Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్‌లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్‌కి దారి తీసే లక్షణాలివే.!
ఈ రోజుల్లో ఆకలికి కాసేపైనా ఓర్చుకుంటున్నారమే కానీ.. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. ఉదయం నిద్ర లేవడమే మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతున్నారు. ముఖ్యంగా పెద్దలతో పోలిస్తే పిల్లలు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌కు బానిస అవుతున్నారు. దీని వల్ల డ్రై ఐ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆధునిక కాలంలో మన దైనందిన జీవితంలో స్కీన్ సమయం పెరుగుతూనే ఉంది. ఆఫీసు పనులు, సినిమాలు, ఆటలు, సోషల్ మీడియా స్క్రోలింగ్ పనేదైనా స్మార్ట్‌ఫోన్ కీలకం. ఇక ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల విషయంలో ఈ పరిస్థితులు దారుణంగా ఉంటాయి. పిల్లలు పదేపదే మారాం చేస్తున్నారని, విసిగిస్తున్నారని.. వారి చేతికి ఫోన్ ఇచ్చేసి పని తప్పించుకుంటున్నారు. దీంతో ఫోన్‌కి విపరీతంగా బానిసై వివిధ మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల కళ్లపై ఫోన్ స్క్రీన్ నుంచి కిరణాల ప్రభావం ఎక్కువగా పడి కంటి పొరను దెబ్బతీస్తాయి.
ముఖ్యంగా ఈ కాలం పిల్లలు అన్నం తినేటప్పుడు స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి. అయితే ఫోన్ చూస్తూ అన్నం తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా వారిలో ఎదుగుదల లోపిస్తుంది. దీనినే డ్రై ఐ సిండ్రోమ్ అంటారు. ఈ ఫలితంగా సాధారణంగా కనురెప్పలు ఆర్పే రేటు 5 నుంచి 7 సార్లకి పడిపోతుంది. ఇక, మొబైల్ ఫోన్‌కు ఎక్కువ సేపు చూడటం వల్ల మీ కళ్లలోని సహజ తేమ కోల్పోతుంది. అంతేకాకుండా కళ్లలోని నీరు ఆరిపోవడంతో మంట, పొడిబారడం, కళ్లు ఎర్రబడటం, బరువుగా అనిపించడం, స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు దృష్టి మసకబారడం వంటి లక్షణాలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్‌కు మీరు అతిగా బానిస అవుతున్నట్లయితే దీని నుంచి త్వరగా బయటపడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు 20-20-20 సూత్రాన్ని పాటించాలని సిఫార్సు చేస్తున్నారు. ఈ ఫార్ములా ప్రకారం ప్రతి 20 నిమిషాల పనికి 20 సెకన్ల పాటు చిన్న విరామం తీసుకోవాలి. ఎక్కువ సమయం పనిలో ఉన్నప్పుడు మీ స్క్రీన్ నుంచి దృష్టిని మరల్చడం అవసరం. అప్పుడు దూరంగా ఉన్న వస్తువులను చూస్తూ ఉండటం చేయాలి. స్క్రీన్ చూస్తున్నప్పుడు తరచూ కనురెప్పలు వాలుస్తూ ఉండటం మరిచిపోవద్దు.
ఉదయం నిద్ర లేవడమే ఫోన్ చూడటం, వాట్సప్ స్టేటస్‌లు, రీల్స్ చూడటం చాలా మందికి అలవాటు. ఈ అలవాటు నుంచి బయటపడాలి. ప్రతిరోజూ ఉదయం ప్రకృతితో గడపడానికి సమయం ఇవ్వండి. వాకింగ్, ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా కళ్లపై ఒత్తిడి తగ్గి యాక్టివ్‌గా మారతాయి. తిన్నంతసేపు ఏం తింటున్నామో అనేదానిపై మాత్రమే దృష్టి సారించి సంతృప్తిగా భోజనం చేయాలి.

ఇక నిద్రకు ఉపక్రమించే గంట ముందు నుంచే ఫోన్ చూడటం ఆపేయాలి. కొందరు రాత్రి సమయంలో గదిలో లైట్లు ఆర్పేసి మొబైల్ ఫోన్ చూస్తుంటారు. ఇది చాలా పొరపాటు. చీకటిలో మొబైల్ స్క్రీన్ ద్వారా ఆ కాంతి మీ కళ్లకు హాని కలుగజేస్తుంది. ఆఫీసు పని సమయంలో స్క్రీన్ ప్రొటెక్షన్ లెన్స్ వాడటం మంచిది. దీని ద్వారా కంప్యూటర్ స్క్రీన్ కిరణాలు కళ్లపై పడకుండా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications