Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
పెయిన్ కిల్లర్స్ వద్దు.. సోంపు టీ ముద్దు!.. నెలసరి నొప్పులకు చెక్ పెట్టే అద్భుత ఔషధం!
మహిళలకు ప్రతి నెలా వచ్చే నెలసరి (పీరియడ్స్) ఎన్నో శారీరక ఇబ్బందులను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మహిళలకు కడుపు నొప్పి (క్రాంప్స్), గ్యాస్, పొట్ట ఉబ్బరం, కడుపు బరువుగా అనిపించడం వంటివి సర్వసాధారణంగా వేధించే సమస్యలు. ఈ ఇబ్బందుల వల్ల రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది.

అయితే ఇలాంటి సమయాల్లో పెయిన్ కిల్లర్స్ వాడే బదులు మన వంటగదిలోనే ఉండే అద్భుతమైన ఔషధం సోంపును ఉపయోగించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సోంపుతో చేసిన వేడి వేడి టీ తాగడం ద్వారా ఈ సమస్యలన్నింటికీ సులభంగా చెక్ పెట్టవచ్చంటున్నారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా కడుపుకు ఎంతో హాయినిచ్చి, శరీరాన్ని తేలికపరుస్తుంది.
కడుపు నొప్పి, ఉబ్బరానికి సోంపు ఎలా పనిచేస్తుంది?
సోంపు గింజలు సహజ సిద్ధమైన జీర్ణ సహాయకారిగా పనిచేస్తాయి. పీరియడ్స్ సమయంలో పొట్ట ఉబ్బరం, గ్యాస్ వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడంలో సోంపులోని ఔషధ గుణాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది కడుపులోని కండరాలను శాంతపరిచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ టీ తాగిన కొద్దిసేపటికే కడుపునొప్పి తగ్గి, పొట్ట తేలికగా మారిన అనుభూతి కలుగుతుంది.
సోంపులోని దివ్యమైన ఔషధ గుణాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ప్రకారం.. సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, నొప్పిని నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఏర్పడే వాపును తగ్గిస్తాయి. నెలసరి సమయంలో శరీరంలో నీరు చేరి ఉబ్బరంగా అనిపించడం సహజం.
సోంపు టీ ఈ అదనపు ద్రవాలను శరీరం నుండి బయటకు పంపడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా మితంగా తీసుకుంటే గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి పొట్ట సమస్యలు దరిచేరవు.

ఇంట్లోనే సులభంగా సోంపు టీ తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు తీసుకుని వేడి చేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో ఒక టీస్పూన్ సోంపు గింజలు వేయండి. సన్నని మంటపై సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి టీని వడకట్టండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే మంచిది. మరింత రుచి కోసం కొద్దిగా స్వచ్ఛమైన తేనె కలుపుకోవచ్చు.
సోంపు టీ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు
కేవలం నెలసరి నొప్పులకే కాకుండా సోంపు టీ వల్ల మరిన్ని అద్భుత లాభాలు కూడా ఉన్నాయి. శరీరానికి, మెదడుకు తక్షణ తాజాదనాన్ని అందిస్తుంది. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియను మెరుగుపరిచి, బరువు అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
రక్తంలోని మలినాలను తొలగించి, చర్మాన్ని ఎంతో కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. దగ్గు, జలుబు వంటి తేలికపాటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు, ఏదైనా తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దీనిని రోజువారీగా తీసుకునే ముందు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications