హిట్లర్ నే వణికించిన వ్యాధి..ఏకంగా రెండు నెలలు నిద్రావస్తలో.. ఇప్పటికీ ఇది రహస్యమే

అన్నింటికంటే, ఎక్కువసేపు నిద్రపోవాలని ఎవరు కోరుకోరు? ఈ బిజీ లైఫ్ స్టైల్ లో మంచి నిద్ర చాలా మందికి కలగా మారింది. ఫిట్ నెస్ మొదలకుని ఆహారం మరియు వ్యాయామం వరకు వాటి ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఆరోగ్యకరమైన జీవనశైలో ప్రతి ఒక్కటీ ముఖ్యమే. అందుకే ఆహారంతో పాటు, నిద్రకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. అయితే మోడ్రన్ యుగంలో గాడ్జెట్ల పుణ్యమా అని వాటి వాడకం వల్ల అస్సలు ఎన్నింటికి పడుకుంటున్నారో వారికే తెలియదు. ఒకసారి మొబైల్ స్క్రీన్ మీద టచ్ చేస్తే చాలు, రాత్రి పన్నెండు అయినా , ఒంటి గంట అయినా టైం తెలియదు. చాలా మందికి మినిమం ఏడు ఎనిమిది గంటల నిద్ర ఉండదు. నిద్రను అంతగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రస్తుతకాంలో ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం తగినంత నిద్ర పొందకపోతే ఆ రోజంతా నీరసం అలసట, చిరాకు ఏపని చేయాలనిపించదు. ఇది దినచర్యలో పనులకు చాలా ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి రోజులో నిద్ర చాలా ముఖ్యం అని గుర్తించుకోవాలి.

మంచి నిద్ర శారీరకంగా మానసికంగా ఆహ్లాదాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ముఖంలో సంతోషంతో పాటు అందం కనబడుతుంది. ఆ రోజు పనులను చక్కగా నిర్వర్తించగలుగుతారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వింత జబ్బు వచ్చింది. ఇది ఒక అంటువ్యాధి లాంటిది. ఈ వింత వ్యాధి బారీన పడిన వారు నెలల తరబడి నిద్రపోతారు.

Epidemic of Sleepy

స్లీపీ సిక్‌నెస్" లేదా ఎన్‌సెఫాలిటిస్ లెథార్జికా ఇది కరోనా కంటే భయంకరమైనది. కరోనా మహమ్మారి వల్ల కలిగే వినాశనాన్ని మనం కల్లారా చూశాము. కానీ అలాంటి వ్యాదే వంద సంవత్సరాల క్రితం వచ్చిన విషయం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వ్యాధికి ప్రభావితమైన వ్యక్తులు కుంభకర్ణుడిలా మారిపోతారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రజలు నెలల తరబడి నిద్రావస్తలో ఉంటారు. దీనికి కారణం రోజంతా కష్టపడి పనిచేయడం వల్ల కాదు. ఇది స్లీపి సిక్ నెస్ అనే వ్యాధి.

ఈ వ్యాధి బారిన పడినవారు కొన్ని వారాలు లేదా నెలల పాటు నిద్రపోతారు. ఇలా నిద్రపోవడం వల్ల ప్రాణాలకు చాలా ప్రమాదకరం. నివేదికల ప్రకారం ఈ వింత వ్యాధి స్లీప్ సిక్నెస్ బారీన పడిన వారిలో దాదాపు 40 శాతం మంది మరిణించారు. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారిలో శ్వాసకోశ పాడవ్వడం వల్ల ఇలా జరుగుతుందని వెల్లడించారు.

Epidemic of Sleepy Sickness

ఈ భయంకరమైన మహమ్మారి 1916లో మొదటి ఉత్తర ఫ్రాన్స్ లో పుట్టింది. దాని తర్వాత ఇది ప్రపంచప్యాప్తంగా విస్తరించింది . ఫ్రాన్స్ టు ఐరాపా, ఉత్తర దక్షణ అమెరికాలు తాకింది. ఈ వ్యాధి భారత దేశాన్ని కూడా ప్రభావితం చేసింది. అయితే ఈ వ్యాధి 1930నాటికి పూర్తిగా నాశనం అయింది. అయితే ఈ వ్యాధి ఎలా పుట్టుకొచ్చింది?ఎలా వ్యాపిస్తుంది, దీనికి కారణం ఏంటి, ఇది మళ్లీ తిరిగి వస్తుందా అన్న విషయాలు ఇప్పటికి రహస్యంగానే మిగిలిపోయాయి.

ఈ వ్యాది లక్షణాలు సాధారణంగా కనిపించినప్పుటికి ఇది అనారోగ్యానికి గురైన వారిలో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎన్సెఫాలిటిస్ లెథార్జికా అనే ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులో ఇది కనుగొనబడినది. వారిలో తలనొప్పి, కీళ్ళనొప్పులు, వికారం, జ్వరం వంటి కొన్ని ఫ్లూ లక్షణాలను గుర్తించారు. వీటితో పాటు కళ్ళ సమస్యలను గురించారు. ఇందులో బాగంగా వ్యాధికి గురైన వారు వారి కనుబొమ్మలు బరువెక్కినట్లు భావన కలుగుతుంది. దాంతో వారు పగలు , రాత్రి అనేదాంతో సంబంధం లేకుండా నిద్రపోతారు.

Epidemic of Sleepy Sickness

ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో తెలియదు
ఈ వ్యాధి బారిన పడిన ప్రజలు నిద్రను కంట్రోల్ చేసుకోలేకపోయే వారని నివేధికలు సూచిస్తున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలోప్రత్యక్షంగా ఎలాంటి లక్షణాలు కనబడకపోయినా వ్యాధి సోకిన రెండు మూడు నెలల తర్వాత వారిలో పరోక్షంగా ఇతర దుష్ప్రభావాలను గుర్తించడం జరిగింది. వారు తేలిక పాటు నొప్పులు అనుభవించే వారు. మరికొందరి పార్షిక లేదా పూర్తి పక్షవాతానికి గురయ్యేవారని నివేధికలు వెల్లడించాయి.

అప్పట్లో ఈ వ్యాధి బారిన పడిన వారు సుమారు యాభై రెండు వేల నుండి పది లక్షలవరకు ఉండేది. అయితే ఈ వింత వ్యాధికి కారణాలను మాత్రం వైద్యులు ఇప్పుటి వరకు కనిపెట్టలేకపోయారు. అప్పట్లో హిట్లర్ కూడా ఈ వ్యాధితో బాధపడ్డానికి ప్రచురించిన కథనాలు బయటపడ్డాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion