Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి దేశ రాజధానిలో ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా యువత ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారంలో యువత పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. కెరీర్‌పై, దేశ నిర్మాణంపై దృష్టి సారించకుండా మాదకద్రవ్యాలకు బానిస కావడం.. కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదు. ఆరోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. డ్రగ్స్ వ్యసనం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం..

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట వేదికగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. 2047 నాటికి 'అభివృద్ధి చెందిన భారత్’గా అవతరించాలనేది పెద్ద కల అని వెల్లడించారు. ప్రతి ఏటా దేశం కొత్త తీర్మానాలతో ముందుకు సాగుతోందని.. ఈ క్రమంలో దేశ నిర్మాణం కోసం భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చేందుకు ప్రజలు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశవ్యాప్త 'మాదకద్రవ్య రహిత యువజన ఉద్యమం'లో చేరాలని కోరారు.
ప్రధాని మోదీ పిలుపు
'ఇటీవల దేశవ్యాప్తంగా వాలంటీర్లు, అనేక స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సాంస్కృతిక సంస్థలు, ఆధ్యాత్మికవేత్తలు కలిసి మాదకద్రవ్య రహిత భారత్ కోసం 100 వారాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగం కావాలని దేశంలోని ప్రతి కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో చేరి, మాదకద్రవ్య రహిత భారతదేశం అనే కలను నిజం చేయాలి.- ప్రధాని మోదీ
కాగా, మాదక ద్రవ్యాల దుర్వినియోగం దేశంలో యువతకు ప్రధాన సవాలుగా మారుతోందని.. దీనిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా స్పందించాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తుకు బలమైన, సమర్థవంతమైన యువతరం ఎంతో అవసరమని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ పిలుపుమేరకు డ్రగ్స్ వాడకం, దాని దుష్ప్రభావం, నిర్మూలన అవసరంపై ప్రజలు కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

కేవలం డ్రగ్స్ మాత్రమే కాదు, ఏ రకమైన మత్తు పదార్థం సేవించినా అది శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రతి ఒక్కరూ గమనించాలి. క్యాన్సర్ కారకాల అభివృద్ధి, ఆందోళన, కుంగుబాటు, మానసిక అనారోగ్యానికి దారితీస్తాయి.
చిన్న వయసులోనే ఎక్కువ
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) జాతీయ సర్వే ప్రకారం.. 10 నుంచి 17 సంవత్సరాల వయస్సు పిల్లల్లో కూడా మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు, పీల్చే పదార్థాల వాడకం కేసులు నమోదయ్యయాని వెల్లడి కావడం ఆందోళనకరం. ఈ వయస్సు వారిని పరిశీలిస్తే.. సుమారు 30 లక్షల మంది పిల్లలు మద్యం, 20 లక్షల మంది గంజాయి, 40 లక్షల మంది నల్లమందు వంటి మత్తుపదార్థాలు, 30 లక్షల మంది పీల్చే మత్తుపదార్థాలను ఉపయోగిస్తున్నారని అంచనా.
శరీర భాగాలపై దుష్ప్రభావం
పిల్లల్లో మెదడు అభివృద్ధి చెందుతున్న ఈ స్జేజ్‌లో ఏ రకమైన వ్యసనమైనా వారి మొత్తం ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయస్సులోనే వ్యసనానికి లోనవడం వల్ల భవిష్యత్తులో మాదకద్రవ్యాలపై ఆధారపడే ప్రమాదాన్ని మరింతగా పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యసనం క్రమంగా శరీరం మొత్తంపై ప్రభావం చూపిస్తుంది. కాలేయం, గుండె, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ప్రమాదం ఉంది. ఇక ధూమపానం క్యాన్సర్, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదానికి దారితీస్తుంది. మత్తుపదార్థాలకి అడిక్ట్ కావడం ఆందోళన, నిరాశ, చిరాకు కలిగించడంతో పాటు జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. అంతేకాకుండా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా మానసిక రుగ్మతలను సైతం కలుగజేస్తుంది. ఇది హింసకి సైతం దారితీసే అవకాశం ఉంది.
ఈ వ్యసనం నుంచి బయటపడినట్లయితే నేటి బాలలు రేపటి సమాజానికి ఆదర్శవంతమైన పౌరులుగా మారగలరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
