Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్‌లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
మీ పాదాలు చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు.. ఇలా ఉంటే అస్సలు నిర్లక్ష్యం వద్దు.!
శరీరంలో ప్రతి భాగం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. లేదంటే ఆ ప్రభావం వెంటనే చూపిస్తుంది. ముఖ్యంగా పాదాలు. మన హెల్త్ కండిషన్ ఎలా ఉందనేని మన పాదాలను చూసి చెప్పేయొచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. మన శరీరంలో ఏమైనా పోషకాలు లోపించినా ఆ ప్రభావం వెంటనే పాదాల పైన చూపిస్తుందట. మరి అదేంటో తెలుసుకుందాం..

పాదాల ఆరోగ్యం మన బాడీలో చురుకైన కదలికలు, శ్రేయస్సుకి కీలకం. రోజంతా మన శరీర బరువును మోసే పాదాలను సంరక్షించుకోవడం ముఖ్యం. అయితే మన పాదాలు ఆరోగ్యకరంగా లేకపోతే మన శరీరంలో పలు పోషకాలు, విటమిన్ల లోపాన్ని ఎత్తిచూపిస్తుంది. అందుకే పాదాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. మీరు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఉబ్బిన సిరలు
కొందరిలో మోకాళ్ల నుంచి పాదాల వరకు సిరలు ఉబ్బిపోయి మెలికలు తిరిగి బయటకు కనిపిస్తుంటాయి. ఇలా ఉన్నట్లయితే అది అధిక రక్తపోటుకి సంకేతమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ సేపు నిలబడి ఉండటం, గంటల తరబడి నిలబడి పనిచేయడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందని అంటున్నారు.
పాదాల వాపు
పాదాల పై నుంచి కింద వరకు బాగా వాపు ఉన్నట్లయితే అది ఆరోగ్యానికి సంబంధించి హెచ్చరిక సంకేతం. పాదాల వాపు కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులను సూచిస్తుంది. అదేవిధంగా గర్భిణుల్లో కూడా హార్మోన్ల ప్రభావం కారణంగా పాదాల వాపు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
పాదాల పగుళ్లు
కొందరిలో చలికాలం, వానాకాలంలో కాళ్ల పగుళ్లు ఏర్పడతాయి. మరికొందరిలో కాలంతో సంబంధం లేకుండా కాళ్లు పగులుతుంటాయి. విటమిన్ బి3 లోపం, ఐరన్, జింక్ లోపం డెఫీషియన్సీ కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. సరైన పోషకాహారం తీసుకుంటే వీటి లోపాన్ని అధిగమించవచ్చు.
పాదాలు మొద్దుబారడం
పాదాలు మొద్దుబారడం, జలదరింపు ఉన్నట్లయితే మీ శరీరంలో విటమిన్ బి 12 లోపించినట్లేనని పోషకాహార నిపుణులు అంటున్నారు. కాళ్ల తిమ్మిర్లు ఏర్పడినట్లయితే మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. శరీరంలో అయోడిన్, ఐరన్ లోపించినట్లయితే పాదాలు మాటిమాటికీ చల్లబడుతాయని నిపుణులు అంటున్నారు.
పోషకాల లోపాన్ని ఎలా అధిగమించాలి
పోషకాల లోపంతో పాదాల పగుళ్లు ఏర్పడినట్లయితే న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. పాల ఉత్పత్తులు, మాంసం, తృణ ధాన్యాలు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, వేరుశనగలు, పచ్చి బఠాణీలు, నువ్వులు వంటి వాటిని రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
పుష్కలంగా నీరు తాగాలి. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండటం ద్వారా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు రావని నిపుణుల సలహా. ఎక్కువ సేపు నిలబడి పనిచేసే వారు మధ్యమధ్యలో కాసేపు కూర్చోవడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. పాదాలను అప్పుడప్పుడూ గోరువెచ్చని నీటిలో మసాజ్ చేయడం, కడగడం ద్వారా పాదాలపై పేరుకుపోయిన సూక్ష్మ మలినాలు తొలుగుతాయి. అదేవిధంగా అలసట తీరి ప్రశాంతమైన నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications