Latest Updates
-
జూలై 2న కుంభరాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి తిరుగేలేదు, ఎవరికి జాగ్రత్త? -
National Doctor's Day 2026: తెల్ల కోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లు..డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి -
జూలై 1 శాలరీ డే: ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
మీ చిన్నారి చేతిలో దెబ్బలు తింటున్నారా? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
మన పూర్వీకులు తిన్న బ్రేక్ ఫాస్ట్ ఇదే..కొండలను ఢీకొట్టే శక్తి, ఇలా చేసుకోండి -
ధనిష్ఠ నక్షత్రంలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, ధనలాభం ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - బుధవారం, 01 జూలై 2026 -
యూట్యూబ్ వీడియో చూసి గర్భిణీ ప్రసవం, ఆపై మృతి.. సొంత చికిత్సలతో ఎంత ప్రమాదమో తెలుసా.! -
ఒంటరిగా ఉండటం ఆరోగ్యకరమేనా.. ఇవే కారణాలు అయితే నిర్లక్ష్యం వద్దు.! -
ఇంట్లో శాంతి, ఐక్యత పెరగాలంటే పూర్వీకులు పాటించిన ఆచారాలు
జలై 1నే డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? 2026 థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత
వైద్యో నారాయణో హరి అంటారు మన పెద్దలు. భూమిపై కనిపించే దేవుళ్లుగా మనం డాక్టర్లను ఆరాధిస్తాం. మన ప్రాణాలను కాపాడేందుకు, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తమ జీవితాలను అంకితం చేసే డాక్టర్ల సేవలను స్మరించుకుంటూ, భారతదేశం ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors' Day) జరుపుకుంటుంది. అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో సైతం నిరంతరం శ్రమించే వైద్య నిపుణులకు కృతజ్ఞతలు తెలిపే అద్భుతమైన సందర్భం ఇది.

జూలై 1నే డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే?
ఈ రోజుకు ఒక విశేషమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ప్రముఖ డాక్టర్, విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (బి.సి. రాయ్) జన్మదినం, వర్ధంతి రెండు కూడా జూలై 1వ తేదీనే కావడం విశేషం. 1882 జూలై 1న జన్మించిన ఆయన, సరిగ్గా 1962 అదే రోజున కన్నుమూశారు. భారతీయ వైద్య రంగానికి, ప్రజారోగ్య వ్యవస్థకు ఆయన చేసిన విశేష కృషికి గాను కేంద్ర ప్రభుత్వం 1991లో ఆయన జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించింది.
డాక్టర్ బి.సి. రాయ్ ఇంగ్లాండ్లో ఒకేసారి ప్రతిష్టాత్మకమైన MRCP (ఫిజిషియన్), FRCS (సర్జన్) డిగ్రీలను పూర్తి చేసిన అరుదైన, అత్యంత ప్రతిభావంతుడైన వైద్యుడు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఒక ప్రముఖ వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. భారతదేశంలో మెరుగైన వైద్య సేవలు, పరిశోధనలు జరగాలని ఆయన ఎన్నో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలను స్థాపించారు. జాదవ్పూర్ టీబీ హాస్పిటల్, చిత్తరంజన్ సేవా సదన్ (మహిళలు, పిల్లల కోసం),కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ వంటివి ఆయన కృషితో ఏర్పడినవే.
భారతదేశంలో వైద్య వృత్తిని క్రమబద్ధీకరించడానికి,డాక్టర్లకు ఒక వేదికను అందించడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA),మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(MCI) స్థాపనలో ఆయన ముఖ్య భూమిక పోషించారు.
ఆయన మహాత్మా గాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా సేవలు అందించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటూనే, రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ పేదలకు ఉచితంగా వైద్యం అందించేవారు. వైద్య వృత్తిని ఆయన ఒక వ్యాపారంగా కాకుండా సేవగా భావించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల పాటు (1948 నుండి 1962 వరకు) పనిచేశారు. స్వాతంత్ర్యం తర్వాత గందరగోళంలో ఉన్న ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. వైద్య రంగానికి, సమాజానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1961లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' (Bharat Ratna)తో ఆయనను సత్కరించింది. ఆయన పేరు మీదుగా అందించే డాక్టర్ బి.సి. రాయ్ జాతీయ అవార్డు నేటికీ వైద్యరంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతోంది.

2026 థీమ్: వైద్యులకు స్వస్థత చేకూర్చేది ఎవరు?
ఎప్పుడూ ఇతరుల ప్రాణాల గురించి ఆలోచించే డాక్టర్ల ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకుంటారు? అందుకే 2026 సంవత్సరానికి గాను ఆరోగ్య సంస్థలు ముసుగు వెనుక: వైద్యులను ఎవరు స్వస్థపరుస్తారు?(Behind the Mask: Who Heals the Healers) అనే థీమ్ ఎంచుకున్నాయి. ఇది చాలా లోతైన అర్థాన్ని ఇస్తుంది. నిరంతర పని గంటలు, కార్యాలయ ఒత్తిడి కారణంగా వైద్యులు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక అలసటను ఈ థీమ్ చర్చిస్తుంది. ఇతరులకు సంరక్షణ అందించే డాక్టర్లకు కూడా కరుణ, మద్దతు మరియు విశ్రాంతి అవసరమని సమాజానికి గుర్తుచేస్తోంది.
ఈ రోజు ప్రాముఖ్యత, వేడుకలు
వ్యాధులను నిర్ధారించడం, ప్రాణాలు నిలబెట్టే శస్త్రచికిత్సలు చేయడం నుండి విపత్కర పరిస్థితులు, అంటువ్యాధుల సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడటం వరకు డాక్టర్లు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. తమ నిద్రాహారాలు మాని ప్రాణాలను నిలబెట్టే వారి కరుణకు, వృత్తి పట్ల వారి నిబద్ధతకు సలాం చేయడానికి ఈ రోజును ఒక వేదికగా మలుచుకోవాలి.
ఈ రోజున దేశవ్యాప్తంగా హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో సన్మాన కార్యక్రమాలు, ఉచిత మెడికల్ క్యాంప్ లు, సెమినార్లు నిర్వహిస్తారు. ఎంతో మంది రోగులు సోషల్ మీడియా వేదికగా, మెసేజ్ల ద్వారా తమకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications