Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
ఇటీవల హోటళ్లు, రెస్టారెంట్లలో వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. తనిఖీల్లో విస్తుపోయే విషయాలు భోజన ప్రియులను కలవరానికి గురిచేస్తున్నాయి. అలా అని ఎప్పుడూ ఇంటి భోజనమే తింటూ ఉండలేరు. ఎప్పుడో ఒకసారైనా రెస్టారెంట్‌కి వెళ్లి తినాలని అనుకుంటారు. ఈ క్రమంలో బయట ఫుడ్ ఫ్రెష్‌గా ఉందా లేదా ఎలా గుర్తించాలి… డౌట్ ఎలా క్లియర్ చేసుకోవాలి.. ఇక్కడ తెలుసుకుందాం..

పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఫ్రెండ్స్‌తో పార్టీలు ఇలా స్పెషల్ డేస్‌లోనే కాదు.. వెజ్, నాన్ వెజ్ వెరైటీలు టేస్ట్ చేయాలనిపించినప్పుడు, ఎప్పుడూ ఇంట్లో ఏం తింటామని అనిపించినప్పుడు తప్పనిసరిగా రెస్టారెంట్‌కి వెళ్లాల్సిందే. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత మనకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసుకునేందుకు కేవలం మెనూ చూడటమే కాదు.. ఇతర విషయాలను కూడా గమనించాలని మీకు తెలుసా.. అవేంటో చూద్దాం..
ఇటీవల జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో ఎక్కువగా బయటపడిన విషయం పరిశుభ్రత పైనే.. కొన్ని రెస్టారెంట్ల వంటగదులు అత్యంత కలుషితంగా ఉండటం, ఆహార ముడి పదార్థాల నిల్వ విధానం వీటిని చూసినప్పుడు ఇలాంటి హానికరమైన భోజనమా మనం తింటున్నది అని ఆందోళనకి గురికాక తప్పదు. కాగా, ఇటీవల జరిపిన ఓ సర్వేలో కేవలం 32 శాతం భారతీయులు మాత్రమే హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత, ఆహార భద్రతను పాటిస్తున్నాయని వెల్లడైంది. దీని ప్రకారం పరిశుభ్రత ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.!
రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఆహార నాణ్యతను ఎలా గుర్తించాలి..
రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ముందుగా ఆహారం వడ్డిస్తున్నప్పుడు ఆ భోజనంలో తాజా సువాసన కాకుండా ఏవైనా అసాధారణ వాసనలు వస్తున్నాయేమో తనిఖీ చేసుకోవాలి. మీకు ఏ మాత్రం తేడాగా అనిపించినా వెంటనే రెస్టారెంట్ యజమానికి లేదా మేనేజర్‌కు తెలియజేయాలి.
ఉద్యోగుల పరిశుభ్రత..
రెస్టారెంట్‌లో ఆహారం వడ్డించే సిబ్బంది పరిశుభ్రత కూడా రెస్టారెంట్ పరిస్థితిని తెలియజేస్తుంది. వారి చేతులు, మురికిగా ఉన్నా దుర్వాసన వస్తున్నా.. వంటగది కూడా అలాగే ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలా అనిపించినప్పుడు వెంటనే ఫిర్యాదు చేయండి మంచిది లేదా అక్కడి నుంచి బయటకు వెళ్లడం ఉత్తమం.

ఆహారం రంగు, రుచి
భోజనం వడ్డించినప్పుడు గ్రేవీ రంగు, కూరగాయల రంగు కూడా ఆహార నాణ్యతను తెలియజేస్తుంది. రంగు సాధారణం కంటే భిన్నంగా అనిపిస్తే వెంటనే ఆ భోజనాన్ని తినడం మానుకోండి. ఆహారం రుచి బాగాలేకపోయినా, పుల్లగా, వింతగా అనిపించినా ఫుడ్ పాయిజన్‌కి గురయ్యే అవకాశం ఉంది. ఇది వాంతులు, విరేచనాలకి దారితీయవచ్చు. ఇలాంటి ఫుడ్‌ని తినకపోవడం మంచిది.

పాత్రలు
ఆహారం వడ్డించేందుకు ఉపయోగించే పాత్రలు, చెంచాలు, ప్లేట్లు నీట్‌గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఏ మాత్రం మురికిగా అనిపించినా వాటిలో తినకండి. ఎలాంటి దుర్వాసన రాకుండా ఉన్నట్లయితే భోజనం చేయండి. లేదంటే ఫుడ్ పాయిజనింగ్‌కి దారితీయవచ్చు.
ఆహారం తనిఖీ..
రెస్టారెంట్‌లో తినేటప్పుడు కూరలు సరిగా ఉడికాయా లేదా నిర్ధారించుకోవాలి. భోజనం ఎలా అలంకరించారో కంటే తినడానికి ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో చూసుకోవాలి. అదేవిధంగా రెస్టారెంట్‌లో బాత్‌రూమ్‌లో పరిశుభ్రతపై కూడా ఒక లుక్కేయాలి. కొన్ని రెస్టారెంట్లలో బాత్రూంలు అధ్వానంగా ఉంటాయి. బాత్రూం, టాయిలెట్లు నీట్‌గా ఉంటే.. ఆ హోటల్ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications