Latest Updates
-
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే!
ఉద్యోగులు రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. ఈ పది ఆరోగ్య సూత్రాలను పాటించాల్సిందే.!
రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం అంటే సాధారణ విషయం కాదు. శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చోవడం కారణంగా చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. ఇందుకోసం పది ఆరోగ్య సూత్రాలు పాటిీంచాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీరు ఉద్యోగంలో భాగంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నా, ఆఫీసు నుంచి పని చేస్తున్నా.. 8 నుంచి 9 గంటలపాటు పనివేళలు తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలో అదే పనిగా కూర్చుని ఉండకుండా.. పని వాతావరణంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. రోజంతా ఆరోగ్యంగా, చురుకుగా, ఒత్తిడి లేకుండా ఉండటానికి ఈ ఆరోగ్య సూత్రాలు మేలు చేస్తాయి.
ప్రతి గంటకోసారి విరామం
మీరు డెస్క్‌లో కూర్చుని పనిచేస్తున్నప్పుడు ప్రతి 45 నిమిషాలు లేదా గంటకోసారి తప్పకుండా మీ సీటులోంచి లేచి ఉండటం తప్పనిసరి. 10 నిమిషాల పాటు నడక, లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. దీని ద్వారా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. తద్వారా నడుము నొప్పి, మెడ పట్టేయడం, ఊబకాయం రాకుండా కాపాడుకోవచ్చు.

సరైన మోతాదులో నీరు
ఆఫీసు పనిలో ఉన్నప్పుడు చాలా మందికి తిండి, నిద్రపై సరిగా ధ్యాస ఉండదు. భోజనం కూడా ఒక్కోసారి ఆలస్యమవుతుంది. కానీ నీరు తాగడం మాత్రం తప్పనిసరి. దీని వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా రోజుకు 3 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగై అలసటకి గురికాకుండా ఉంటారు.
హెల్తీ స్నాక్స్
కొంతమంది పని మధ్యలో ఆకలిగా అనిపించినప్పుడు స్నాక్స్‌లో భాగంగా జంక్ ఫుడ్‌కి ప్రాధాన్యత ఇస్తారు. తీపి ఎక్కువగా ఉండే చిరు తిళ్లు, చిప్స్, బిస్కెట్లను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇలా తినడం ఊబకాయానికి దారితీస్తుంది. దీని బదులుగా తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, వేయించిన శనగలు, మఖానా వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలి. దీని ద్వారా త్వరగా కడుపు నిండిన అనుభూతి కలిగి ఎక్కువ తినకుండా ఉంటారు.
స్క్రీన్ టైం..
ఎక్కువ సేపు కంప్యూటర్ స్కీన్ చూస్తూ పనిచేయడం ద్వారా కంటి నొప్పి, కళ్లలో మంట, చికాకు, కళ్ల అలసట కలుగుతుంది. అందుకే ప్రతి 20 నిమిషాలకోసారి మీకు కొంచెం దూరంలో ఉన్న వస్తువులను 20 సెకన్ల పాటు చూడటం ద్వారా కళ్లపై ఒత్తిడి తగ్గి విశ్రాంతి కలుగుతుంది.

కూర్చునే పొజిషన్
మీరు ఆఫీసు ఛైర్‌లో కూర్చునేటప్పుడు సరైన భంగిమలో కూర్చోవడం చాలా ముఖ్యం. కుర్చీలో మీ వీపు నిటారుగా ఆనించి స్థిరంగా కూర్చోవాలి. మానిటర్‌ను మీ కంటి స్థాయికి సమానంగా ఉంచుకోవాలి. సరైన భంగిమలో కూర్చోకపోతే వీపు, మెడ, భుజాల నొప్పితో బాధపడటం తప్పదు.
వ్యాయామం
ఎంత పని ఒత్తిడి ఉన్నా.. రోజు కనీసం అరగటం పాటు వాకింగ్, యోగా, స్ట్రెచింగ్, తేలికపాటి వ్యాయామం చేయడం తప్పనిసరి. దీని ద్వారా శారీరక శ్రమ పెరుగుతుంది. ఫలితంగా మీ బరువు అదుపులో ఉంటుంది. కండరాలు బలోపేతం అవుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
తగినంత నిద్ర
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతిరోజూ తప్పనిసరిగా 8 గంటల పాటు తగినంత నిద్ర అవసరం. తద్వారా శరీరం రిలాక్స్ అవుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. దీంతో మరుసటి రోజూ కూడా యాక్టివ్‌గా ఉండగలరు. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి, అలసట ఏర్పడుతుంది.
స్ట్రెస్ కంట్రోల్
ఆఫీస్ వర్క్, ప్రాజెక్ట్ డెడ్ లైన్ కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా అవసరం. లేదంటే మానసిక సమస్యలు ఏర్పడుతాయి. మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్, ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఒత్తిడి అదుపులో ఉంటుంది. పనిలో ఏకాగ్రత పెరుగుతుంది.
సరైన భోజన వేళలు
ఆఫీసు వేళల్లో ఒత్తిడి కారణంగా బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ ఆలస్యం చేస్తుంటారు. దీనివల్ల శరీరానికి తగిన పోషకాలు సరైన సమయంలో అందక ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. అందుకే రోజూ మూడు పూటలు సరైన సమయంలో భోజనం చేయడం తప్పనిసరి. దీనివల్ల శక్తి అంది, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
హెల్త్ టెస్టులు
చాలా కాలంగా ఉద్యోగంలో ఉంటున్నట్లయితే మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. క్రమం తప్పకుండా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్ టెస్ట్, కొలెస్ట్రాల్‌తో పాటు ఇతర ముఖ్యమైన పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా వ్యాధి నిర్ధారణ సులభమవుతుంది. చికిత్స సులభతరం కావడంతో పాటు తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
