Latest Updates
-
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం!
బెడ్ టీ లేదా కాఫీ తాగుతున్నారా.. ఆరోగ్యానికి కీడు చేసే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.!
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే మంచం దిగకముందే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇది వారికి ఒక దినచర్యగా మారిపోయింది. అలా అయితేనే వాళ్లకి డే స్టార్ట్ కాదని ఫీలవుతుంటారు. లేదంటే రోజంతా అసౌకర్యానికి గురవుతారు. తాజాదనం కోసం, శక్తి కోసం ఈ అలవాటుకి బానిస అవుతుంటారు. కానీ దీని వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..

బ్రష్ చేయకుండా పరగడుపునే టీ లేదా కాఫీ తాగడం ద్వారా జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది. పడుకునే ముందు అయినా.. ఉదయం నిద్ర లేవగానే అయినా సరే ఈ పానీయాలు హాని చేస్తాయని అంటున్నారు. వీటిని తాగడానికి రోజులో సరైన సమయం, సందర్భం ఉంటుందని చెబుతున్నారు.
ఎసిడిటీ, గ్యాస్ట్రిక్
టీ, కాఫీల్లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని రోజులో మితంగానే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక, ఉదయం బెడ్ టీ లేదా కాఫీ తాగడం ద్వారా కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. కెఫీన్ ఎసిడిటీకి దారితీస్తుంది. ఫలితంగా గుండెల్లో మంట, పుల్లటి త్రేన్పులు రావడం, కడుపులో భారంగా ఉండటం, గ్యాస్ సమస్యలు వంటివి తలెత్తవచ్చు. అయితే ఇప్పటికే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ అలవాటు మరింత దుష్ప్రభావం చూపిస్తుంది.
జీర్ణవ్యవస్థపై ఎఫెక్ట్
టీలో కెఫీన్‌తో పాటు టానిన్ వంటి మూలకాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. ఫలితంగా కడుపులో మంట, అజీర్తి, గ్యాస్ సమస్యలతో అసౌకర్యంగా ఉంటుంది. జీర్ణక్రియ సున్నితంగా ఉండే వారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
పోషకాలపై ప్రభావం
శరీరంలో మెరుగైన జీవక్రియకు పోషకాలు సమతుల్యంగా ఉండాలి. బెడ్ టీ లేదా కాఫీ ద్వారా మనం తీసుకునే పోషకాహారాన్ని శరీరం సమర్థవంతంగా గ్రహించలేదు. ముఖ్యంగా ఐరన్‌ను సరిగా గ్రహించలేదు. దీంతో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఎక్కువగా టీ లేదా కాఫీ తాగేవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే పరగడుపునే కాదు భోజనం చేసిన వెంటనే కూడా వీటిని తాగడం మానుకోవాలి.

నోటి ఆరోగ్యం
బ్రష్ చేయకుండానే, నోటిని శుభ్రపరచుకోకుండానే టీ, కాఫీ తాగడం నోటి ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. మందు రోజు రాత్రి తిన్న భోజనం ద్వారా పళ్లలో, నాలుకపై బ్యాక్టీరియా పేరుకుపోతుంది. మీరు బెడ్ టీ తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా కడుపు లోపలికి వెళ్లిపోతుంది. దీంతో పాటు టీలోని మూలకాలు పళ్లపై చేరి మరకలు, పసుపు దనానికి దారితీస్తాయి. దీంతో దుర్వాసన సమస్య ఎక్కువవుతుంది.
ఏ సమయంలో తాగాలి..
మెరుగైన జీవక్రియతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో సరైన సమయంలో టీ, కాఫీని తీసుకోవాలి. నిద్ర లేచిన వెంటనే ముందుగా ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగాలి. కాలకృత్యాలు తీర్చుకుని బ్రష్ చేసుకున్న తర్వాత వెంటనే టీ తాగకూడదు. ముందుగా అల్పాహారం తీసుకున్న కాసేపటి తర్వాత టీ లేదా కాఫీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే టీలో చక్కెరను వీలైనంత తక్కువగా వేసుకోవాలి. పరిమితంగా తీసుకోవాలని.. ఒకవేళ మీరు గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
