జామ, జామకాయ జ్యూస్ లో ఉండే మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్ ..!!

జామకాయ అంటే పిల్లల నుండి పెద్దల వరకూ ప్రతి ఒక్కరీకి ఇష్టమైన పండు. పేదల పాలిటి ప్రియ నేస్తం జామకాయ. మార్కెట్లో ఉండే పండ్లలో అన్నింటికంటే చౌకైనది. అందుకే ఇది బాగా పాపులర్ అయ్యింది. గ్రీన్ కలర్లో నోరూరిం

జామకాయ అంటే పిల్లల నుండి పెద్దల వరకూ ప్రతి ఒక్కరీకి ఇష్టమైన పండు. పేదల పాలిటి ప్రియ నేస్తం జామకాయ. మార్కెట్లో ఉండే పండ్లలో అన్నింటికంటే చౌకైనది. అందుకే ఇది బాగా పాపులర్ అయ్యింది. గ్రీన్ కలర్లో నోరూరించే జామకాయ అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. కేవలం రుచి మాత్రమే కాదు, అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే .

 15 Awesome Health Benefits of Guava Juice

ఈ అమేజింగ్ ఫ్రూట్ ల మినిరల్స్, విటమిన్స్, ఇతర పోషకాంశాలు అధికంగా ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇతర ఫ్రూట్స్ లో కంటే వీటిలో ఎక్కువ. జామ కాయలోలాగే, జామకాయతో చేసే జ్యూస్ లో కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవి సీజన్స్ లో జామ కాయ జ్యూస్ తాగడం వల్ల రిఫ్రెషింగ్ గా ఫీలవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కావల్సిన అన్ని రకాల న్యూట్రీషియన్స్, మినిరల్స్ ను అందిస్తుంది.

జామకాయ జ్యూస్ తాగడం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

వ్యాధినిరోధకత పెంచుతుంది:

వ్యాధినిరోధకత పెంచుతుంది:

జామ కాయ జ్యూస్ లో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో అన్ని రకాల వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ను పెంచుతుంది. . ప్యాథోజెన్స్ నుండి శరీరంను కాపాడుతుంది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

జామకాయ జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి, శరీరానికి రక్షణ కల్పించడంలో చాలా సహాయకారిణిగా పనిచేస్తుంది. క్యాన్సర్ ట్యూమర్స్ పెరగకుండా నివారిస్తుంది. ముఖ్యంగా లైకోపిన్ మరియు క్యుర్సిటిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. . ముఖ్యంగా ప్రొస్టెట్ , బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

 డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది:

డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది:

రెగ్యులర్ గా గోవ జ్యూస్ (జామకాయ జ్యూస్)తాగడం వల్ల డయాబెటిస్ నుండి రక్షణ కల్పిస్తుంది. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ జామకాయలో గ్లిజమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా నివారిస్తుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల గ్లూకోజ్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది.

హార్ట్ హెల్తీ:

హార్ట్ హెల్తీ:

ఒక గ్లాసు జామకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి కావల్సిన సోడియం, పొటాషియంలు అద్భుతంగా అందుతాయి. ఇది బ్లడ్ ప్రెజర్ మరియు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది. శరీరంలో రక్తంలోని హెచ్ డిఎల్(మంచి ) కొలెస్ట్రాల్ ను పెరగడానికి సహాయపడుతుంది. దాంతో హార్ట్ హెల్తీగా ఉంటుంది,.

మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

జామకాయ తిన్నా, జామకాయ జ్యూస్ తాగినా వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండుట వల్ల మలబద్దక సమస్యలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. హెల్తీ అండ్ స్మూత్ డైజషన్ కు సహాయపడుతుంది.

కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది:

కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది:

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జామ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. వయస్సు రిత్యా వచ్చే కళ్ళ సంబంధిత సమస్యలు, వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జామ జ్యూస్ లో ఉండే విటమిన్ ఎ అందకు గ్రేట్ గా సహాయపడుతుంది.

ఓరల్ హెల్త్ :

ఓరల్ హెల్త్ :

దంతాల నొప్పి, దంత క్షయాన్ని నివారించడంలో జామ కాయ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది దంతా నొప్పి తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ స్వభావం కలిగి ఉంటుంది.

స్ట్రెస్ తగ్గిస్తుంది:

స్ట్రెస్ తగ్గిస్తుంది:

జామకాయలో ఉండే మెగ్నీసియం, నర్వెస్ సిస్టమ్ ను స్మూత్ గా మారుస్తుంది. నరాలను, కండరాలను స్మూత్ గా మార్చుతుంది. ఇది టెన్షన్ తగ్గిస్తుంది.

 బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

జామకాయ జ్యూస్ లో ఉండే ఫైబర్ మరియు మినిరల్స్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి బాడీ వెయిట్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. కోలన్లో ఫ్యాట్ కరిగిస్తుంది.

స్కర్వ్యు:

స్కర్వ్యు:

జామకాయ జ్యూస్ లో ఉండే విటమిన్ సి ఆరెంజ్ లో కంటే ఎక్కువ. అందువల్ల స్కర్వ్యు వంటి వ్యాధుల చికిత్సలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

థైరాయిడ్ :

థైరాయిడ్ :

జామకాయ జ్యూస్ లో కాపర్ అధికంగా ఉండటం వల్ల హార్మోన్ రెగ్యులేషన్ మరియు హార్మోన్స్ కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. శరీరంలో మెటబాలిక్ రేటు పెంచుతుంది. థైరాయిడ్ ఫంక్షన్స్ కంట్రోల్లో ఉండటం వల్ల శరీర ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది.

 కంప్లెక్షన్ :

కంప్లెక్షన్ :

జామకాయ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్, మరియు ఆస్ట్రిజెంట్ గుణాలు చర్మం కాంతివంతంగా ప్రకాశవంతంగా మార్చుతుంది. చర్మంలో ఎలాంటి మచ్చలైనా, మార్క్సైనా నివారిస్తుంది.

. స్కిన్ ఏజింగ్ :

. స్కిన్ ఏజింగ్ :

జామకాయ జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు మినిరల్స్ చర్మ రంద్రాలను టైట్ గా మార్చి, కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

జలుబు దగ్గు నివారిస్తుంది:

జలుబు దగ్గు నివారిస్తుంది:

జామకాయ జ్యూస్ ను తాగడం వల్ల రెస్పిరేటరీ ట్రాక్ ఫ్రీ అవుతుంది. మ్యూకస్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, ఫ్లూ లక్షణాలను నివారిస్తుంది. ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా నివారిస్తుంది. అందుకు అవసరమయ్యే ఇమ్యూనిటిని పెంచుతుంది.

హెల్తీ మైండ్ :

హెల్తీ మైండ్ :

విటమిన్ బి, బి6 లు మతిమరుపును నివారిస్తాయి, బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి. బ్రెయిన్ సెల్స్ ను ఉత్తేజపరిచి, బ్రెయిన్ షార్ప్ గా ఉంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో మతిమరుపు, ఇతర సమస్యలుండవు.

Story first published: Tuesday, February 7, 2017, 19:30 [IST]
Desktop Bottom Promotion