మగవారిలో 40 ఏళ్ల తర్వాత ఈ ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది

వయస్సు మీద పడే కొద్దీ ఆరోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. జీవనశైలి ప్రభావం కనిపించడం మొదలవుతుంది. డయాబెటిస్, బీపీ, గుండె సంబంధిత సమస్యలు, బరువు పెరగడం క్రమంగా ఎక్కువవుతాయి. వయస్సుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలకు ఆడా, మగా అనే తేడాలేం లేవు. అయితే 40 ఏళ్లు దాటిన పురుషుల్లో కనిపంచే ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Men Health Problems Common Health Problems Men Face After Age 40 In Telugu

గుండె సమస్యలు:
వయస్సు పెరుగుతున్న కొద్దీ గుండె సంబంధిత సమస్యలు చుట్టు ముడతాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అత్యధిక మరణాలకు గుండె సంబంధిత సమస్యలే ప్రధాన కారణం.

స్ట్రోక్:
40 ఏళ్ల తర్వాత ప్రతి దశాబ్దానికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ధూమపానం, అధిక రక్తపోటు, జీవనశైలి వంటి కారణాల వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అంగస్తంభన సమస్య:
చాలా మంది పురుషులను వేధించే సమస్య అంగస్తంభన సరిగ్గా లేకపోవడం. అంగస్తంభన సమస్య అనేక కారణాల వల్ల వస్తుంది. ఇందులో వయస్సు మీద పడటం కూడా ఒక సమస్యే. అంటే జీవనశైలి, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యల, ఒత్తిడి, ఆందోళన లాంటి కారణాల వల్ల అంగస్తంభన సమస్య వస్తుంది.

ధమనులు పూరుకుపోవడం:
వయస్సు పెరిగేకొద్దీ ధమనులు పూడుకుపోతాయి. ధమనులు సంవత్సరాల తరబడి పోగు చేసిన చెత్తతో ధమనులు పూడుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు అంగస్తంభన సమస్యలూ వస్తాయి.

ఊబకాయం:
వయస్సు పెరిగే కొద్దీ బరువు కూడా పెరుగుతారు. 40 ఏళ్లు పైబడిన చాలా మందిని ఊబకాయం సమస్య వేధిస్తుంది. మధ్యవయస్సులో ఊబకాయం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Saturday, June 10, 2023, 20:22 [IST]
Desktop Bottom Promotion