Latest Updates
-
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.! -
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్‌కి ఒక్కో ఎక్స్పీరియన్స్
మీ పిల్లల్లో చుండ్రు సమస్య.. ఈ జెల్‌ను కాసేపు తలకు పట్టిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?
వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో పిల్లలు తలలో చుండ్రు, దురద వంటి సమస్యకి ఎక్కువ గురవుతారు. అందుకే పిల్లల తల చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉండేందుకు, చుండ్రు తగ్గేందుకు కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను డెర్మటాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు.

చిన్నారుల తలపై పసుపు- తెలుపు రంగులో పొర ఏర్పడటంతో పాటు చిరాకు కలిగిస్తున్నట్లయితే అది చుండ్రుగా పరిగణించాలి. పిల్లల్లో ఈ సమస్యను క్రెడిల్ క్యాప్ అంటారు. అయితే చుండ్రు సమస్య తక్కువగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను పాటించవచ్చు. కానీ ఇది తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా సంబంధిత వైద్యులను సంప్రదించాలి. కాగా, పిల్లల తలలో చుండ్రును ఇంట్లోనే సులభంగా ఎలా తగ్గించవచ్చో చూద్దాం..
పిల్లల్లో చుండ్రు సమస్యను తగ్గించడానికి కొబ్బరి నూనె ఔషధంలా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసి 15 నిమిషాల పాటు తలకు పట్టించి మర్దనా చేయాలి. దీని వల్ల చుండ్రు పొరలు మెత్తబడతాయి. దువ్వినప్పుడు చుండ్రు పొరలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి.

మీ పిల్లలకు తల స్నానం చేయించేటప్పుడు తేలికపాటి షాంపూలను ఉపయోగించాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు తేలికపాటి షాంపూతో శుభ్రం చేయడం వల్ల తలపై పేరుకుపోయిన అధిక జిడ్డు, మృత చర్మ కణాలు తొలగిపోతాయి. అయితే తల స్నానం సమయంలో జుట్టును బలంగా రుద్దకూడదు. సున్నితంగా షాంపూతో కడగాలి.
మీ పిల్లల వయసు 10 సంవత్సరాలు దాటినట్లయితే చుండ్రు సమస్యకు కలబంద జెల్ బాగా పనిచేస్తుంది. కల్తీ లేని కలబంద జెల్‌ను తలకు పట్టించి పావు గంట పాటు ఉంచాలి. తర్వాత శుభ్రంగా కడగాలి. అయితే దీనికి ముందుగా ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే మీ పిల్లలకు ఈ జెల్‌ను ఉపయోగించవచ్చు.
చెమట, మురికి కారణాంగానూ చుండ్రు సమస్య ఏర్పడుతుంది. అందుకే మీ పిల్లల దువ్వెన, టవల్, దిండును ప్రతి రోజూ శుభ్రం చేయాలి. చాలా మంది తలపై చుండ్రు ఇబ్బంది పెడుతుంటే గోళ్లతో చుండ్రు రేణువులను తొలగించేందుకు యత్నిస్తుంటారు. మీ పిల్లలు ఇలా చేయకుండా చూసుకోండి. లేదంటే గట్టిగా గీకడం ద్వారా గాయమయ్యే ప్రమాదం ఉంది. చుండ్రు సమస్యకు చాలా మంది నిమ్మరసం, వెనిగర్, బేకింగ్ సోడా వంటివి ఉపయోగిస్తుంటారు. అయితే పిల్లలకు వీటిని ఉపయోగించకూడదు. వీటివల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.
ఇక, ఈకాలంలో పిల్లల్లో జుట్టు రాలిపోయే సమస్య కూడా ఉంటుంది. పోషకాహార లోపం, తల చర్మ సమస్యలు, చిట్లిపోవడం, జుట్ట సంరక్షణ చర్యలు లేకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అందాలి. అందుకే వారికి ఉపయోగించే నూనెల విషయంలో జాగ్రత్త వహించాలి.

పిల్లల జుట్టుకి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టు కుదుళ్లకు చేరి బలంగా ఉంచుతాయి. క్రమం తప్పకుండా పిల్లలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం ద్వారా తల చర్మం ఎప్పుడూ తేమగా ఉంటుంది. జుట్టును మృదువుగా, మెరిసేలా చేసి రాలకుండా కాపాడుతుంది.
పిల్లల జుట్టు బలహీనంగా, నిర్జీవంగా మారినట్లయితే బాదం నూనె మంచి పరిష్కారం. ఈ నూనెలోని విటమిన్ ఇ, మెగ్నీషియం.. జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు బాదం నూనెతో మీ పిల్లల జుట్టుకి మసాజ్ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
ఆమ్లా నూనెలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు జుట్టు సంరక్షణకి దోహదపడతాయి. కురుల కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా కనిపించేలా చేస్తుంది. అయితే పిల్లల్లో చుండ్రు సమస్య, జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే సొంత నిర్ణయాలు కాకుండా వైద్యుడిని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications