Latest Updates
-
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే..
మిల్లెట్ దోశలతో ఎలాంటి ప్రయోజనం లేదా? మనం తినే ఫుడ్ అంతా చెత్తేనా? ICMR షాకింగ్ స్టడీ
నిత్యం డైలీ తింటుండే అన్నం, ఇడ్లీ,దోసె, చపాతీ ఇవన్నీ మనకు ఎనర్జీ ఇస్తాయని, ఆరోగ్యమని నమ్ముతాం. దశాబ్దాల నుంచి మన పూర్వీకులు తిన్న ఆమారమే కదా అని ధీమాగా ఉంటాం. అయితే మనం ఎంతో ఇష్టంగా తినేటువంటి ఆహారమే మన ఆరోగ్యాన్ని నిలువునా ముంచేస్తుందని మీకు తెలుసా?
ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే నేచర్ మెడిసిన్ అనే జర్నల్ లో కొద్ది రోజుల క్రితం ఐసీఎంఆర్ కు సంబంధించిన ఒక షాకింగ్ స్టడీ పబ్లిష్ అయ్యింది. ఈ స్టడీ మన ఆహారపు అలవాట్లపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీనిపై సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హార్ట్ సెంటర్ ఎండీ డాక్టర్ ముఖర్జీ మదివాడ ఓ వీడియోలో షాకింగ్ విషయాలు చెప్పారు.

కార్బోహైడ్రేట్ల సునామీలో కొట్టుకుపోతున్న హెల్త్
ప్రపంచంలోని మిగతా దేశాలతో పోల్చితే మనదేశంలోనే ఎక్కువగా కార్బోహైడ్రేట్లు(పిండి పదార్థాలు)తీసుకుంటున్నారు. భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో ప్రజలు తినే ఫుడ్ లో 65-75 వరకు కార్బోహైడ్రేట్లు ఉంటున్నాయి.అంటే మన భోజనం ప్లేట్ లో మూడొంతులు అన్నం,చపాతీ, రొట్టెలతోనే నిండిపోతుంది. మిగిలిన కొద్దిపాటి స్థానంలోనే కూరగాయలు,పప్పులు ఉంటున్నాయి.
అంతేకాకుండా షుగర్ వాడకంలో కూడా మిగతాదేశాలతో పోల్చితే మనమే టాప్ లో ఉన్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)ప్రకారం..మన రోజువారీ ఎనర్జీ అవసరాల్లో 5శాతం మాత్రమే షుగర్ ద్వారా రావాలి. అయితే మనదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ పరిమితిని ఎప్పుడో దాటేశాం. కాఫీలు, టీ, కూల్ డ్రింకులు, స్వీట్లు రూపంలో విపరీతంగా చక్కెరను కడుపులోకి డైలీ పంపిస్తున్నాం.
ఈ అధిక కార్బోహైడ్రేట్లు, చక్కరలే మనదేశం వరల్డ్ డయాబెటిస్ రాజధానిగా మారడానికి, ఊబకాయం కేసులు పెరగడానికి,గుండె జబ్బులకు ప్రధాన కారణంగా మారిపోతుందని డాక్టర్ ముఖర్జీ మదివాడ అంటున్నారు.
శరీరానికి అత్యవసరమైన ప్రోటీన్ ఎక్కడ?
మనుషుల శరీర నిర్మాణానికి, కండరాల పటుత్వానికి, రోగనిరోధక శక్తికి ప్రోటీన్ (మాంసకృత్తులు) చాలా కీలకం. కానీ మనం డైలీ తినే ఆహారంలో ఇదే కరువైపోతుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు తీవ్రమైన ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మనకు అందే శక్తిలో కేవలం 12 శాతం మాత్రమే ప్రోటీన్ల నుంచి వస్తోంది. ఇది అంతర్జాతీయ సిఫార్సులతో పోలిస్తే చాలా చాలా తక్కువ.
పప్పులు, గుడ్లు, పనీర్, మాంసం, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను మనం తగినంతగా తీసుకోవడం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే నీరసం, కండరాల బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం.
ఆరోగ్యమనుకున్నవి కూడా ప్రమాదకరమేనా?
ఐసీఎంఆర్ అధ్యయనంలో మనందరినీ ఆశ్చర్యపరిచే ఒక సంచలన విషయం బయటపడింది. మనం ఎంతో ఆరోగ్యకరమని భావించే మిల్లెట్స్ (రాగులు, సజ్జలు, జొన్నలు) లేదా గోధుమలను పిండి చేసి, వాటితో దోశలు, రొట్టెలు చేసుకుని తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదట. ఇది నిజంగా షాకింగ్ వాస్తవం.
రాగి దోశ, జొన్న రొట్టె తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటదని, ఆరోగ్యానికి మంచిదని ఇప్పటిదాకా మనం బలంగా నమ్మాం. అయితే ధాన్యాన్ని పిండిగా మార్చినప్పుడు వాటిలోని పోషక విలువలు, ముఖ్యంగా వాటి జీవక్రియ ప్రయోజనాలు తగ్గిపోతున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
అయితే మిల్లెట్స్ ను పిండి చేయకుండా వాటిని సంపూర్ణ ధాన్యంగా అంటే రాగి సంగటి, జొన్న అన్నం, కొర్రల ఉప్మా వంటి రూపాల్లో తీసుకున్నప్పుడు మాత్రం జీవక్రియ సంబంధిత సమస్యలు తగ్గుతున్నట్లు కనిపెట్టారు. అంటే ధాన్యాన్ని దాని సహజ రూపంలో తింటేనే ప్రయోజనమని గుర్తించారు.
అదేవిధంగా హోల్ వీట్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ వంటివి తిన్నా కూడా.. అవి అధిక కార్బోహైడ్రేట్లతో కూడినవే కాబట్టి వాటి వల్ల కూడా ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు కలగడం లేదని స్టడీలో తేలింది.

పరిష్కారం ఏంటి?
కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నాయని వాటి బదులు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుందా? అంటే అదీ కాదని ఈ స్టడీ చెబుతోంది. ఇప్పటికే మనం సంతృప్త కొవ్వులను పరిమితికి మించి తీసుకుంటున్నాం. ఇది కూడా గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే ఈ సమస్యకు ఒకే ఒక్క బంగారు పరిష్కారం ఉందని డాక్టర్ ముఖర్జీ మదివాడ చెబుతున్నారు.
అదే.. కార్బోహైడ్రేట్లను తగ్గించి, వాటి స్థానంలో ప్రోటీన్ ను పెంచడం. ఎవరైతే తమ ఆహారంలో పిండిపదార్థాలను తగ్గించి ప్రోటీన్ ను పెంచుకున్నారో వారిలో షుగర్ వచ్చే ప్రమాదం, ఇతర జీవక్రియ సమస్యలు గణనీయంగా తగ్గినట్లు ఈ అధ్యయనంలో స్పష్టంగా తేలింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications