Latest Updates
-
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు!
వేగంగా జుట్టును పెరుగుదలను ప్రోత్సహించే విటమిన్ బి రిచ్ ఫుడ్స్...
జుత్తు పొడిబారకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడుతూ ఉండాలి. కొందరిలో జుట్టు అందవిహీనంగా, నిర్జీవంగా మారడానికి పోషకాహారలోపం ప్రధాన కారణం అంటున్నారు కొందరు సౌందర్య నిపుణులు. పోషకాహారం తీసుకోవడం అన్నది శరీరానికే కాకుండా శిరోజాలకు చాలా మేలు చేకూరుస్తుందని వారు చెబుతున్నారు. పోషకాహారం తీసుకోవడం వలన జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలను తేలికగానే అధిగమించవచ్చు.
జుట్టు రాలిపోతున్నదని చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. పలు రకాల నూనెలు రాసి, జుట్టు రాలడాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు ఆరోగ్యమైన జుట్టును పొందే వీలుందంటున్నారు నిపుణులు. కాబట్టి నిగనిగలాడే జుట్టు కోసం విటమిన్స్ అధికంగా ఉండే ఆహారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి .
జుట్టు పెరుగుదలలో విటమిన్ బి ప్రధాన పాత్రపోషిస్తుంది . జుట్టు రాలడం అరికట్టాలంటే మీరు తీసుకొనే రెగ్యులర్ డైట్ లో విటమిన్ బి అధికంగా ఉండే అన్ని రకాల ఆహారపదార్థాలను చేర్చుకోవాలి. ఈ విటమిన్స్ మీ జుట్టు పొడవుగా, స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా మార్చుతాయి. జుట్టు పెరుగుదలకు ఈ విటమిన్స్ చాలా మేలు చేస్తాయి.
జుట్టు పెరుగుదల కోసం వివిధ రకాల హెయిర్ మాస్క్ లు మరియు ఇతర ఉత్పత్తులను తలకు ఉపయోగిస్తున్నారు. ఇవి ఉపయోగకరమైనా శరీరానికి తగినంత విటమిన్స్ అందకపోతే ఎన్ని హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకొన్న ప్రయోజనం ఉండదు . మరి స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? జుట్టు పెరుగుదలకు సహాయపడే కొన్ని విటమిన్స్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా....

చికెన్ :
హెల్తీ హెయిర్ గ్రోత్ కు ప్రోటీనులు అధికంగా సహాయపడుతాయి . ప్రోటీనులతోనే హెయిర్ పెరుగుదల ఉంటుంది. ప్రోటీనుల లోపం వల్ల జుట్టు డ్రై గా మరియు డల్ గా, చిట్లినట్లు మారుతుంది. మరియు ఇది హెయిర్ స్ట్రక్చర్ మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి., చికెన్ మరియు గుడ్లు రెండూ ప్రోటీనులకు మంచి సోర్స్ . వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హెల్తీగా జుట్టు పెరగడానికి సహాయపడుతాయి.

లెంటిల్స్:
జుట్టు పెరుగుదలలో సూపర్ ఫుడ్స్ లెంటిల్స్ . చూడటానికి చిరుధాన్యాలైనా, వీటిలో ఫైబర్, ఐరన్, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ మరియు మెగ్నీషియంలు అధికంగా ఉంటాయి . ఇది బ్లడ్ సర్కులేషన్ ను పెంచి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

నట్స్:
నట్స్ లో పీనట్స్ మరియు బాదం వంటివి హెల్తీ హెయిర్ కోసం చాలా ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రాలిపోయిన జుట్టును తిరిగి పొందడానికి సహాయపడుతాయి . వీటిలో ఉండే జింక్ హెయిర్ లాస్ ను కూడా నివారిస్తుంది. ఈ నట్స్ లో ఉండే విటమిన్ ఇ జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది.

సాల్మన్:
సాల్మన్ ఫిష్ హెల్తీ హెయిర్ ను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వీటిలో విటమిన్ బి12, ఐరన్, ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్ హెయిర్ ఫాలిసెల్స్ కు ఆక్సిజన్ సప్లై చేస్తుంది . కాబట్టి రెగ్యులర్ డైట్ లో సాల్మన్ ఉండేట్లు చూసుకోవాలి.

చిక్ పీస్:
శెనగలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.శెనగలు పూర్తి పోషకాంశాలతో నిండి ఉంటుంది . ముఖ్యంగా జింక్ మరియు విటమిన్ బి6లు ఉంటాయి. చిక్ పీస్ తినడం వల్ల స్ట్రాంగ్ అండ్ హెల్తీ ఒత్తైన కేశాల పెరుగుదలకు సహాయపడుతుంది.

మష్రుమ్:
మష్రుమ్స్ లో విటిమన్స్ అధికంగా ఉన్నాయి. ఆస్పరాగస్ మరియు త్రుణధాన్యాలు మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్ బి2 అధికంగా ఉండటం వల్ల వీటిని స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ పొందడానికి తీసుకోవచ్చు.

ఆరెంజ్:
ఈ రెండింటిని సిట్రస్ పండ్లైన ఆరెంజ్, లెమన్, స్ట్రాబెర్రీ, పైనాపిల్ మరియు టమోటోల్లో అధికంగా చూశాము . ఈ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకవడం వల్ల జుట్టు రాలడం అరికట్టవచ్చు. జుట్టు వేగంగా పెంచుకోవడానికి ఇవి ఒక బెస్ట్ విటమిన్ ఫుడ్స్.

అరటిపండ్లు,
అరటిపండ్లు, ఆస్పరాగస్, పచ్చిబఠానీలు, బెల్ పెప్పర్స్, బేక్డ్ పొటాటోస్, నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు అవొకాడోల్లో విటమిన్ బి6 లేదా పైరిడాక్సిన్ రిచ్ ఫుడ్స్ అధికంగా ఉన్నాయి. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హెల్తీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ పొందవచ్చు.

గుడ్డు:
విటమిన్స్ గుడ్డు పచ్చసొన, కార్న్, కేల, లెగ్యుమ్స్ , కాలీఫ్లవర్, బ్రొకోలీ, చికెన్, సాల్మన్ మరియు ధాన్యాలో అధికంగా ఉంటాయి . ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడటానికి నివారిస్తుంది. హెయిర్ గ్రోత్ కు సహాయపడే ఉత్తమ ఆహారాలివి.

బీట్ రూట్ :
విటమిన్ బి9 లేదా ఫోలిక్ యాసిడ్ : ఈ విటమిన్స్ ఆస్పరాగస్, పీస్, గ్రీన్ వెజిటేబుల్స్, బీట్ రూట్ మరియు లెంటిల్స్ లో అధికంగా ఉన్నాయి . ఈ రెండు విటమిన్స్ అధికంగా ఉండే ఈ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు రాలడం నివారించడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్స్.

ఖర్జూరం:
ఇనుము లోపం వలన కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరంలో ఇనుము అధికంగా లభిస్తుంది. ఖర్జూరం ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

కొబ్బరి నీళ్ళు మరియు నీరు :
నీటితో పాటు కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, సలాడ్ లు అధికంగా తీసుకోవాలి. వీటిలో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉండటం వల్ల జుట్టు రాలడం అరికడుతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

పీనట్స్
పీనట్స్ లో నియాసిన్ బీఫ్ లివర్, ఫిష్, బీట్ రూట్, పీనట్, బీఫ్ మరియు సన్ ఫ్లవర్ సీడ్స్ లో బి3 అధికంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్యలను నివారించుకోవడం కోసం ఈ విటమిన్ ఫుడ్స్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి.



Click it and Unblock the Notifications