Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
స్త్రీలలో గుండె పోటు రాకుండా ముందు జాగ్రత్తలు
సాధారణంగా స్త్రీలలో గుండెపోటు లక్షణాలు పురుషులలో మాదిరిగా గుండెపో తెలిసే విధంగా ఉండక పోవడం వల్ల గుర్తించడం కష్టం. అదీ కాక మహిళలు సాధారణంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఉన్నంత బాధ్యతగా తమ ఆరోగ్యం పట్ల ఉండకపోవడం వల్ల కూడా కొంత అశ్రద్ధ చేస్తారు. అందువల్ల సమస్య తీవ్రమయ్యే వరకు చికిత్సకు కానీ పరీక్షలకు కానీ వెళ్లరు. నిజానికి మహిళల రక్తనాళాలు పురుషులకంటే సన్నగా ఉంటాయి. అందువల్ల ఆంజియోప్లాస్టీ, బైపాస్ వంటి చికిత్సలు స్త్రీలతో పోల్చినపుడు మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మహిళల గుండె ఆరోగ్యానికి సంబంధించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
స్త్రీలలో గుండె నొప్పిని ఇలా గుర్తించొచ్చు.. మాములుగా గుండెపోటు అంటే ఛాతిలో నొప్పి ఉంటుందని అనుకుంటారు. నిజానికి గుండెపోటు వచ్చినపుడు వచ్చే నొప్పి ఛాతి మధ్యలో పట్టేసినట్టు అనిపిస్తూ నొప్పి క్రమంగా మెడ, భుజం, దవడ వరకు పాకుతుంది. అంతేకాదు విపరీతంగా చెమటలు రావడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు మనం పురుషులకు గుండెపోటు వచ్చినపుడు చూస్తుంటాం. అయితే స్త్రీలలో గుండె పోటు వచ్చినపుడు 50 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కానీ కొందరిలో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు. ఎక్కువ నీరసంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అజీర్తిగా ఉండడం, పొట్ట పై భాగంలో అసౌకర్యంగా ఉండడం, దవడ నొప్పి, గొంతు నొప్పి, భుజం నొప్పి వంటివి ఉంటాయి. ఎటువంటి ఛాతినొప్పి ఉండకపోవచ్చు కూడా. అందువల్ల చాలా మంది దీన్నీ అశ్రద్ధ చేస్తారు. ఇది గుండెపోటు కాదని అనుకుంటారు. మామూలుగా గుండెపోటులో ఉండే లక్షణాలు కనిపించక పోవడం వల్ల మహిళల్లో గుండె సమస్యలు గుర్తించడంలోనే జాప్యం జరుగుతోంది.

నివారణ: సమస్య వచ్చిన తర్వాత ఏ చికిత్స మంచిదని ఆలోచించే కంటే సమస్య రాకుండా నివారించడం చాలా మంచిది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రతి ఒక్కరు తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. రోజు 30 నిమిషాల వాకింగ్ లేదా జాగింగ్ వారంలో కనీసం 5 రోజులైనా చెయ్యాలి. శరీర బరువును క్రమబద్ధం చేసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలు, పండ్లు తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తినకూడదు. నెలకు ఒకరికి అర లీటరుకు మించి నూనె వాడకూడదు. గుండె పోటుకు ఆస్కారం ఉన్న కుటుంబంలోని వారు తరచుగా పరీక్షలు చేయించుకోవడం, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌లను అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి.
పరీక్షలు: పరీక్షలు రెండు రకాలు. ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ చేయించుకునే పరీక్షలు. వీలైనంత తొందరగా గుండెలో సమస్యలను గుర్తిస్తే గుండెపోటును నివారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండె పోటు రావడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని గుర్తించే పరీక్షలు ఉదాహరణకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌లు అదుపులో ఉన్నాయా లేదా తెలుసుకునే పరీక్షలు.
భర్తకో.. పిల్లలకో చిన్న జలుబు చేసినా హడావుడి పడిపోయే మహిళలు తమ గుండెకు చిల్లు పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడుతుంటారు. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకూ పనిచేసి అలసిన వాళ్లు వ్యాయామానికి టైం లేదంటారు... కానీ...తమ ఆరోగ్యాన్ని కాపాడు కుంటేనే కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోగలమన్నది మరిచిపోతారు. అలాంటి మహిళల గుండెను పట్టించుకోవాల్సిన బాధ్యత కుటుంబానిదే..
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications