Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
మీ చిన్నారి చేతిలో దెబ్బలు తింటున్నారా? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మీ రెండు లేదా మూడేళ్ల చిన్నారి మిమ్మల్ని అకస్మాత్తుగా కొట్టినప్పుడు మీకు గుండెనొప్పిగా, బాధగా అనిపిస్తుందా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా బిడ్డ, నన్నే ఎందుకు కొడుతున్నాడు? అని ఎప్పుడైనా మదనపడ్డారా? ఈ ప్రశ్న చాలా మంది తల్లిదండ్రులకు వస్తుంది, కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఎవరూ చెప్పరు.

పిల్లలు తమకు అత్యంత ఇష్టమైన వారినే కొట్టడానికి కారణం వారి మీద కోపం కాదని మహారాష్ట్రకు చెందిన పీడియాట్రిషన్ డాక్టర్ మహేష్ సులక్ శానే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పారు. అసలు పిల్లలు ఎందుకిలా చేస్తారు? దాన్ని ఎలా మార్చుకోవాలో ఇక్కడ చూడండి.
పిల్లలు ఎందుకు కొడతారంటే..
చిన్నపిల్లలకు తమ మనసులోని భావాలను, కోపాన్ని లేదా బాధను మాటల్లో వ్యక్తీకరించేంత భాషా పరిజ్ఞానం ఉండదు. అలాగే తమ ఉద్వేగాలను అదుపు చేసుకునే సామర్థ్యం వారి మెదడులో ఇంకా అభివృద్ధి చెందదు. ఏదైనా కావాలని మొండికేసినప్పుడు, ఫ్రస్ట్రేషన్‌కు గురైనప్పుడు, విపరీతమైన ఆకలి లేదా నిద్ర వస్తున్నప్పుడు వారు తమ చేతులతో కొట్టి ఆ భావాలను బయటపెడతారు. అలాగే జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో గందరగోళానికి గురైనప్పుడు కూడా ఇలా ప్రవర్తిస్తారని డాక్టర్ మహేష్ తెలిపారు.
చాలాసార్లు పిల్లలు తాము కొడితే మీరు ఎలా స్పందిస్తారో చూడాలనే కుతూహలంతో ఇలా చేస్తుంటారు. మీ హద్దులను పరీక్షిస్తుంటారు. ముఖ్యంగా ఈ వయసులో ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే ఎంపతీ వారికి పూర్తిగా అలవడదు. తాము కొడితే అమ్మకో, నాన్నకో నొప్పి కలుగుతుందనే విషయం వారికి నిజంగానే తెలియదు.
ఈ ప్రవర్తనను ప్రేమతో ఎలా మార్చాలి?
పిల్లలు కొట్టగానే అరుస్తూ, కోపపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ కింది పద్ధతులను పాటించి చూడండి.
ప్రశాంతంగా ఉండండి: బిడ్డ కొట్టిన వెంటనే కోపపడకండి. మీ ముఖంలో ఎలాంటి హావభావాలు చూపించకుండా ప్రశాంతంగా ఉండండి.
మృదువుగా తాకడం నేర్పండి: స్థిరమైన స్వరంతో "కొట్టకూడదు.. చేతులతో నెమ్మదిగా తాకాలి అని స్పష్టంగా చెప్పండి. వారి చేతులను మీ చేతుల్లోకి తీసుకుని, ఎలా మృదువుగా తాకాలో, ఎలా ప్రేమగా నిమరాలో వారికి ప్రాక్టికల్‌గా చేసి చూపించండి.
స్క్రీన్ టైమ్ తగ్గించండి: మొబైల్ ఫోన్లు, టీవీల వల్ల పిల్లల మెదడుపై విపరీతమైన ఒత్తిడి పడి, వారు అగ్రెసివ్‌గా మారతారు. కాబట్టి స్క్రీన్లకు వారిని సాధ్యమైనంత దూరంగా ఉంచండి.
భావాలను గుర్తించండి: పిల్లలు శాంతించిన తర్వాత వారి భావాలను వారితో పంచుకోండి. నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. కోపం రావడం సహజమే.. కానీ అలా అని ఇతరులను కొట్టడం మాత్రం తప్పు అని సున్నితంగా వివరించండి.
పిల్లలు ఇలా చేయడం అనేది ఎదుగుదలలో ఒక దశ మాత్రమే. మీరు ప్రతిసారీ స్థిరంగా, ఓపికగా ఒకేలా స్పందిస్తే, వారు తమ ఉద్వేగాలను నియంత్రించుకోవడం నెమ్మదిగా నేర్చుకుంటారు. ప్రేమతో, ఓర్పుతో మీ చిన్నారి ప్రవర్తనను కచ్చితంగా మార్చవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
