Latest Updates
-
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే!
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అధిక బరువు. ముఖ్యంగా మహిళలు గర్భధారణ తర్వాత లేదా హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వదిలించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎక్సర్ సైజ్ లు ఎన్ని చేసినా సరైన ఆహారం తీసుకోకపోతే ఆశించిన ఫలితం ఉండదు.
అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గానే కొవ్వును ఎలా కరిగించుకోవచ్చో వైజాగ్ లోని ప్రముఖ ఆడమ్స్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ అద్భుతమైన చిట్కాలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. మన కిచెన్ లో దొరికే ఈ 8 రకాల బెస్ట్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకుంటే కొవ్వు ఇట్టే కరిగిపోతుందని ఆమె సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూడండి.

గ్రీన్ టీ
బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ ఒక సంజీవని లాంటిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని మెటబాలిజం రేటును మెరుగుపరుస్తాయి. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే వేగం అమాంతం పెరుగుతుంది.
జీరా వాటర్
వంటింట్లో ఉండే జీలకర్ర బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. జీలకర్రలో థైమాల్ అనే ప్రత్యేకమైన సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మొండి కొవ్వును అత్యంత వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది.
గుడ్లు
గుడ్డు ఆరోగ్యానికి మాత్రమే కాదు కొవ్వును తగ్గించడానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. ఎగ్స్ లో కోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఈ కోలిన్ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును త్వరగా విచ్ఛిన్నం చేసి, త్వరగా బరువు తగ్గడానికి అద్భుతంగా సాయపడుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లి కేవలం వంటలకు రుచిని ఇవ్వడమే కాదు, కొవ్వును కరిగించే ఆయుధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే అల్లిసిన్ అనే పదార్థం కొవ్వు కరిగించే ప్రక్రియను ఎన్నో రెట్లు వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే వెల్లుల్లి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మునగాకు
మునగాకులో పోషకాలు పచ్చని బంగారం లాంటివి. ఇది కేవలం బలాన్ని ఇవ్వడమే కాకుండా శరీరంలో కొత్త కొవ్వు కణాలను ఏర్పడకుండా అడ్డుకోవడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కర్రీలో మునగాకును తరచుగా వాడటం వల్ల స్లిమ్ ఫిగర్ మీ సొంతం అవుతుంది.
చియా సీడ్స్, అవిసె గింజలు
ఈ గింజలలో ఫైబర్ (పీచు పదార్థం), అలాగే గుండెకు మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును త్వరగా కరిగించడమే కాకుండా, ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.
పెరుగు, మజ్జిగ
పెరుగు, మజ్జిగలో గట్ హెల్త్ ను కాపాడే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. శరీరంలో కొవ్వు కరగాలన్నా, జీర్ణక్రియ సజావుగా సాగాలన్నా ఈ ప్రోబయోటిక్స్ చాలా అవసరం. భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
చిలకడదుంప
తియ్యగా ఉందని దీన్ని దూరం పెట్టకండి. చిలకడదుంపను తిన్నప్పుడు అది రక్తంలోకి గ్లూకోజ్ను (షుగర్) ఒకేసారి కాకుండా చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉండటం వల్ల కొవ్వు కరగడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications

