Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
ఇంట్లో కూరగాయలు లేవా? 2 ఉల్లిపాయలతో సూపర్ టేస్టీ పరాఠాలు..బ్రేక్ ఫాస్ట్, లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలి, మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి ఏం వండాలి, రాత్రికి డిన్నర్ లో తేలికగా ఏం తినాలి అనేది ప్రతి ఇంటా ఎదురయ్యే పెద్ద ప్రశ్న. సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు పెద్దగా లేనప్పుడు కేవలం ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో అద్భుతమైన వంటకాలు చేయవచ్చు. అందులో ఒకటే ఈ ఉల్లిపాయ పరాఠా.

కేవలం రెండు ఉల్లిపాయలు, కొద్దిగా గోధుమ పిండి ఉంటే చాలు, కడుపు నిండా తినగలిగే అత్యంత రుచికరమైన, మెత్తని పరాటాలను తయారు చేసుకోవచ్చు. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే రోజంతా కావాల్సిన శక్తి వస్తుంది. లంచ్ బాక్స్‌లోకి తీసుకెళితే మధ్యాహ్నం వరకు కూడా అంతే మెత్తగా, తాజాగా ఉంటాయి. ఇక రాత్రి పూట డిన్నర్‌కి అయితే ఏదైనా రైతా లేదా పచ్చడితో తింటే కడుపుకి చాలా హాయిగా ఉంటుంది.
ఉల్లిపాయ పరోఠా తయారీకి కావాల్సిన పదార్థాలు
-గోధుమ పిండి
-ఉల్లిపాయలు
-కొత్తిమీర
-జీలకర్ర పొడి
-ధనియాల పొడి
-కారం
-గరం మసాలా
-ఉప్పు
-నూనె లేదా నెయ్యి
-కసూరి మేతి
-ఆమ్చూర్ పొడి
-పుట్నాల పప్పు
-నల్ల నువ్వులు

ఉల్లిపాయ పరోఠా తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు గోధుమపిండి వేసి, ఇందులోనే 1 స్పూన్ నూనె కూడా వేసి, కోంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్ గా ఉండేలా కలుపుకోవాలి.
-పిండి ఆరిపోకుండా..కలుపుకున్న పిండిపై అర టీస్పూన్ నూనె వేసి పిండి అంతా పట్టించండి. ఈ పిండిని 15 నిమిషాల పాటు నాననివ్వాలి.మూతపెట్టి పక్కన పెట్టేయండి.
-ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ఇందుకోసం 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో అర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ జీలకర్ర పొడి, పావు టీస్పూన్ లో సగం గరం మసాలా పొడి, అర టీస్పూన్ ఆమ్చూర్ పొడి(లేకుంటే 1 టీస్పూన్ నిమ్మరసం), అర టీస్పూన్ కారం, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి ఉల్లిపాయలు గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో 1 కప్పు పుట్టాల పప్పు(తినే శెనగపప్పు)వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఈ పొడిని ఉల్లిపాయ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. స్టఫింగ్ రెడీ అయింది.
-ఇప్పుడు పావు గంట సేపు పక్కన పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెం పిండిని చేతుల్లోకి తీసుకుంటూ పగుళ్లు లేకుండా చేతులతో రోల్ చేసుకొని తర్వాత దాన్ని గుంటలా(చిన్న బౌల్ లా) చేసి అందులో రెడీ చేసుకున్న స్టఫింగ్ ను పెట్టాలి. స్టఫింగ్ ను కొంచెం లోపలికి తోస్తూ పిండిని పైకి తీసుకొస్తూ దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిమీద కొంచెం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ పరాఠాలాగా వత్తుకోవాలి. వీటిని చేతులతో అయినా వత్తుకోవచ్చు. వత్తుకునేటప్పుడు కొన్ని నల్ల నువ్వులు, కొంచెం కొత్తిమీర కూడా దానిమీద చల్లుకొని వత్తుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి వీటిని కాల్చుకోవాలి. మంటను మీడియంలో ఉంచి పరాఠాలను కాల్చుకోవాలి.కాల్చుకునే సమయంలో వీటిమీద నెయ్యి లేదా నూనె లేదా వెన్న అయినా వేసుకోవచ్చు. అంతే ఉల్లి పరాఠాలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
