Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.!
వర్షాకాలంలో గాలిలో తేమ గణనీయంగా పెరుగుతుంది. అయితే గాలిలో అధిక తేమ కారణంగా శరీరమంతా డీహైడ్రేషన్‌కి గురై జిగటగా, అలసటగా, అలసటగా అనిపిస్తుంటుంది. దీంతో పాటు రక్త పోటుపై ప్రభావం కూడా చూపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. గాలిలో హ్యుమిడిటీ కారణంగా బీపీ లెవెల్స్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి అందుకు కారమాలేంటి.. ఇక్కడ చూద్దాం..

వాతావరణ మార్పులను బట్టి శరీర ఉష్ణోగ్రత సైతం గణనీయంగా మారుతుంది. ఫలితంగా గుండె పనితీరుతో పాటు, రక్త ప్రసరణపై నేరుగా ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రధానంగా హై బీపీ, లో బీపీతో ఇప్పటికే బాధపడుతున్న వారు.. అధిక తేమతో కూడిన వాతావరణంలో మరింత జాగ్రత్త వహించాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చూపిస్తున్నారు. అసలు అధిక తేమకి, రక్తపోటుకి సంబంధమేంటి, ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. తెలుసుకుందాం..
అధిక తేమ- రక్తపోటు
గాలిలో తేమ ఎక్కువైతే శరీరానికి చెమట ఎక్కువగా పడుతుంది. ఈ కారణంగా శరీరం త్వరగా చల్లబడదు. చెమట త్వరగా ఆరిపోతే శరీరం చల్లబడుతుంది. కానీ చెమట త్వరగా ఆరిపోకపోవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. ఫలితంగా శరీరమంతా రక్తాన్ని పంపింగ్ చేయడానికి గుండెపై భారం పడుతుంది. ఈ ప్రభావంతో రక్తపోటు లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.

డీహైడ్రేషన్- రక్తపోటు
గాలిలో అధిక హ్యుమిడిటీ కారణంగా శరీరానికి చెమట ఎక్కువగా పట్టడంతో పాటు బాడీలో నీరు, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోయి డీహైడ్రేషన్‌కి గురవుతుంది. ఫలితంగా రక్త పరిమాణం తగ్గిపోతుంది. దీంతో లో బీపీ వచ్చే ప్రమాదం ఉంది. లో బీపీ కారణంగా బలహీనత ఎక్కువవుతుంది. తలతిరగడం, అలసట వంటి సమస్యలతో బాధపడతారు.
అయితే ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారిలో గాలిలో అధిక తేమ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో వేడి, తేమ కారణంగా శరీరంపై అదనపు భారం పడి రక్తపోటు లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. అందుకే ఇలాంటి సమయంలో ఎప్పటికప్పుడు రక్తపోటును క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులు సూచించిన సలహా మేరకు మందులు తీసుకోవాలి.
గాలిలో అధిక తేమ కారణంగా శరీరం నుంచి ముఖ్యమైన పోషకాలు, మినరల్స్ సోడియం, పొటాషియం బయటకు వెళ్లిపోతాయి. దీంతో మినరల్స్ లోపంతో నీరసం, తల తిరగడం, గుండె కొట్టుకునే వేగంలో మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే ఈ కాలంలో పుష్కలంగా నీరు తాగాలి. సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
వీటిని పాటించండి..
గాలిలో అధిక తేమ కారణంగా బీపీ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులను నివారించేందుకు పుష్కలంగా నీరు తాగాలి. ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా చూసుకోండి. వేడి ప్రదేశాలకు దూరంగా ఉండాలి. తేలికగా ఉండే ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. హై బీపీ ఉన్నవారు ఉప్పు తక్కువగా తీసుకోవాలి. రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు తరచూ తనిఖీ చేసుకోవడం ఉత్తమం. గాలి ప్రసరణ సవ్యంగా అందేందుకు వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. అధిక రక్తపోటు లేదా, లో బీపీతో తల తిరగడం, ఛాతీ నొప్పి, బ్రీత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వెంటనే వైద్య నిపుణుల సలహా తీసుకోవాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
