Latest Updates
-
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.!
కష్టపడకుండా ఇలా బరువు తగ్గండి.. ఈజీ చిట్కాలు..!
బరువు తగ్గాలంటే చాలా కష్టపడాలి. జిమ్‌లో గంటలు గంటలు గడిపి కార్డియో చేస్తేనో లేక రోజుకు 3 నుంచి ఐదు కిలోమీటర్లు తక్కువ స్పీడ్‌లో జాగింగ్ చేస్తేనో బరువు తొందరగా తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయ్. మీకు ఎలాంటి శ్రమ లేకుండా సులభంగా బరువు తగ్గేలా మేము మీకు కొన్ని చిట్కాలను అందిస్తాము. పనులతో బిజీగా ఉన్నవారు లేక ఎక్కువగా ఫిజికల్ వ్యాయామం చేయలేము అనుకున్నవారు ఈ పద్ధతులను పాఠించవచ్చు.
ఒత్తిడిని తగ్గించుకోవాలి
మానసిక ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల ఏమి తింటున్నారనే దానిపై అదుపు వుండదు. తోచినది తినడం, సమయపాలన లేకుండా భోజనం చేయడం వల్ల బరువు సులభంగా పెరుగుతారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుంటే అది పరోక్షంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది. మెడిటేషన్, ప్రాణాయామాలు చేయడం, బరువు తగ్గాలని చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.

స్నాక్స్ ఆపివేయండి
చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్లు లాంటి చిరుతిళ్లను, స్నాక్స్‌ను కొంత కాలంపాటు తగ్గించాలి. వాటికి బదులుగా పల్లీలు, పాప్‌కార్న్, మెలకలు, చెనగలు తింటే శరీరానికి కావలసిన పోషకాలు అందడమే కాకుండా బరువు తగ్గుతారు.
కూరగాయలు, పళ్లు
కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసం, కొన్ని పాల పదార్ధాలను తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, పోషకాలున్న పళ్లను తినడం ప్రారంభించాలి. పళ్లలో తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలుంటాయ్. పళ్లు, కూరగాయలతో జీర్ణసమస్య కూడా ఎక్కువ కాకుండా వుంటుంది.
కూల్‌డ్రింకులు తగ్గించాలి
ఈ ఎండాకాలంలో గోలిసోడా, థంప్సప్ లాంటి కూల్‌డ్రింక్స్ తీసుకోకపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కార్బన్ మాత్రమే కాదు బరువు పెరగడానికి కారణమయ్యే చెక్కర పదార్ధాలు కూడా వుంటాయ్. వీటికి బదులుగా హెర్బల్ టీలు, గ్రీన్ టీలు, రోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం లాంటి పానియాలను చేసుకొని తాగాలి.
కంటినిండా నిద్రపోవడం
ప్రతీ రోజూ కంటి నిండా నిద్రపోయినప్పుడు మాత్రమే బరువు పెరిగే సమస్యలు తలెత్తవు. లేకుంటే హార్మోన్ పనితీరుల్లో మార్పు వచ్చి ఆకలిని పెంచుతుంది. తక్కువగా నిద్రపోవడం, ఆకలి ఎక్కువ కావడం వల్ల ఎక్కువగా తిన్నప్పుడు సులభంగా బరువు పెరుగుతారు.
ప్రొటీన్ ఆహారం
ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉన్న పొటీన్ పదార్ధాలను మాత్రమే తినాలి. రెడ్‌మీట్‌లో కొవ్వు ఎక్కువగా వుంటుంది. అది కాకుండా చికెన్, చేపలు, చెనగలు లాంటి కొవ్వు తక్కువగా ఉన్న వాటిని తీసుకోవాలి.
హైడ్రేటెడ్
ఎండాకాలంలో మాత్రమే కాదు అన్ని సీజన్లలో ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల మంచి నీరును తాగాలి. నీళ్లు ఎక్కువ తాగడం వల్ల ఆకలి తక్కువగా అయి బరువును పరోక్షంగా తగ్గేందుకు దోహదపడుతుంది. ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె, కొద్దిగా నిమ్మరసం పిండుకొని కలుపుకొని తాగిగే 15 రోజుల్లో పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం స్టార్ట్ అవుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తేనె తొలగిస్తుంది. టమాట, దోసఖీరలు, పుచ్చపండ్లు తినడం వల్ల కూడా శరీరం హైడ్రేటెడ్‌గా వుంటుంది.
కష్టపడకుండా ఏదీ రాదు అనేది పాత సామెత కానీ ఇక్కడ మీరు మీ శరీరానికి ఎక్కువ శ్రమ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైట్‌ను పైన చెప్పిన విధంగా పాటిస్తే మీరు అతి తక్కువ సమయంలో సులభంగా బరువు తగ్గుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
