కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్‌ తినకూడదు!

వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య యూరిక్ యాసిడ్. ఉదయం నిద్రలేవగానే కీళ్లలో భరించలేని నొప్పి, వాపు, ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని అర్థం.

మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్లు అనే రసాయనాలు విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది పరిమితికి మించితే, కీళ్ల మధ్య స్ఫటికాల (క్రిస్టల్స్) రూపంలో పేరుకుపోయి ఆర్థరైటిస్ లేదా గౌట్ వంటి భయంకరమైన నొప్పులకు దారితీస్తుంది.

How to Reduce Uric Acid Naturally 3 Worst Foods to Stop Eating for Joint Pain Relief

ఈ 3 ఆహారాలను దూరం పెట్టండి

మనం రోజూ తినే కొన్ని రకాల ఆహార పదార్థాలే శరీరంలో యూరిక్ యాసిడ్ ఫ్యాక్టరీలా పనిచేస్తున్నాయి. మీరు ఈ నొప్పుల నుండి శాశ్వతంగా బయటపడాలంటే మూడు రకాల ఆహారాలకు గుడ్‌బై చెప్పాల్సిందే.

రెడ్ మీట్
మీ యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు మటన్, బీఫ్, పోర్క్ వంటి ఎర్ర మాంసానికి, అలాగే రొయ్యలు, పీతలు వంటి సముద్రపు ఆహారం తినకపోవడం బెటర్. వీటిలో ప్యూరిన్లు అత్యధిక మోతాదులో ఉంటాయి. మీరు వీటిని తిన్నప్పుడు, వాటిని అరిగించే క్రమంలో శరీరం భారీగా యూరిక్ యాసిడ్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కిడ్నీల మీద తీవ్రమైన ఒత్తిడిని పెంచి, కీళ్ల నొప్పులను మరింత కఠినం చేస్తుంది.

మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం!

ఆల్కహాల్ కు వీడ్కోలు

శరీరంలో యూరిక్ యాసిడ్ అమాంతం పెరగడానికి ఆల్కహాల్ ఒక ప్రధాన విలన్ లాంటిది. ముఖ్యంగా బీర్ లో ప్యూరిన్లు విపరీతంగా ఉంటాయి. దీనిని తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరగడమే కాదు.. కిడ్నీలు ఆ యాసిడ్‌ ను వడకట్టి మూత్రం ద్వారా బయటకు పంపే సామర్థ్యాన్ని కూడా మద్యం దెబ్బతీస్తుంది. అంటే ఒకవైపు ఉత్పత్తి పెరుగుతుంది, మరోవైపు బయటకు వెళ్లే దారి మూసుకుపోతుందన్నమాట.

ప్యాక్ చేసిన జ్యూస్‌ లు, స్వీట్లు

సూపర్ మార్కెట్లో ఆకర్షణీయంగా కనిపించే డబ్బా జ్యూస్‌ లు, కూల్ డ్రింక్స్, పేస్ట్రీలు, కుకీలు ఆరోగ్యానికి బద్ధ శత్రువులు. వీటిలో నిల్వ కోసం, రుచి కోసం వాడే ఫ్రక్టోజ్ లేదా కృత్రిమ చక్కెర చాలా ప్రమాదకరమైనది. ఈ ఫ్రక్టోజ్ శరీరంలోకి వెళ్లిన వెంటనే యూరిక్ యాసిడ్ లెవల్స్ ను రాకెట్ వేగంతో పెంచేస్తుంది. తీపి తినాలనిపిస్తే తాజా పండ్లను తినండి తప్ప, ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ జోలికి వెళ్లకండి.

నొప్పులను తరిమికొట్టే అద్భుత చిట్కాలు

యూరిక్ యాసిడ్ లెవల్స్ ను సహజంగా అదుపులో ఉంచుకోవడానికి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగండి. ఇది శరీరంలోని విషపదార్థాలను, అదనపు యూరిక్ యాసిడ్‌ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. అలాగే, మీ రోజువారీ డైట్‌లో ఫైబర్, నిమ్మ, నారింజ, ఉసిరి వంటి విటమిన్ C పుష్కలంగా ఉండే ఆహారాలను భాగం చేసుకోండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, October 12, 2026, 16:52 [IST]
Desktop Bottom Promotion