Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి!
ఈ మధ్య ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. బ్రోకలీ, ముఖ్యంగా బ్రోకలీ మొలకల గురించి ఎక్కడ లేని ప్రచారం జరుగుతోంది. దీన్ని ఒక సూపర్ ఫుడ్ గా, క్యాన్సర్ ను తరిమికొట్టే దివ్యౌషధంగా, బాడీని డిటాక్స్ చేసే అద్భుతంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి ఇదొక్కటే షార్ట్ కట్ అన్నట్లుగా చెబుతున్నారు.

కానీ, నిజంగా బ్రోకలీలో అంత పవర్ ఉందా? దీనికి సంబంధించిన అసలు నిజానిజాలను ప్రముఖ అనస్థీషియాలజిస్ట్, పెయిన్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కునాల్ సూద్ ఒక ఇన్ స్టాగ్రామ్ వీడియో ద్వారా తెలియజేశారు. బ్రోకలీ మన శరీరంలో ఎలా పనిచేస్తుంది? ఆన్ లైన్ ప్రచారంలో శాస్త్రీయత ఎంత? అనే విషయాలను ఆయన పూసగుచ్చినట్లు వివరించారు.
అసలు బ్రోకలీలో ఏముంది?
డాక్టర్ సూద్ ప్రకారం.. బ్రోకలీలో, ముఖ్యంగా దాని మొలకలలో సల్ఫోరాఫేన్ అనే అత్యంత శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. సల్ఫోరాఫేన్ మన శరీరంలోని సహజ యాంటీఆక్సిడెంట్ వ్యవస్థను మేల్కొల్పుతుంది. అంటే కణాల స్థాయిలో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని, వాపులను తగ్గించడంలో ఇది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది.
అందుకే దీనికి అంత క్రేజ్ అని ఆయన స్పష్టం చేశారు. మన శరీరం ఒత్తిడిని జయించడంలో ఇది నిజంగానే సహాయపడుతుందని ఆయన అంగీకరించారు.
మరి క్యాన్సర్‌ను నివారిస్తుందా?
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా బ్రోకలీ ఏమీ డైరెక్ట్ క్యాన్సర్ నిరోధకం కాదని డాక్టర్ సూద్ తేల్చి చెప్పారు. బ్రోకలీ నేరుగా క్యాన్సర్ ను అంతం చేయదు. కానీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి అవసరమైన డిటాక్స్ (శరీరంలోని మలినాలను బయటకు పంపే) ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది.
అయితే క్యాన్సర్ ను నివారిస్తుందని చెప్పడానికి చూపించే ఆధారాలన్నీ కేవలం ల్యాబ్ లలో, జంతువుల మీదే జరిగాయి. మనుషులపై జరిగిన ప్రయోగాల్లో ఇవి ఇంకా పూర్తిస్థాయిలో నిరూపితం కాలేదు అని వివరించారు. అంటే, బ్రోకలీ ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది కానీ అదే నూటికి నూరు శాతం గ్యారెంటీ ఇచ్చే మందు కాదు.
ఎలా తింటే ఎక్కువ ప్రయోజనం?
మీరు బ్రోకలీని తినే విధానంలో చిన్న మార్పు చేస్తే, దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. బ్రోకలీ లేదా దాని మొలకల నుండి గరిష్ట ప్రయోజనం పొందాలంటే, వాటిని సన్నగా ముక్కలుగా తరగడం లేదా బాగా నమిలి తినడం చేయాలి. ఇలా చేయడం వల్ల అందులోని సల్ఫోరాఫేన్ వెంటనే యాక్టివేట్ అవుతుందని డాక్టర్ సూద్ సూచించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
