Latest Updates
-
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు!
ఫోలిక్ యాసిడ్ ఒక్కటే కాదు.. కాబోయే తల్లికి అత్యవసరమయ్యే పోషకాలు ఇవే.!
మహిళ గర్భం ధరించిన నాటి నుంచి ప్రసవించే వరకు శరీరానికి అనేక పోషకాలు అవసరం. బిడ్డ ఎదుగుదలకు, తల్లి ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన శిశువు పుట్టేందుకు కీలకమైన పోషకాలను గైనకాలజజిస్టులు సిఫారసు చేస్తారు. ఈ సమయంలో ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్‌ను వైద్యులు సూచిస్తారు. అయితే ఫోలిక్ యాసిడ్‌తో పాటు అనేక ఇతర పోషకాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దాం..

గర్భం దాల్చిన సమయం నుంచి కాబోయే తల్లి శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలని గైనకాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీల్లో రక్తహీనత, నీరసం, వాంతులు ఇలా చాలా రకాలా మార్పులతో ఇబ్బందులు పడుతుంటారు. అందుకే మహిళ గర్భం ధరించాక వైద్యులు ఫోలిక్ యాసిడ్ తీసుకోమని సూచిస్తారు. అయితే దీంతో పాటు ఇతర పోషకాలు కూడా అవసరం అవుతాయని చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో శిశువు అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో తల్లికి శక్తి చాలా అవసరం. అందుకోసం తగినంత రక్త సరఫరా ఉండాలి. ఎముకల బలంతో పాటు రోగనిరోధక శక్తి లభించాలి. ఇవన్నీ సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతి స్త్రీ గర్భిణీ భిన్నంగా ఉన్నా.. ఈ కీలక 9 నెలల సమయంలో తప్పనిసరిగా ఏడు పోషకాలు తీసుకోవాలి.
ఫోలిక్ యాసిడ్
మహిళ గర్భం దాల్చిన తర్వాత మొదటి మూడు నెలల పాటు ఫోలిక్ యాసిడ్ చాలా కీలకం. శిశువు మెదడు, వెన్నుపాము అభివృద్ధికి ఫోలిక్ యాసిడ్ దోహదపడుతుంది. ఇదే విటమిన్ B9. ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. బలవర్ధకమైన ఆహాకరాలు తీసుకుంటే పోలిక్ యాసిడ్ లోపాన్ని నివారించవచ్చు.
ఐరన్
గర్భిణీల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. గర్భం ధరించాక తల్లితో పాటు శిశువు ఇద్దరి శరీరానికి ఎక్కువ రక్తం అవసరం పడుతుంది. ఐరన్ లోపిస్తే శరీరమంతా హిమోగ్లోబిన్ తయారీలో అంతరాయం ఏర్పడుతుంది. తద్వారా అలసట, నీరసం కూడా తలెత్తుతుంది. తరచూ పాలకూర, బెల్లం, గుడ్లు, చికెన్, చేపలు తీసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని నివారించవచ్చు.
కాల్షియం
గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఎముకల దృఢత్వానికి, దంతాల అభివృద్ధికి కాల్షియం అవసరం. శరీరంలో కాల్షియం లోపిస్తే ఎముకల బలహీనత ఏర్పడుతుంది. పాలు, పెరుగు, జున్ను, రాగి, ఆకుకూరలను రోజూ బోజనంలో చేర్చుకోవడం ద్వారా కాల్షియంను సమృద్ధిగా పొందవచ్చు.
విటమిన్ డి
శరీరం కాల్షియంను మెరుగ్గా గ్రహించాలంటే విటమిన్ డి అవసరం. ఎముకల బలంతో పాటు రోగనిరోధక శక్తికి, మొత్తం ఆరోగ్యానికి విటమిన్ తప్పనిసరిగా అందాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపు ఎండలో కూర్చోవడం ద్వారా విటమిన్ డిని శరీరం గ్రహిస్తుంది. గుడ్లు, పాలు, కొవ్వు చేపల ద్వారా ఈ విటమిన్‌ను పొందవచ్చు.
ప్రొటీన్
గర్భిణీల్లో శిశువు అవయవాలు, కండరాలు, ఇతర భాగాల అభివృద్ధికి ప్రొటీన్ తప్పనిసరిగా తీసుకోవాలి. తల్లి ఆరోగ్యానికి ప్రొటీన్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. గర్భాధారణ సయంలో తల్లి శరీరంలో జరిగే సానుకూల మార్పులకు ప్రొటీన్ దోహదపడుతుంది. పప్పులు, మొలకెత్తిన ధాన్యాలు, జున్ను, గుడ్లు, నట్స్, విత్తనాల ద్వారా దీనిని పొందవచ్చు.

ఒమేగా-3
శిశువు మెదడు, కళ్ల అభివృద్ధితో పాటు DHA కోసం ఒమెగా- 3 ఫ్యాటీ యాసిడ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. వాల్‌నట్స్, చియా సీడ్స్, చేపలు ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌కి ఉత్తమ వనరులు. శాకాహార మహిళలు గైనకాలజిస్టు సలహా మేరకు సప్లిమెంట్స్ వాడవచ్చు.
అయోడిన్
శరీరంలో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంథిలో సమస్యలు ఏర్పడవచ్చు. శిశువు మెదడు అభివృద్ధికి ఆరోగ్యకరమైన థైరాయిడ్ ఉండాలి. అయోడైజ్డ్ ఉప్పు, పాల ఉత్పత్తులు, గుడ్లు ద్వారా అయోడిన్ పొందవచ్చు. సరైన మోతాదులో రోజువారీ ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
