Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఒంటరిగా ఉండటం ఆరోగ్యకరమేనా.. ఇవే కారణాలు అయితే నిర్లక్ష్యం వద్దు.!
ఉరుకులు పరుగుల జీవితంతో వ్యక్తిగత సమయం దొరకడం గగనమే అయింది. ఇది క్రమంగా ఒత్తిడికి దారితీస్తుంది. దీంతో మానసిక ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది బిజీ లైఫ్‌లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒంటరిగా ఉంటూ వారు ఏం చేస్తున్నారనేది కీలకంగా మారింది. అసలు ఒంటరిగా ఉండటం ఆరోగ్యకరమేనా.. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు.. ఇక్కడ చూద్దాం..

పోటీ ప్రపంచంలో తీరికలేని జీవితాలు, బాధ్యతల కారణంగా తరచుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నిపుణులు అంటున్నారు. అయితే చాలా మందికి మానసిక ఆరోగ్యంపై అవగాహన ఉండటం లేదని.. ఇప్పుడిప్పుడే తమ కోసం సమయం కేటాయించుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఈ బిజీ లైఫ్‌లో ఎంత మేర ఒత్తిడికి గురవుతున్నారనే విషయం చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని ఫలితంగా మానసికంగా కుంగిపోయి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇలా ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి మంచిదేనా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ఒంటరిగా గడపాలనుకోవడం ఇష్టమా.. లేక మానసిక ఆరోగ్య సమస్యా అనేది ముందుగా తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. అయితే నిజానికి ఒంటరిగా ఉండాలని అనుకోవడం పూర్తిగా సాధారణమే.. ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి, భావోద్వేగ సమతుల్యత కోసం అనువుగా ఉంటుంది. ఒంటరిగా గడపడం ద్వారా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకుని ఉత్సాహాన్ని తిరిగి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఒంటరిగా ఉండటం అంటే..
అయితే ఒంటరిగా గడపడం సాధారణంగా కాకుండా మీరు ఏమైనా మార్పులు చూసినట్లయితే దానిని లైట్ తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. ఒంటరిగా ఉండటం అంటే పని ఒత్తిడి నుంచి విరామం తీసుకుని మీకోసం మీరు సమయం కేటాయించుకోవడం.. ఫ్రెండ్స్, కుటుంబీకులు నచ్చిన వ్యక్తులతో మాట్లాడటం, నచ్చిన పనులు చేయడం ఇలాంటి వాటి ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవచ్చు..

కానీ కొందరు ఒంటరితనంలో తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. నలుగురితో కలవడానికి ఇష్టపడరు. సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. రిలేషన్స్‌ను పెంచుకోవడంపై ఆసక్తి చూపించరు. క్రమంగా విచారం, నిరాశ, జీవితం పట్ల ఉత్సాహం లేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే మానసిక ఆరోగ్య సమస్యకు దారితీస్తుందని.. జీవన నాణ్యత తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.
నిర్లక్ష్యం చేయవద్దు
ఈ క్రమంలో ఓ వ్యక్తి తన ఇష్టప్రకారమే ఒంటరిగా ఉంటున్నారా.. లేక పరిస్థితులు, మానసిక ఒత్తిడి కారణంగా ఒంటరిగా ఉండాలని భావిస్తున్నారా అనేది అడిగి తెలుసుకోవాలి. రెండో కారణమైతే సైకాలజిస్టును సంప్రదించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఏకాంతానికి, హానికరమైన సామాజిక ఒంటరితనానికి మధ్య ఉన్న తేడా ఇదేనని గమనించాలి.
ఇలా చేయండి
ఆరోగ్యకరమైన ఏకాంతం కోసం మీ శ్రేయోభిలాషులతో సంభాషణలను మెరుగుపరుచుకోండి. కుటుంబీకులతో సమయం గడపవచ్చు. నచ్చిన ప్రదేశాలకు వెళ్లవచ్చు. మీకు ఒంటరిగా అనిపించినప్పుడు కాసేపు అలా ప్రకృతితో గడుపుతూ మనశ్శాంతిని పొందండి. ప్రతిరోజూ ఇలా కాసేపు చేయడం ద్వారా మీకు ఉపశమనం లభిస్తుంది. మీ జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి బయటపడి ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
