Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
Best Snacks For Fatty Liver: ఆకలి తీరాలి, లివర్ సేఫ్ గా ఉండాలా?..అయితే ఈ స్నాక్స్ తినండి!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలి, జంక్ ఫుడ్ తినే అలవాటు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య ఫ్యాటీ లివర్. కాలేయం చుట్టూ విపరీతంగా కొవ్వు పేరుకుపోయే ఈ సమస్యను ఆహార నియమాల ద్వారా మాత్రమే సులభంగా అదుపు చేయవచ్చు. ముఖ్యంగా సాయంత్రం వేళ ఆకలిగా అనిపించినప్పుడు నూనెలో వేయించిన చిరుతిళ్లు తినడం కాలేయానికి చాలా ప్రమాదం. మరి ఆకలి తీరాలి, రుచిగా ఉండాలి, అదే సమయంలో లివర్ కు మేలు జరగాలి అంటే ఏం తినాలి?

ఫ్యాటీ లివర్ ను అదుపులో ఉంచుతూ, మీకు తక్షణ శక్తిని అందించే 7 బెస్ట్ స్నాక్స్ ను ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియోలో తెలిపారు.
నట్స్, సీడ్స్ (గింజలు, విత్తనాలు)
బాదం, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలలో గుడ్ ఫ్యాట్స్ , ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వాల్ నట్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. లివర్ లో వాపును తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. రోజుకో గుప్పెడు గింజలు తినడం వల్ల కాలేయంపై భారం పడదు.
చీజ్ ముక్కలు లేదా పనీర్
చీజ్ అనగానే బరువు పెరుగుతామేమో అన్న భయం వద్దు. మితంగా తీసుకుంటే ఇది మంచి స్నాక్. స్నాక్ టైమ్‌లో చెద్దార్ (Cheddar) చీజ్, మోజారెల్లా లేదా స్వచ్ఛమైన పనీర్ ముక్కలను తీసుకోవడం మంచిది. వీటిలో ప్రోటీన్ తో పాటు ఎముకలకు అవసరమైన క్యాల్షియం అధికంగా లభిస్తుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూ త్వరగా ఆకలి తీరుస్తాయి.
ఉప్పు, మిరియాల పొడి చల్లిన అవకాడో
అవకాడో పండు కాలేయానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో కాలేయం డ్యామేజ్ కాకుండా కాపాడే ఆరోగ్యకరమైన కొవ్వులు అపారంగా ఉంటాయి. ఒక అవకాడోను సగానికి కోసి, అందులోని గుజ్జుపై కాస్త ఉప్పు,పెప్పర్ చల్లుకుని తింటే ఆ రుచే వేరు. ఇది మీ పొట్టను నిండుగా ఉంచుతుంది.

గ్రీక్ యోగర్ట్ లేదా పెరుగు
ఒక కప్పు గ్రీక్ యోగర్ట్ లేదా ఇంట్లో తోడుపెట్టిన తాజా పెరుగులో కొన్ని స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లాంటి పండ్లు లేదా కొద్దిగా నట్స్ కలుపుకుని తినండి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఇది చల్లని, ఎంతో రిఫ్రెషింగ్ స్నాక్.
హుమ్ముస్- కూరగాయల ముక్కలు
కీరదోసకాయ, సెలెరీ లాంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలను పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఉడికించిన శనగలు, ఆలివ్ ఆయిల్ తో చేసే హుమ్ముస్ పేస్ట్ లో నంజుకుని తినాలి. ఈ కాంబినేషన్ లో ఫైబర్, ప్రోటీన్ నిండుగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.
ఉడికించిన గుడ్లు
ఫ్యాటీ లివర్ పేషెంట్లకు ఉడికించిన గుడ్డు ఒక పవర్ హౌస్ లాంటిది. ఇందులో హై క్వాలిటీ ప్రోటీన్, కాలేయానికి అవసరమైన క్వోలిన్ అనే పోషకం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. సాయంత్రం ఒక ఉడికించిన గుడ్డు తింటే, రాత్రి భోజనం వరకు మధ్యలో ఏ ఇతర జంక్ ఫుడ్ తినాలనే కోరిక కలగదు.
ఉడికించిన ఎడామామె
ఎడామామె అంటే లేత సోయాబీన్స్. వీటిని కొద్దిగా ఉప్పు వేసి ఆవిరిపై ఉడికించుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఫైబర్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లు అధికంగా ఉండే ఈ స్నాక్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలోని చెడు కొవ్వును కరిగించడంలో చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
