Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
అరటి ఆకుల్లో భోజనం.. ప్రయోజనాలు తెలిస్తే ప్లాస్టిక్ ప్లేట్ల జోలికే వెళ్లరు.!
ఒకప్పుడు ఇంట్లో అయినా, బయట అయినా భోజనం అంటే అరటి ఆకుల్లోనే చేసేవారు. ప్రకృతి అందించిన ఈ అమూల్యమైన అరటి ఆకుల్లో భోజనం చేస్తే అదనంగా పోషకాలు సైతం అందుతాయి. కాలక్రమేణా వాటి స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చాయి. ఫలితంగా రోగాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మళ్లీ దక్షిణ భారతదేశంలో సాంప్రదాయ భోజన విధానం ఊపిరి పోసుకుంది. హోటళ్లు, ఆలయాలు, విందుల్లో అరటి ఆకులు ప్రత్యేకంగా దర్శనమిస్తున్నాయి. వీటిలో తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని సైంటిఫికల్‌గా నిర్ధారణ అయింది. అవేంటో చూద్దాం..

అరటి ఆకు నిండుగా వడ్డన
నేతి బొట్టుతో మొదలుకొని పచ్చళ్లు, వివిధ రకాల కూరలు, అన్నం, అప్పడాలు, స్వీట్లు, మజ్జిగతో అరటి ఆకు నిండుగా వడ్డిస్తే తినే వాళ్ల కడుపు సంతృప్తి చెందడమే కాదు.. ఆ పెట్టిన చేతికి ఎంతో సంతోషం కలుగుతుంది. అందుకే భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగాను విస్తృతమవుతోంది. గతకొంతకాలంగా మనం మరిచిన ఆ సాంప్రదాయ వడ్డన విధానం మళ్లీ మన గడప తొక్కి మన ఆరోగ్యానికి కాపు కాస్తోంది.
సాధారణంగా పెళ్లిల్లు, ఫంక్షన్లలో బఫె సిస్టమ్ తీసుకొచ్చాక.. నిలబడి అరటి ఆకుల్లో భోజనం చేసే సదుపాయం లేక ప్లాస్టిక్ ప్లేట్లతో వడిస్తున్నారు. ఇందులో వేడివేడి ఆహారాన్ని వడ్డించాక ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి మన శరీరంలోకి చేరుతుంది. తద్వారా జీర్ణక్రియపై ప్రభావం చూపి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్లాస్టిక్ ప్లేట్లను పడేసిన తర్వాత కరిగిపోవడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుందని సైంటిస్టులు చెబుతూనే ఉన్నారు. ఇంకా రోడ్డుపై జంతువులు వాటిని తిని చనిపోయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కానీ అరటి ఆకుల్లో భోజనం చేయడం ద్వారా ఇలాంటి సమస్యలు రావు.

ప్రకృతి సిద్ధమైన పోషకాలు
అరటి ఆకుల్లో భోజనం పర్యావరణ హితమే కాదు, ఆరోగ్యం, సంస్కృతి పరంగానూ ఎంతో విశిష్టతను కలిగి ఉంది. వేడివేడి ఆహారాన్ని అరటి పత్రంపై వడ్డించినప్పుడు ఆ ఆకుల్లో ఉండే పాలీఫెనాల్స్ వంటి సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఆహారంలోకి చేరుతాయి. ఆ భోజనాన్ని మనం స్వీకరించినప్పుడు జీర్ణ వ్యవస్థ మెరుగై జీర్ణ వ్యవస్థ సాఫీగా జరిగేలా చేస్తుంది.
అంతే కాకుండా అరటి ఆకుల్లో భోజనం చేయడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఈ ఆకుల ద్వారా అందులో వడ్డించిన ఆహారానికి సహజ సువాసన అధికమవుతుంది. రుచి కూడా మరింతగా ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు సహజసిద్ధంగా అందడం వల్ల జీవక్రియకు దోహదపడుతుంది.
భూమి సారవంతం
అరటి ఆకుల్లో భోజనం చేసిన అనంతరం వాటిని మడిచి పడేసిన తర్వాత అవి భూమిలోకి చేరి త్వరగా కలిసిపోతాయి. తద్వారా నేల తల్లికి సహజంగా సేంద్రీయ ఎరువులు లభించి భూమి సారవంతమవుతుంది. అందుకే రైతులు వాడి పడేసిన అరటి ఆకులను సేంద్రీయ ఎరువుల కోసం ఉపయోగించడం ద్వారా రసాయనాలు లేని పంటలను పొందవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రసాయనాలతో కూడిన ఎరువులను వాడటం ద్వారా నేల సారవంతం కోల్పోయి తదుపరి పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అరటి ఆకులతో రైతులకూ ఎంతో ప్రయోజనం ఉందని శాస్త్రీయంగా నిరూపితమైంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
