Latest Updates
-
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.!
ఒత్తిడితో కంటి మీద కునుకు కరువు.. ఈ యోగాసనాలతో ఇట్టే నిద్ర పట్టేస్తుంది.!
నేటి ఆధునిక జీవితంలో చాలా మందికి ప్రశాంతమైన నిద్ర కరువైంది. ఇలా బెడ్ ఎక్కగానే నిమిషాల్లోనే కంటి మీద కునుకు చేరడం అసాధ్యంగా మారింది. మారుతున్న జీవనశైలి, పనిలో ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, లేటుగా నిద్రపోవడం ఇలా చాలా రకాల కారణాలతో ఆరోగ్యకరమైన నిద్రను ఆస్వాదించలేకపోతున్నారు. అయితే ఈ యోగాసనాలు వేయడం ద్వారా నిమిషాల్లోనే నిద్ర పోవడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి పడుకోగానే నిద్ర పోవడం అనేది చాలా మంది జీవితాల్లో కలగానే మిగిలిపోయింది. దీనివల్ల ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం, తలనొప్పి, పనిలో ఏకాగ్రత లోపించడం వీటన్నిటికి దారితీస్తున్నాయి. అయితే మీ డైలీ రొటీన్‌లో రాత్రి పడుకునే ముందు కొన్ని సులువైన యోగాసనాలు వేయడం ద్వారా త్వరగా నిద్ర పట్టడంతో పాటు కంటి నిండా ప్రశాంతమైన నిద్రకి దోహదపడుతుంది.
నిద్రలేమి సమస్యకు యోగా సులభమైన, ప్రభావవంతమైన చికిత్సగా పనిచేస్తుంది. ప్రతిరోజూ కొన్ని యోగాసనాలను అభ్యసించడం వల్ల శరీరంలో సానుకూల మార్పులు జరుగుతాయి. దీంతో బాగా నిద్రపోవడానికి సహకరిస్తుంది. కాగా, నిద్ర పట్టడంలో మెలటోనిన్ అనే హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఈ హార్మోన్ ప్రశాంతంగా ఉత్పత్తి కావాల్సి ఉంటుంది. ప్రతి రోజూ యోగా సాధన చేయడం ద్వారా ఈ హార్మోన్ స్థాయిలు సమతుల్యమై నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. ఈ యోగాసనాలతో నిద్రకే కాకుండా శారీరకంగానూ ప్రయోజనాలు చేకూరుతాయి.
శవాసనం
యోగాసనాల్లో అత్యంత సులభమైనది శవాసనం. ఈ ఆసనం ఎవరైనా చేయవచ్చు. యోగా మ్యాట్‌పై కాళ్లు, చేతులు చాపి వెల్లకిలా పడుకోవాలి. దీని ద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయి. మీ శరీరంలో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గి పడుకున్న వెంటనే నిద్రలోకి జారిపోయేందుకు ఈ ఆసనం సహకరిస్తుంది.
సేతుబంధాసనం

సేతుబంధాసనంలో మొదటగా వెల్లకిలా పడుకుని ఛాతీ నుంచి మోకాళ్ల వరకు పైకి లేపాలి. ఎడమ చేయి అరచేతిని పొట్టపై, కుడి చేయి అరచేతిని ఛాతీపై ఉంచాలి. దీని ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్వాస తీసుకోవడం మెరుగై శరీరమంతటా ఆక్సిజన్ ప్రవాహం కొనసాగుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ గ్రంథి పనితీరుకు దోహదపడుతుంది. అలసటను తగ్గించి నిద్ర టైమింగ్స్‌ను సమతుల్యం చేస్తుంది. ఫలితంగా నాణ్యమైన నిద్రకి దోహదపడుతుంది.
బాలాసనం

బాలాసనం ద్వారా నడుము నొప్పి సమస్య ఉన్నవారికి ఊరట కలిగిస్తుంది. ఈ ఆసనంలో ముందుగా బోర్లా పడుకుని ఛాతీ నుంచి నడుము భాగం వరకు పైకి లేపాలి. కేవలం నుదురు, మోకాళ్లు పాదాలు నేలపై ఉండాలి. చేతులను ముందుకు చాచాలి. ఈ ప్రక్రియ శ్వాసను సులభతరం చేస్తుంది. ఈ ఆసనాన్ని రోజూ వేయడం ద్వారా నిద్ర మెరుగుపడుతుంది.
భ్రమరి ప్రాణాయామం
శవాసనం తర్వాత అత్యంత సులభమైనది భ్రమరి ప్రాణాయామం. ఈ ఆసనంలో నేలపై నిటారుగా కూర్చుని గుసగుస శబ్దాలు చేస్తూ, లోతైన శ్వాసలు తీసుకోవాలి. కళ్లను రెండు చేతులతో మూసివేసి కేవలం శ్వాసపైనే దృష్టి సారించాలి. దీని ద్వారా శరీరం ప్రశాంతమైన స్థితిలోకి వెళ్లి.. హార్ట్‌బీట్‌ను సమతుల్యం చేస్తుంది. నాడీ వ్యవస్థకి విశ్రాంతినిచ్చి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ ఆసనాలు వేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన నిద్రను ఆస్వాదించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
