Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.!
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.?
ఏసీలకు క్రమంగా అలవాటు పడిన వారికి భవిష్యత్తులో ఎముకలు బలహీనపడతాయా.? ఇప్పటికే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారికి ఈ సమస్య మరింత తీవ్రమవుతుందా.? దీనిపై ఆర్థోపెడీషియన్ నిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు.

వేసవి వచ్చిందంటే చాలు ఆ వేడిని తట్టుకోవడానికి ఎయిర్ కండిషనర్లను ఉపయోగించడం సాధారణం అయిపోయింది. ఆఫీసు, ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు ఇలా ఎక్కడైనా సరే వీటి వినియోగం పెరిగిపోయింది. ఎంతలా అంటే కాసేపు ఏసీ ఆఫ్ చేస్తే ఆ వాతావరణం తట్టుకోలేనంతగా మారిపోయింది. అయితే ఏసీలో ఎక్కువ సమయం గడిపితే ఎముకలు బలహీనపడతాయని కొందరిలో సందేహం ఉంది. ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అయితే దీనిపై ఉన్న సందేహాలు నిజమేనా.? ఇక్కడ చూద్దాం..
ఎయిర్ కండిషనింగ్ ద్వారా వచ్చే చల్లదనం నేరుగా ఎముకలను బలహీనపరచదని ఆర్థోపెడిక్స్ నిపుణులు చెబుతున్నారు. ఎముకల బలం అనేది ఎక్కువగా కాల్షియం, విటమిన్ డి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, హార్మోన్ల బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ లోపించినట్లయితే ఎముకలు క్రమంగా పట్టు కోల్పోతాయని హెచ్చరిస్తున్నారు.
నేటి జీవనశైలి కారణంగా వ్యక్తులు ఎక్కువగా ఇంట్లో లేదా ఆఫీసులో గడుపుతున్నారు. ఇక వేసవి వేడి కారణంగా ఉన్న ప్రతి చోటా ఏసీ తప్పనిసరి అయింది. ఈ క్రమంలో బయట తిరిగే అవకాశం తక్కువ. తద్వారా మీపై సూర్యరశ్మి ప్రభావం తక్కువగా పడుతుంది. దీంతో శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి కాదు. ఎముకల బలానికి విటమిన్ డి కీలకం. దీర్ఘకాలికంగా విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడి ఆస్టియోపొరోసిస్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారి విషయంలో ఏసీ ప్రత్యక్షంగా హాని కలిగించదు. కానీ ఎక్కువ సేపు ఏసీ గాలిలో ఉండటం వల్ల ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులకు కీళ్ల నొప్పి, బిగుతు పెరుగుతాయి. ఇంకా అసౌకర్యం తీవ్రం అవుతుంది. ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల కారణంగా కండరాలు బిగుతుగా మారి నొప్పిని కలిగిస్తాయే కానీ.. ఇది వ్యాధి కాదు అని నిపుణులు చెబుతున్నారు.
పరిష్కారాలు
ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి తప్పనిసరి. ఇందుకోసం ప్రతిరోజూ 10 నిమిషాలు ఎండలో గడిపేలా చూసుకోవాలి. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య వచ్చే సూర్యుని కిరణాల ద్వారా శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అయితే మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో ఎండలో ఉండటం ద్వారా చర్మం కమిలిపోయే అవకాశం ఉన్నందున ఆ సమయంలో బయటకు వెళ్లకూడదు.

మీరు తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులు మేలు, స్వచ్ఛమైన నెయ్యి ద్వారా కూడా విటమిన్ డి పొందవచ్చు.
ప్రతిరోజూ వాకింగ్, చిన్నపాటి వ్యాయామాల ద్వారా ఎముకలు పటుత్వంగా ఉంటాయి. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద ఉంచడం మేలు. మరీ తక్కువగా పెట్టుకున్నట్లయితే ఎముకలు బిగుసుకువోవచ్చు. అదేవిధంగా ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోకూడదు. పని మధ్యలో కాసేపు నడవడం, అటూ ఇటూ తిరగడం వంటి వాటి ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
