Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్‌లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
ఎండాకాలంలో ఈ పళ్లను ఖచ్ఛితంగా తినాల్సిందే..!
పళ్లు శరీరానికి మంచిది మాత్రమే కాదు. పళ్లల్లో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లుంటాయ్. అందులో ఉండే వైటమిన్లు, మినరల్స్ కూరగాయల్లో కన్నా ఎక్కువ మొతాదులో ఉంటుంది. అందుకే ప్రతీ రోజు ఏదైనా ఓ పండు తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. తినగానే వెంటనే శక్తిని కూడా అందిస్తాయ్. పళ్లంటే ఓ ఇన్స్‌టాంట్ ఎనర్జీ. ఈ ఎండా కాలంలో బయట ఎండ వల్ల శరీరంలో త్వరగా అలసటకు గురౌతుంది. కొన్ని నిమిషాల్లోనే డీహైడ్రేట్ అయిపోతాము.

ప్రతీ రోజు నీళ్లు తాగడమే కాదు ఈ ఎండాకాలంలో రోజుకో పండు తినాల్సిందే అప్పుడే శరీరానికి అవసరమైనంత యాంటీయాక్సిడెంట్లు అందుతాయ్. అప్పుడే బయట వేడిని శరీరం తట్టుకొని నిలబడగలుగుతుంది. గుండె ఆరోగ్యవంతంగా ఉండడానికి, మధుమేహం, రక్తపోటుకు దూరంగా ఉండడానికి కూడా ఈ పళ్లు బాగా ఉపయోగపడతాయ్. ఈ మండే వేసవిలో మనకు అందుబాటులో ఉన్న..తప్పక తినాల్సిన పళ్ల గురించి తెలుసుకుందాం.
మామిడి పళ్లు
ఎండాకాలం అంటేనే మామిడి పళ్లు, మామిడి అంటేనే ఎండా కాలం. ఎండాకాలం వచ్చేసిందా అని ఇబ్బంది పడేవారికి ఈ మామిడి పళ్లే పెద్ద ఊరటను కలిగిస్తాయ్. ఈ ఎండాకాలంలో మామిడి పండు రారాజుగా కొనసాగుతుంది. మామిడి కాయలతో ఉగాది పచ్చడిని రుచికరంగా చేసుకుంటారు. ఇంట్లో చట్నీలను కూడా పుల్లటి మామిడి కాయలతో తయారు చేస్తారు. ఇక బంగినపల్లి, ఆల్ఫాన్సో, రసాలు లాంటి మామిడి పళ్ల తియ్యటి జ్యుస్‌లని నోరారా ఆరగిస్తారు. మామిడిలో ఫైబర్, వైటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయ్.
వాటర్ మిలన్
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే మరో పండు పుచ్చపండు. దీనినే ఆంగ్లంలో వాటర్ మిలన్ అంటాము. వాటర్ మిలన్ తింటే అప్పటికప్పుడే ఇన్స్‌ట్యాంట్ ఎనర్జీ వస్తుంది. ఈ పండులో వేడిని దెబ్బతీసే నీరు, చల్లదనం పుష్కలంగా ఉంటుంది. ఒక పెద్ద పుచ్చుపండును ఒక్కరే భోజనం చేసినట్టుగా తింటే ఆ హాయ్, ఎండలో కలిగి చల్లదనం మాటల్లో వర్ణించలేనిది.
బత్తాయ్
ఎండలో వడదెబ్బ తగలకుండా శరీరానికి అవసరమైన పోషకాలు, నీళ్లు అందించే మరో పండే బత్తాయ్. ఇందులో ఎలక్ట్రోలైట్లు, వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇక రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూల్‌డ్రింక్స్ కూడా ఇవ్వని ఊరటని చల్లదనాన్ని ఈ బత్తాయ్‌లు అందిస్తాయ్. ఎండాాకాలంలో క్రమం తప్పకుండా తినాల్సిన మరో పండు బత్తాయ్.
మస్క్ మిలన్
ఎండాకాలంలో రుచికరంగా ఆరగించే కలిగే మరో పండు మస్క్ మిలన్. ఇందులో కూడా వైటమిన్ సితో పాటు వైటమిన్ ఎ, వైటమిన్ బి కాంప్లెక్స్ ఫైబర్, ఎలక్టోరైట్లు,క్యారటోనైడ్స్ పుష్కలంగా ఉంటాయ్.
ఖీరదోసకాయ
ఇక ఖీర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని కాలాల్లో అందుబాటులో ఉండి శరీరాన్ని చల్లగా ఉంచే పండు ఖీర. ఇందులో నీరు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతీ రోజు తింటే డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉండదు. జీర్ణక్రియను బాగుపరచడమే కాకుండా హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది.
వీటితో పాటు పపాయ, పైనాపిల్, బిర్రీస్ లాంటి పళ్లల్లో కూడా డీహైడ్రేట్‌ను దూరం చేసే పోషకాలుంటాయ్. కూల్‌డ్రింక్స్, రస్నా, సోడా లాంటి వాటికి దూరంగా ఉండి ఈ పళ్ల రసాలను తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. లేదంటే బయటి పానియాలు తాగి రోగాలను కొని తెచ్చుకున్నవారమౌతాము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications