Latest Updates
-
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.?
National Doctor's Day 2026: తెల్ల కోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లు..డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి
భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల(national doctor's day) దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రముఖ డాక్టర్, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ రెండవ సీఎం అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (Dr. B.C. Roy) గారికి నివాళిగా ఈ రోజును జరుపుకుంటారు. విశేషమేమిటంటే ఆయన జన్మించింది (జులై 1, 1882), మరణించింది (జులై 1, 1962) ఒకే తేదీన.

వైద్య రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను 1961లో ఆయనకు భారత రత్న పురస్కారం లభించింది. ఆయన సేవలను స్మరించుకుంటూ భారత ప్రభుత్వం 1991లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించింది.
వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవుడితో సమానం అని మన పురాణాలు చెబుతున్నాయి. ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవళ్లు తమ వ్యక్తిగత జీవితాలను సైతం పక్కనపెట్టి నిస్వార్థంగా శ్రమించే వైద్యుల సేవలను, త్యాగాలను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ రోజు అత్యంత ముఖ్యమైనది. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మీ కుటుంబంలో,బంధువులలోని లేదా మీకు తెలిసిన,ఇష్టమైన డాక్టర్లకు విషెస్ ను ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి.
నేషనల్ డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి
-మానవత్వానికి నిలువెత్తు రూపమైన వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-రోగి బాదను తమ బాదగా భావించి చికిత్స అందించే గొప్ప మనసున్న డాక్టర్లకు వందనాలు.
-మరణం అంచుల్లో ఉన్నవారికి సైతం పునర్జన్మ ప్రసాదించే మీకు జన్మజన్మల కృతజ్ఞతలు.
-మీరు వేసే ప్రతి అడుగు, రాసే ప్రతి మందు ఒకరి జీవితంలో వెలుగులు నింపుతుంది. హ్యాపీ డాక్టర్స్ డే.
-సమాజం ఆరోగ్యంగా ఉందంటే దానికి కారణం మీరే. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-కంటికి కనిపించని దేవుడు మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నందుకు ధన్యవాదాలు.
-డాక్టర్ గా మీరు చేస్తున్న సేవలకు ఈ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. హ్యాపీ డాక్టర్స్ డే.
-చీకటిలో ఉన్న ప్రాణానికి వెలుగునిచ్చే దేవుళ్లు మీరు. జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.

నేషనల్ డాక్టర్స్ డే వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్ లు
-దేవుడు ప్రాణం పోస్తే, డాక్టర్ ఆ ప్రాణాన్ని కాపాడతాడు. వైద్యులందరికీ హ్యాపీ డాక్టర్స్ డే.
-తెల్ల కోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.
-మందుల కంటే ముందు ధైర్యాన్ని ఇచ్చే ప్రతి వైద్యుడికి పాదాభివందనం.
-భూమిపై ఉన్న ప్రాణదాతలకు కృతజ్ఞతలు. హ్యాపీ డాక్టర్స్ డే.
-తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులకు సెల్యూట్.
-నా ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుతున్న నా డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
-ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు.. మా డాక్టర్ గారు.
-విశ్రాంతి ఎరుగక సేవలు అందిస్తున్న డాక్టర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
-డాక్టర్ల త్యాగాలు వెలకట్టలేనివి. జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.
-ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కంటే గొప్ప దైవకార్యం మరొకటి లేదు. సెల్యూట్ టు డాక్టర్స్.
స్ఫూర్తిదాయకమైన కోట్స్
-మంచి వైద్యుడు వ్యాధిని నయం చేస్తాడు, గొప్ప వైద్యుడు ఆ వ్యాధితో బాధపడుతున్న రోగిని నయం చేస్తాడు.
-వైద్యం అనేది వృత్తి కాదు, అదొక పవిత్రమైన బాధ్యత.
-చేతుల్లో ప్రాణాన్ని, గుండెల్లో కరుణను నింపుకున్న వారే నిజమైన వైద్యులు.
-ప్రపంచంలో ఏ మందూ చేయలేని మాయను ఒక వైద్యుడి భరోసా చేస్తుంది.
-కత్తితో ప్రాణాలు తీసేవారు ఉంటారు, కానీ అదే కత్తితో ప్రాణాలు పోసేవాడు డాక్టర్.
-ప్రతి సర్జరీ వెనుక ఎన్నో ఏళ్ల కృషి, నిద్రలేని రాత్రులు ఉంటాయి. డాక్టర్ల సేవలు అమూల్యం.
-మనం నిద్రిస్తున్నప్పుడు మన కోసం మెలకువగా ఉండేది ఇద్దరే.. సరిహద్దుల్లో సైనికుడు, హాస్పిటల్ లో డాక్టర్.
-వ్యాధిని జయించాలనే నమ్మకాన్ని రోగికి కలిగించడమే డాక్టర్ తొలి విజయం.
-ప్రాణాలతో చెలగాటం ఆడే మృత్యువును సైతం ఎదిరించి నిలబడే యోధుడు డాక్టర్.\
-డాక్టర్ చేతి స్పర్శలో సగం జబ్బు నయమైపోయే శక్తి ఉంటుంది.
షార్ట్ మెసేజ్ లు ఇలా పంపండి
-రియల్ లైఫ్ హీరోలకు హ్యాపీ డాక్టర్స్ డే.
-ప్రాణదాతలకు పాదాభివందనం.
-భూమిపై నడిచే దేవుళ్లకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-మీ నైపుణ్యానికి, దయకు థాంక్యూ డాక్టర్.
-రోగుల పాలిట పెన్నిధివి నీవు. హ్యాపీ డాక్టర్స్ డే.
-మరణాన్ని సైతం ఓడించే సత్తా మీ సొంతం. సెల్యూట్.
-మీరు వేసుకునే స్టెతస్కోప్.. దేవుడు ఇచ్చిన పూలదండ లాంటిది.
-సర్వేజనా సుఖినో భవంతు అని కోరుకునే తొలి వ్యక్తి డాక్టర్.
-ప్రాణాలు పోసే ప్రతి వైద్యుడికి పేరుపేరునా జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications