Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
కడుపు మాడ్చుకోకుండా బరువు తగ్గాలా? అయితే బ్రోకలీతో ఇలా ట్రై చేయండి!
రీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించి, స్లిమ్ గా, ఫిట్ గా మారాలని ఎవరికి ఉండదు? కానీ, బరువు తగ్గడం కోసం డైట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చప్పటి ఆహారం, కడుపు మాడ్చుకోవడం. ప్రతిరోజూ రుచి లేని ఆహారం తినలేక చాలామంది మధ్యలోనే డైట్ వదిలేస్తుంటారు.
కానీ డైట్ ఫుడ్ అంటే బోరింగ్ అనే అపోహను చెరిపేస్తూ, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన ఆకుపచ్చని కూరగాయ బ్రోకలీ. బరువు తగ్గాలనే లక్ష్యం ఉన్నవారికి పోషకాహార నిపుణులు సూచించే అత్యుత్తమ ఆహారాల్లో బ్రోకలీ ముందు వరుసలో ఉంటుంది.

సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉంటే బరువు పెరుగుతాం. కానీ బ్రకోలీ విషయానికి వస్తే 100 గ్రాముల బ్రకోలీలో ఉండేవి కేవలం 34 కేలరీలు మాత్రమే. అంటే మీరు కడుపు నిండా తిన్నా బరువు పెరుగుతామనే భయం అక్కర్లేదు. పైగా ఇందులో ప్రోటీన్, డైటరీ ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
ఫైబర్ వల్ల కడుపు చాలా సేపటి వరకు నిండిన భావన కలుగుతుంది, తద్వారా పదే పదే ఆకలి వేయదు. విటమిన్ సి శరీరంలోని మొండి కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది.అయితే బ్రోకలీని ఎలా పడితే అలా వండితే దానిలోని పోషకాలు నశించే ప్రమాదం ఉంది. రుచి, పోషకాలు ఏమాత్రం తగ్గకుండా బ్రోకలీని మీ రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవడానికి ఇక్కడ చూడండి.
ఆవిరిపై ఉడికించిన బ్రోకలీ
బ్రకోలీలోని పోషక విలువలు నూటికి నూరు శాతం శరీరానికి అందాలంటే దీనిని నీటిలో ఉడకబెట్టే బదులు, కేవలం 5-6 నిముషాల పాటు ఆవిరి మీద (Steam) ఉడికించండి. ఇలా చేయడం వల్ల దాని ఆకుపచ్చ రంగు, క్రంచీ రుచి మారవు. ఉడికిన బ్రకోలీ ముక్కలపై కొద్దిగా నిమ్మరసం, తాజా మిరియాల పొడి చల్లుకుని తింటే, ఆ అద్భుతమైన రుచికి మీరు కచ్చితంగా ఫిదా అవుతారు.
బ్రోకలీ సూప్
రాత్రి పూట ఎప్పుడూ తేలికపాటి ఆహారం తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా అవసరం. అలాంటప్పుడు ఒక గిన్నెడు వేడి వేడి బ్రకోలీ సూప్ తాగడం బెస్ట్ ఆప్షన్. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపి డీటాక్స్ (Detox) చేయడమే కాకుండా, కడుపు నిండుగా ఉంచుతుంది.
బ్రోకలీ సలాడ్
సగం ఉడికించిన బ్రకోలీ ముక్కలకు, కొద్దిగా పెరుగు లేదా ఆలివ్ నూనెను డ్రెస్సింగ్ లా కలపండి. ఇది మరింత రుచిగా ఉండటానికి కొద్దిగా వేయించిన బాదం పప్పులు లేదా వాల్ నట్స్ ముక్కలను జోడించండి.

బ్రోకలీ ఫ్రై
మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళ ఏదైనా రుచిగా తినాలనిపిస్తే.. ఒక పాన్‌లో కొద్దిగా ఆలివ్ నూనె వేసి, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేయించి, ఆపై బ్రకోలీ వేసి కొద్దిసేపు వేయించండి. రుచి కోసం కొద్దిగా సోయా సాస్, తెల్ల నువ్వులు చల్లితే.. పోషకాలతో కూడిన హెల్తీ స్నాక్ మీ ఇంట్లోనే రెడీ.
బ్రోకలీ కట్ లెట్
డైట్ చేస్తున్నామని స్నాక్స్ మానేయాల్సిన పనిలేదు. బ్రకోలీని సన్నగా తురిమి, దానికి కొద్దిగా చీజ్ లేదా ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంపను కలిపి టిక్కీల్లా చేసి, తక్కువ నూనెతో కాల్చుకోండి. పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే ఇవి డైట్ ఫుడ్ అంటే ఇష్టపడని వారిని కూడా ఆకర్షిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications