Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.!
ఉరుకులు పరుగుల జీవితంలో సంపాదన, కెరీర్ గురించి మాత్రమే కాదు. ముఖ్యంగా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించాలని వైద్యులు ఎప్పుడూ చెబుతుంటారు. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు. అందుకే ఆరోగ్యరమైన జీవనశైలి కోసం మీ రోజును యోగాతో ప్రారంభించాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తుంటారు. రోజూ 20 నిమిషాల పాటు యోగా చేస్తే మీ డైలీ లైఫ్‌లో ఒక్కసారిగా సానుకూల మార్పులు వస్తాయని చెబుతున్నారు. ఆ యోగాసనాలు చూద్దాం..

యోగా అంటే చాలా కష్టంగా ఉండే ఆసనాలు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇందులో సులభంగా చేసే ఆసనాలు కూడా ఉన్నాయి. మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప స్వీయ వైద్యం ఇది అని చెప్పవచ్చు. ఎప్పుడూ చేయనివారు కూడా తమ ఆరోగ్యం కోసం ఈ సింపుల్ యోగాసనాలను ప్రయత్నించి కొద్ది రోజుల్లోనే శారీరక, మానసిక మార్పులను చూడవచ్చు.
నెక్ మూవ్‌మెంట్
ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత బాసింపట్టు వేసుకుని కూర్చోవాలి. రెండు నిమిషాల పాటు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేయాలి. మీ మెడభాగం వరకు 30 సెకన్ల పాటు గుండ్రంగా సవ్య, అపసవ్య దిశలో తిప్పుతూ ఉండాలి. దీని ద్వారా మెదడు భాగాలకి రక్త ప్రసరణ మెరుగవుతుంది.
భుజాల మూవ్‌మెంట్
చేతులను మోచేతుల వరకు మడుచుకుని మెడపై రెండు చేతులను ఆనించి సవ్య, అపసవ్య దిశలో తిప్పుతూ ఉండాలి. దీని ద్వారా భుజాల వద్ద కండరాలు దృఢంగా ఉంటాయి.
పాదాల కదలిక
యోగా మ్యాట్‌పై రెండు కాళ్లు చాపి కూర్చోవాలి. ఇప్పుడు పాదాలను పది- పది సార్లు చొప్పున సవ్య, అపసవ్య దిశలో ముందుకు వెనక్కి కదుపుతూ ఉండాలి. తర్వాత ఒక్కో కాలిని మోకాలి వరకు మలుచుకుని ముందుకు వెనక్కి చాపుతూ ఉండాలి.
బటర్‌ఫ్లై ఆసనం
బాసింగపట్టు వేసుకుని కూర్చుని చేతులను పాదాలను పట్టుకోవాలి. మోకాళ్లను పైకి కిందికి సీతాకోక చిలుక రెక్కల మాదిరిగా కదుపుతూ ఉండాలి. ఇలా 30 సెకన్ల పాటు చేయడం ద్వారా శరీరమంతా రక్త ప్రసరణ మెరుగవుతుంది. పొత్తి కడుపులో భాగాలపై ఒత్తిడి తగ్గి అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ట్విస్టెడ్ ఈజీ పోజ్
ముందుగా నేలపై కాళ్లు చాపి కూర్చోవాలి. ఇప్పుడు ఒక కాలుని మోకాలి వరకు మలుచుకోవాలి. తర్వాత కుడి చేతి మోచేతిని మోకాలికి ఆనించాలి. ఎడమ చేతిని నేలపై ఆనించాలి. తల భాగాన్ని ఎడమ చేతి వైపు తిప్పాలి. శ్వాస తీసుకుంటూ 20 సెకన్ల పాటు చేయాలి. ఈ యోగాసనం ద్వారా శరీరం ఉత్తేజితమవుతుంది.
క్యాట్- కౌ పోజ్
ఈ యోగాసనం కోసం ముందుగా బోర్లా పడుకుని మోకాళ్లని, మోచేతులను నేలపై ఆనించి పైకి లేవాలి. నడుము భాగం, తలను పైకి, కిందికి వంచుతూ 30 సెకన్ల పాటు చేయాలి.
ఈ సులభమైన యోగాసనాలను రోజూ 20 నిమిషాల పాటు చేయడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోజంతా మీరు చేసే పనుల్లో ఏకాగ్రతగా ఉండగలరు. బీపీ, షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
