలు తీసుకోవాలి.
న్యుమోనియా నివారించడానికి వివిధ రకాల మెడికేషన్స్ ఉన్నాయి, న్యూమోనియా తగ్గించుకోవడానికి ఇతర మెడికేషన్స్ కంటే ఆయుర్వేద గ్రేట్ గా సహాయపడుతుంది . అంతే కాదు ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ ఉండవు . ముఖ్యంగా పిల్లలకు ఈ ఆయుర్వేదిక్ రెమెడీస్ ను సూచిస్తున్నారు.
న్యుమోనియా నివారించుకోవడం కోసం 8 ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఈ క్రింది విధంగా

1. నువ్వులు, ఫ్లాక్స్ సీడ్ మరియు తేనె :
ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఫ్లాక్స్ సీడ్ప్, తేనె , చిటికెడు ఉప్పు నీటిలో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగుతుంటే మంచి ఫలిత ఉంటుంది. న్యుమోనియా సంబంధించిన ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గించుకోవచ్చు.

2. బ్లాక్ టీ మరియు మెంతులు:
ఒక కప్పు బ్లాక్ టీలో రెండు టీస్పూన్ల మెంతి పౌడర్ మిక్స్ చేసి, కొద్దిగా పంచదార చేర్చి బాగా మిక్స్ చేసి రోజుకు ఒకసారి తాగాలి. ఇది న్యుమోనియా తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది .

3. తులసి ఆకుల రసం:
గుప్పెడు తులసి ఆకులను తీసుకుని, మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్ తియ్యాలి, అందులో కొద్దిగా బ్లాక్ పెప్పర్ మిక్స్ చేసి ఆరు నుండి 8గంటల సేపు అలాగే ఉండనిచ్చి తర్వాత తీసుకోవడం వల్ల న్యుమోనియాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

4. పుదీనా:
కొన్ని పుదీనా ఆకులు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, తేనె కూడా జోడించి, బాగా మిక్స్ చేసి రెండు, మూడు గంటలకొకసారి తాగుతుండాలి. వ్యాధి తగ్గే వరకు ఇలా చేయొచ్చు.

5. ట్రిఫల మరియు అశ్వగంధ:
ట్రిఫల, అశ్వగంథ, కొద్దిగా అల్లం తురుము మరియు దాల్చిన చెక్క మూడింటిని మిక్సి్ చేసి తీసుకోవడం వల్ల న్యుమోనియాను ట్రీట్ చేయవచ్చు.

6. వెల్లుల్లి పేస్ట్ :
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో వెల్లుల్లి పేస్ట్ గ్రేట్ గా సహాయపడుతుంది, ఇది న్యుమోనియాను కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పేస్ట్ చేసి చెస్ట్ ప్రాంతంలో అప్లై చేయాలి.

7. లవంగాలు మరియు బ్లాక్ పెప్పర్:
5నుండి 6 లవంగాలు, ఒక టీస్పూన్ బ్లాక్ పెప్పర్, 1 గ్రామ్ బేకింగ్ సోడా , ఒక గ్లాసు నీళ్ళలో వేసి నీళ్ళను మరిగించాలి. ఈ డికాషన్ ను రోజుకు రెండు మూడు సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది . న్యుమోనియా నివారించడంలో ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

8. పసుపు:
న్యుమోనియా నివారించడంలో బాగా తెలిసిన ఆయుర్వేదిక్ రెమెడీ ఇది, గోరువెచ్చని గ్లాసు నీటిలో పసుపు మిక్స్ చేసి ఆ నీటిలోముంచిన నీటితో చాతీమీద తుడవాలి, ఇలా చేయడం వల్ల న్యుమోనియాకు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications