Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
యూట్యూబ్ వీడియో చూసి గర్భిణీ ప్రసవం, ఆపై మృతి.. సొంత చికిత్సలతో ఎంత ప్రమాదమో తెలుసా.!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా విషయాలపై ప్రజలకు అవగాహన పెరుగుతోంది. అయితే ఏ విషయమైనా తెలుసుకోవడానికి, పాటించడానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. అది హద్దులు దాటినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా తమిళనాడులో ఓ నిండు గర్భిణీ యూట్యూబ్ వీడియో ఆధారంగా ప్రసవిస్తూ నిండు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన సర్వత్రా ఆందోళన కలిగించడంతో పాటు చర్చకు దారితీసింది. యూట్యూబ్ వీడియోలు చూసి సొంత వైద్యం చేసుకోవడం ఎంత ప్రమాదకరమో ప్రజలు గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఇలా మాధ్యమం ఏదైనా సరే కాలక్షేపం కోసం, లేదా ఏదైనా విషయాలు తెలుసుకోవడం సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం పరిపాటి అయింది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి విషయాల కోసం చాలా మంది ఈ ప్లాట్‌ఫామ్స్‌ను సెర్చ్ చేస్తుంటారు. అయితే వీటిని తెలుసుకోవడం మంచిదే. కానీ డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా కొన్ని ఆరోగ్య సమస్యలకు సొంతంగా చికిత్స తీసుకోవడం అస్సలు మంచిది కాదని తమిళనాడు ఘటన ఉదహరిస్తుంది.
తమిళనాడుకి చెందిన గర్భిణీ మొదటి కాన్పులో సిజేరియన్ కావడంతో.. రెండో కాన్పులో ఎలా అయినా సుఖ ప్రసవం కావాలని భావించింది. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు తోడు కావడంతో మొదటి నుంచి ప్రసవానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోలు ఫాలో అవుతూ వచ్చారు. ఆ రోజు రానే వచ్చింది. నార్మల్ డెలివరీ బాగానే జరిగి.. పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. మాయకి సంబంధించి సమస్యలు తీవ్రమై తీవ్ర రక్తస్రావం జరిగి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. తల్లి మృతి చెందింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు పలు చోట్ల చోటుచేసుకున్నాయి.

మరోసారి ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం కలవరపెడుతోంది. పూర్వకాలం మాదిరిగా మంత్రసాని కాన్పులు చేసే రోజులు కావు ఇవి అని గమనించాలి. గర్భం దాల్చిన రోజు నుంచి బిడ్డను కని ఆరోగ్యంగా ఇంటికి చేరేవరకు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. అధిక రక్తస్రావం, గర్భంలో శిశువు సరిగా లేకపోవడం, ఆక్సిజన్ అందకపోవడం లాంటి సమస్యలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఇంట్లో ప్రసవం శ్రేయస్కరం కాదు. ఒక్క ప్రెగ్నెన్సీ సంబంధించిన విషయాలే కాదు ఇతర ఆరోగ్య సమస్యల విషయంలోనూ సోషల్ మీడియా సూచించే సొంత విషయం పనికిరాదు. సంబంధిత వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు. మరి ఎలాంటి పరిస్థితుల్లో యూట్యూబ్ లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌ల సలహా తీసుకోకూడదో చూద్దాం..
లక్షణాలు చూసి మందులు వాడటం
మీకు ఉన్న అనారోగ్య లక్షణాల ఆధారంగా సొంతంగా వైద్యం చేసుకోకూడదు. చాలా వరకు అనారోగ్యాల లక్షణాలు ఒకే విధంగా ఉన్నా.. శరీర పరిస్థితిని బట్టి చికిత్సలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే సొంత చికిత్స పరిస్థితిని దిగజారుస్తుంది. మీకు అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇంటి చికిత్సలు
జలబు, దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఇంట్లోనే చికిత్స చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ ఇంకా.. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల సమస్యలు ఉన్నప్పుడు ఇంటి చికిత్సలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. సంబంధింత వైద్యుల సలహా లేకుండా చికిత్సతీసుకోకూడదు.
ఇంట్లోనే వైద్యం
శరీరానికి ఎక్కడైనా దెబ్బ తగిలి రక్తస్రావం జరిగినా లేదంటే శరీరం లోపల దెబ్బలు తగిలినా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. గాయానికి కుట్లు వేయడం, ఇంజెక్షన్, డెంటల్ ప్రాబ్లమ్స్ తదితర చికిత్సలన్నీ శిక్షణ పొందిన వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. యూట్యూబ్ వీడియోల ద్వారా సొంత చికిత్సకు పాల్పడితే ఇన్‌ఫెక్షన్‌కి గురయ్యే ప్రమాదం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications